Corona Cases: దేశంలో కొత్తగా 2,124 కరోనా కేసులు నమోదయ్యాయి. 17 మంది మృతి చెందారు. యాక్టివ్ కేసుల సంఖ్య 14,971గా ఉంది. డైలీ పాజిటివిటీ రేటు 0.46%గా ఉంది. రికవరీ రేటు 98.75గా ఉంది. ఒక్కరోజే 1977 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.







  • మొత్తం కరోనా కేసులు: 43,111,372

  • మొత్తం మరణాలు: 5,24,507

  • యాక్టివ్​ కేసులు: 14,971

  • రికవరీల సంఖ్య: 4,26,02,714


వ్యాక్సినేషన్







దేశవ్యాప్తంగా మంగళవారం 13,27,544 మందికిపైగా టీకాలు అందించారు. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్​ డోసుల సంఖ్య 1,92,67,44,769కి చేరింది. ఒక్కరోజే 4,58,924 మందికి కరోనా టెస్టులు నిర్వహించారు.


ఉత్తర కొరియాలో


ఉత్తర కొరియాలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. కొత్తగా మరో 1,15,980 మంది కరోనా బారినపడ్డారు. ఇప్పటివరకు 68 మంది కరోనాతో మృతి చెందారు. ఉత్తర కొరియాలో ఇప్పటివరకు 3,064,880 మందికి కరొనా సోకినట్లు అక్కడి ఆరోగ్య శాఖ వెల్లడించింది.


Also Read: Bharat Bandh : సీపీఎస్‌ రద్దు, కుల ఆధారిత జనాభా గణన డిమాండ్‌తో భారత్ బంద్


Also Read: Texas Gun Fire: కాల్పులతో దద్దరిల్లిన టెక్సాస్, ప్రైమరీ స్కూల్లోకి చొరబడి విచ్చలవిడి కాల్పులు - 18 పిల్లలు, టీచర్లు మృతి