Karnataka News: "ఐయాం వేరీ సారీ.. అన్నాగా వెయ్యో సారీ.. సరదాగా నవ్వేసే ఓ సారీ"  ఇది తరుణ్ నటించిన 'నువ్వేనువ్వే' సినిమాలో ఓ సాంగ్. ఈ సాంగ్‌లో అలిగిన హీరోయిన్ శ్రియను.. తిరిగి మాట్లాడించేందుకు నానా తంటాలు పడుతూ "సారీ, సారీ" అని హీరో వెనకాల తిరుగుతాడు. అయితే ఇదంతా ఇప్పుడెందుకు అనుకుంటున్నారా? సేమ్ ఇలాంటి సీన్ కర్ణాటక బెంగళూరులో రిపీటైంది.






ఏం జరిగింది?


కర్ణాటక బెంగళూరులోని ఓ కళాశాల ప్రాంగణమంతా సారీ.. సారీ అనే పెయింటింగ్​లతో నింపేశారు ఆకతాయిలు. సుంకదకట్టె ప్రాంతంలో కొంతమంది ఆకతాయిలు చేసిన ఈ పని పోలీసులకు తలనొప్పులు తెచ్చి పెట్టింది. సుంకదకట్టెలోని ఓ ప్రైవేట్ కళాశాల గోడలు, మెట్లతో పాటు పాఠశాల చుట్టూ ఉన్న వీధుల్లో కొంతమంది ఆకతాయిలు సారీ..సారీ.. అంటూ పెయింట్​తో రాశారు. ఉదయాన్నే చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.


సీసీ టీవీ


కళాశాలకు చేరుకున్న పోలీసులు ఇది చూసి అవాక్కయ్యారు. ఆకతాయిలు చేసిన ఈ పని అంతా సీసీటీవీలో రికార్డైంది. దీంతో ఆ ఫుటేజిని పోలీసులు కలెక్ట్ చేసుకున్నారు. దీని ఆధారంగా వారిని గుర్తించే పనిలో పడ్డారు.


ఓ ఇద్దరు యువకులు ద్విచక్రవాహనంపై వచ్చి కళాశాల గోడల మీద, చుట్టుపక్కల వీధుల్లో సారీ..సారీ.. అంటూ రాసినట్లు ఫుటేజీ ద్వారా గుర్తించారు. ఫుటేజీ ఆధారంగా వారిని గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. అయితే అదే కళాశాలలో చదివే ఓ అమ్మాయి కోసమే వారు ఇలా చేసి ఉంటారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అయితే పోలీసులు మాత్రం వీరిని గుర్తించి తగిన కౌన్సిలింగ్ ఇస్తామని తెలిపారు.


Also Read: Yasin Malik: కశ్మీర్ వేర్పాటువేద నేత యాసిన్ మాలిక్‌కు ఉరిశిక్ష వేయాలి: NIA


Also Read: Goa News: దొంగల నయా ట్రెండ్- ఇల్లంతా దోచేసి, లవ్ లెటర్ రాసి పరార్!