Stockholm International Peace Research Institute: ప్రపంచంలోని 9 అణ్వాయుధ దేశాలు తమ ఆయుధాలను అప్‌డేటే చేసుకున్నట్టు స్వీడన్‌కు చెందిన సంస్థ ఓ నివేదికని బహిర్గతం చేసింది. ఈ విషయంలో ఆయా దేశాలు పోటాపోటీగా ముందుకెళ్తున్నట్టు తెలిపింది. స్వీడన్‌కు చెందిన స్టాక్‌హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ సోమవారం ఓ సంచలన రిపోర్టు బహిర్గతం చేసింది. అమెరికా, రష్యా, ఫ్రాన్స్, చైనా, ఇండియా, పాకిస్థాన్ తమ వద్ద ఉన్న అణ్వాయుధాలను 2023లో అప్‌డేట్ చేసుకున్నాయని సిప్రీ పేర్కొంది. ఇందులో చాలా కొత్త ఆయుధాలు ఉన్నట్టు తెలిపింది.
చైనా వద్ద 500 యుద్ధ ట్యాంకులు
జనవరి 2023లో చైనా వద్ద 410 అణ్వాయుధాలు ఉంటే ఏడాదిలోపు వాటిని 500కు పెంచుకున్నట్టు సిప్రీ వెల్లడించింది. వీటి సంఖ్యను మరింత పెంచుకునే దిశగా ఆ దేశం చర్యలు తీసుకుంటుందని కూడా వివరించింది. చైనా వద్ద ఉన్న వార్‌హెడ్‌లలో 2100 బాలిస్టిక్ క్షిపణుల రూపంలో హై ఆపరేషన్ అలర్ట్ మోడ్‌లో ఉంచారని సిప్రి రిపోర్టు తేల్చింది. ఇవన్నీ కూడా రష్యా, అమెరికాకు చెందినవే. తొలిసారిగా చైనా కొన్ని వార్‌హెడ్‌లను హై ఆపరేషనల్ అలర్ట్‌లో ఉంచినట్టు బాహ్య ప్రపంచానికి తెలిసింది.
కొత్త అణ్వాయుధాలు తయారీ
చైనాతోపాటు అణ్వాయుధ దేశాలైన అమెరికా, రష్యా, బ్రిటన్, ఫ్రాన్స్, భారతదేశం, పాకిస్తాన్, ఉత్తర కొరియా, ఇజ్రాయెల్ తమ అణ్వాయుధాలను అప్‌గ్రేడ్ చేసుకుంటున్నాయి. అదే టైంలో కొత్త అణ్వాయుధాలు సిద్ధం చేసుకుంటున్నట్టు SIPRI తెలిపింది. ప్రపంచ వ్యాప్తంగా 2024 జనవరి నాటికి 12,121 వార్‌హెడ్‌లు ఉంటే... వాటిలో దాదాపు 9,585 సైనిక స్థావరాల్లో ఉంచారు. అవసరమైనప్పుడు వాడుకునేందుకు వీలుగా వీటిని రెడీ చేశారు. 3,904 వార్‌హెడ్‌లను క్షిపణుల, ఎయిర్‌క్రాఫ్ట్‌లతో అనుసంధానించారు. వీటి సంఖ్య జనవరి 2023తో పోల్చుకుంటే ఎక్కువ రూపొందించారు. మిగిలిన వాటిని సెంట్రల్ స్టోరేజీలో ఉంచారు.
ఈ సంస్థ చెప్పిన వివరాల ప్రకారం భారతదేశం, పాకిస్తాన్, ఉత్తర కొరియా బాలిస్టిక్ క్షిపణులపై మల్టిపుల్ వార్‌హెడ్‌లను మోహరించే సామర్థ్యాన్ని పెంపొందించుకుంటున్నాయి. రష్యా, ఫ్రాన్స్, యుకె, యుఎస్, చైనా ఇప్పటికే ఈ సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. .మల్టిపుల్ వార్‌హెడ్‌లలో లక్ష్యం దిశగా స్పీడ్‌గా దూసుకెళ్లే స్వభాన్ని కలిగి ఉంటాయి. గణనీయంగా ఎక్కువ లక్ష్యాలను నాశనం చేసే అవకాశం ఉంది. రష్యా, అమెరికా దాదాపు 90 శాతం అణ్వాయుధాలు కలిగి ఉన్నాయని SIPRI తెలిపింది.
2023తో పోల్చుకుంటే స్థానిక స్థావరాల్లో ఉండే యుద్ధ ట్యాంకుల సంఖ్య స్థిరంగా ఉందని నివేదిక తెలిపింది. జనవరి 2023 కంటే దాదాపు 36 వార్‌హెడ్‌లను రష్యా ఎక్కువ సిద్ధం చేసుకుంది. ఫిబ్రవరి 2022లో ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం చేసిన వేళ రెండు దేశాల్లోనూ అణు బలగాలకు సంబంధించి పారదర్శకత పూర్తిగా క్షీణించింది. దీంతో అణు భాగస్వామ్య చర్చలు జరగాల్సిన స్థితి మరింతగా పెరిగింది.
ఆయుధాలలో పోటీ పడుతున్న భారత్, పాకిస్తాన్
ఈ ఏడాది జనవరిలో భారత్ వద్ద అన్వాయుధాలు 172 ఉండగా, పాకిస్థాన్‌లో 170 ఉన్నాయి. భారత్ తన వద్ద ఉన్న అణ్వాయుధాలను 2023లో విస్తరించింది. ఈ రెండు దేశాలు 2023లో కొత్త రకాల న్యూక్లియర్ డెలివరీ సిస్టమ్‌లను అభివృద్ధి చేసుకున్నాయి.
"భారత అణ్వాయుధ నిరోధక టీంలో ఉన్నప్పటికీ పాకిస్థాన్, చైనా స్థాయి సామర్థ్యాన్ని పెంచుకునేందుకు ప్రాధాన్యతను చూపుతున్నట్లు కనిపిస్తోంది. సుదీర్ఘ లక్ష్యాలను చేరుకునే ఛేదించే అణ్వాయుధాల సమకూర్చునే పనిలో ఉన్నట్టు" అని నివేదిక పేర్కొంది.