Hardik Patel: కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన యువనేత హార్దిక్ పటేల్ కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌ను వీడిన తర్వాత తనకు భాజపా ఓ ఆప్షన్ అని హార్దిక్ అన్నారు. అయితే కాంగ్రెస్ కన్నా మెరుగైన వ్యూహాలను ఆమ్‌ఆద్మీ పార్టీ అమలు చేస్తోందన్నారు. ఏది ఏమైనా రానున్న గుజరాత్ శాసన సభ ఎన్నికల్లో తాను ముఖ్యమైన పాత్ర పోషిస్తానని హార్దిక్ పటేల్ చెప్పారు.
- హార్దిక్ పటేల్, గుజరాత్ నేత
2019లో లోక్‌సభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీలో చేరారు హార్దిక్. అయితే కొద్ది రోజులుగా పార్టీ విధానాల పట్ల అసంతృప్తిగా ఉన్నారు. తనకు ప్రాధాన్యం ఇవ్వడంలేదని బహిరంగంగానే విమర్శించారు. కానీ పార్టీని వీడుతున్నట్లు వచ్చిన వార్తలను మాత్రం హార్థిక్ సున్నితంగా తిరస్కరిస్తూ వచ్చారు. కానీ పార్టీకి రాజీనామా చేసినట్లు స్వయంగా ప్రకటించారు.
హార్థిక్ పటేల్‌ను పార్టీలోనే ఉండాల్సిందిగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్వయంగా కోరినట్లు సమాచారం. అయినప్పటికీ హార్థిక్ రాజీనామాకే మొగ్గు చూపినట్లు ఆయన సన్నిహత వర్గాలు తెలిపాయి.
Also Read: Rajya Sabha Elections 2022: కాంగ్రెస్‌కు కపిల్ సిబల్ గుడ్‌బై- ఎస్‌పీ మద్దతుతో రాజ్యసభ ఎన్నికల బరిలో!
Also Read: Vladimir Putin: రష్యా అధ్యక్షుడు పుతిన్‌పై హత్యాయత్నం- త్రుటిలో తప్పిన ప్రమాదం!