ఉత్తరాఖండ్‌లో ఓ ప్రైవేట్ ఆసుపత్రి నిర్వాకం బయటపడింది. ఓ రోగికి నాలుగు రోజులు చికిత్స చేసి తర్వాత మరణించాడని ప్రైవేట్ ఆసుపత్రి ధ్రువీకరించింది. అయితే ఆ వ్యక్తి బతికి రావడం కలకలం రేపుతోంది.

Continues below advertisement







ఏం జరిగింది?


కరణ్​పుర్​కు చెందిన అజాబ్​ సింగ్(60) అనే వ్యక్తిని బీపీ తగ్గిపోవడం వల్ల లక్సర్​లోని హిమాలయన్​ ఆసుపత్రిలో కుటుంబ సభ్యులు చేర్పించారు. నాలుగు రోజుల పాటు వెంటిలేటర్​ పెట్టి చికిత్స అందించారు వైద్యులు. అయితే అజాబ్ సింగ్ మరణించాడని ధ్రువీకరించి శుక్రవారం వెంటిలేటర్​ను తొలగించారు. శక్తి మేరకు ప్రయత్నించామని కానీ రోగి ఆరోగ్యం మెరుగుపడలేదని వైద్యులు తెలిపారు.


రోగి కుటుంబం నుంచి నాలుగు రోజుల వైద్యానికి రూ.1,70,000 రూపాయలు వసూలు చేసింది ఆసుపత్రి. అనంతరం వృద్ధుడి మృతదేహాన్ని అప్పగించింది. 


అసలు ట్విస్ట్


కుటుంబ సభ్యులు బాధతో అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. అంత్యక్రియలకి ముందు వృద్ధుడికి స్నానం చేయిస్తుండగా అతడు కదలడం, శ్వాస తీసుకోవడం కుటుంబ సభ్యులు గమనించారు. వెంటనే లక్సర్​లోని మరో ఆసుపత్రికి తరలించి వైద్యం చేయించారు. డబ్బు కోసం ఇంత దారుణానికి తెగబడ్డ సదరు ఆసుపత్రిపై ఫిర్యాదు చేస్తామని రోగి బంధువులు తెలిపారు.


ఇలాంటి ఘటనే


ఉత్తరాఖండ్‌లో గతేడాది కూడా ఇదే తరహా ఘటన జరిగింది. అల్మోరాకు చెందిన మధో సింగ్ 24 సంవత్సరాల క్రితం అదృశ్యమయ్యాడు. చాలా కాలం పాటు వేచి చూసిన కుటుంబం అతడు తిరిగి రాకపోయేసరికి చనిపోయి ఉంటాడని నిర్ధారణకు వచ్చేసింది. కర్మకాండ జరిపించి ఏటా పిండ ప్రదానం కూడా చేస్తోంది. అయితే 24 ఏళ్ల తర్వాత 2021లో అనూహ్యంగా మధోసింగ్ తిరిగి వచ్చాడు. దీంతో కుటుంబంతోపాటు గ్రామస్తులు కూడా షాకయ్యారు. 


Also Read: Watch Video: 'ధూమ్' లెవల్‌లో చేజింగ్- రన్నింగ్ వాహనం నుంచే ఆవులను తోసేసిన దొంగలు, వీడియో చూశారా?


Also Read: Covid 19 Precaution Dose: ప్రికాషన్ డోసు షురూ- ఎలా బుక్ చేసుకోవాలి? ధర తెలుసుకోండి