Independence Day 2022 Google Doodle: నేడు యావత్ భారతావని స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్ని జరుపుకుంటోంది. అందులోనూ 75వ ఇండిపెండెన్స్ డే కావడంతో కేంద్ర ప్రభుత్వం ఈ స్పెషల్ డేని ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ గా నిర్వహిస్తోంది. అన్ని రాష్ట్ర, కేంద్ర పాలిత ప్రాంతాలు 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్ని ఘనంగా నిర్వహిస్తున్నాయి. భారత ఇండిపెండెన్స్ డే సందర్భంగా సెర్చింజన్ గూగుల్ సైతం ఇందులో భాగస్వామి అయింది. ఆగస్టు 15న దేశ స్వాతంత్ర్య దినోత్సవాన్ని సూచిస్తూ ప్రత్యేకంగా గూగుల్ డూడుల్ తయారుచేసింది.


నేటి ఇండిపెండెన్స్ డే గూగుల్ డూడుల్‌ను కేరళకు చెందిన ఆర్టిస్ట్ నీతి క్రియేట్ చేశారు. ఈ ప్రత్యేక రోజు సందర్భానికి పండుగ టచ్ ఇస్తూ గూగుల్ డూడుల్ తయారుచేశారు. ఎప్పటినుంచో వస్తున్న సంప్రదాయం.. పతంగుల పండుగను సూచిస్తూ డూడుల్ ఉంది. స్వేచ్ఛ, స్వాతంత్ర్యానికి ప్రతీకగా గాలి పటాలు ఎగురవేస్తారు. దేశ స్వాతంత్య్ర దినోత్సవాన్ని తెలియజెప్పేలా గూగుల్ ఈ ట్రెడీషనల్ టచ్ ఇస్తూ భారతీయులకు స్పెషల్ డూడుల్‌ను డెడికేట్ చేసింది.






గాలి పటాలతో నిరసన..
స్వాతంత్య్రోద్యమ సమయంలో భారతీయులు తమ నిరసనకు గాలి పటాలను సైతం మార్గంగా ఎంచుకున్నారు. స్వాతంత్య్రాన్ని ఎందుకు కోరుకుంటున్నామో తెలియజేస్తూ గాలిపటాలు ఎగురవేసి బ్రిటీష్ వారికి తమ నిరసనను తెలిపేవారు. మరికొందరు బ్రిటీష్ వారి అధికారం, అహంకారం తమకు అక్కర్లేదని, గో బ్యాక్ బ్రిటీషర్స్ అంటూ నినాదాలను గాలి పటాలపై రాసి వాటిని ఎగరవేసి స్వాతంత్యోద్యమంలో పాల్గొన్నారు. 


గూగుల్ డూడుల్‌పై నీతి ఏమన్నారు..
గాలిపటాల చుట్టూ ఉన్న మన దేశ సంస్కృతిని ఈ గూగుల్ డూడుల్ రూపంలో నా ఆర్ట్ వర్క్ వర్ణిస్తుంది. ఆకాశమే హద్దుగా ఎంతో ఎత్తుకు ఎదగాలని, మనం సాధించిన ఎన్నో ఘనతలను ఎగురుతున్న గాలిపటాలతో సూచించానని చెప్పారు. కుల, మత, జాతి, వర్గ భేదాలు లేకుండా అంతా గాలి పటాలు ఎగరవేస్తుంటారు.
Also Read: Independence Day 2022: 34 ఏళ్లు బ్రిటీష్ జెండా ఎగిరిన చోటే 75 ఏళ్లుగా మువ్వన్నెల జెండా సగర్వంగా 


వారందరికీ దేశం కృతజ్ఞతలు తెలుపుకుంటోంది - మోదీ
’’మంగళ్ పాండే, అల్లూరి సీతారామరాజు, తాత్యా తోపే, భగత్ సింగ్, సుఖ్‌దేవ్, రాజ్‌గురు, చంద్రశేఖర్ ఆజాద్, అష్ఫాఖుల్లా ఖాన్, రామ్ ప్రసాద్ బిస్మిల్, బ్రిటిష్ పాలనకు పునాది వేసిన మన అసంఖ్యాక విప్లవకారులకు ఈ దేశం కృతజ్ఞతలు తెలుపుకుంటోంది’’ అని ఎర్రకోట వద్ద ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగంలో అన్నారు. జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ మాట్లాడుతూ, ఈ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా తాను భారతీయులందరికీ, భారతదేశాన్ని ప్రేమించే వారందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్లు తెలిపారు. నవ సంకల్పంతో నూతన దిశలో పయనించే రోజు ఇదని అభివర్ణించారు.


త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ
‘‘‘ఆజాదీ మహోత్సవ్‌’ సందర్భంగా మనం ఎందరో జాతీయ స్వాతంత్య్ర నాయకులను స్మరించుకున్నాం. ఆగస్టు 14న మనం దేశ విభజన నాటి భయాందోళనలను గుర్తుచేసుకున్నాము. గత 75 ఏళ్లలో మన దేశాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు సహకరించిన దేశ పౌరులందరినీ ఈ రోజు స్మరించుకోవాల్సిన రోజు’’ అని ప్రధాని మోదీ అన్నారు. ఉదయం 7.30 గంటలకు ఎర్రకోట వద్ద ప్రధాని మోదీ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. ఉదయం 7.33 గంటలకు జాతినుద్దేశించి తన ప్రసంగాన్ని ప్రారంభిస్తారు. అయితే అంతకంటే ముందు ప్రధాని మోదీ ఉదయం 7.06 గంటలకు రాజ్‌ఘాట్‌ను సందర్శించి జాతిపిత బాపుకు నివాళులర్పించారు. 


Also Read: Independence Day 2022 Live Updates: ఎర్రకోటపై స్వాతంత్య్ర వేడుకలు, జెండావందనం చేసిన ప్రధాని - మోదీ స్పీచ్ లైవ్