Gyanvapi Mosque Case:

ఉత్తర్‌ప్రదేశ్‌ జ్ఞానవాపి మసీదులో వీడియో సర్వేను వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీం కోర్టు విచారించింది. ఈ సందర్భంగా కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.

నమాజ్‌కు ఓకే

ముస్లింలను జ్ఞానవాపి మసీదులో నమాజ్ చేసుకునేందుకు అనుమతిచ్చింది. శివలింగం బయటపడిన జ్ఞానవాపి మసీదు కాంప్లెక్స్‌ ప్రాంతాన్ని సీజ్ చేసి ఉంచాలని ఆదేశించింది. శాంతి భద్రతల పరిస్థితిని సమీక్షించే బాధ్యత కలెక్టర్‌కు అప్పగించింది.

కమిషనర్ తొలగింపు   

మరోవైపు జ్ఞానవాపి మసీదులో చేసిన వీడియోగ్రఫీ సర్వే నివేదికను ఈ నెల 19లోగా సమర్పించాలని వారణాసి సివిల్ కోర్టు ఆదేశించింది. అదే సమయంలో కోర్టు కమిషనర్‌ అజయ్ కుమార్ మిశ్రాను తొలగించింది. అజయ్ కుమార్ మిశ్రా పూర్తి స్థాయిలో సహకరించడం లేదనే ఆరోపణలు రావడంతో ఆయన్ను తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది.

ఈ నివేదికను సమర్పించేందుకు రెండు రోజుల సమయం కావాలని అసిస్టెంట్ కోర్టు కమిషనర్ అజయ్ ప్రతాప్ సింగ్ న్యాయస్థానాన్ని కోరారు. దీంతో కోర్టు 2 రోజుల గడువిచ్చింది.   

ఇదీ కేసు

జ్ఞాన్​వాపి మసీదు వెలుపలి గోడపై ఉన్న హిందూ దేవతామూర్తులకు పూజలు చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ ఐదుగురు మహిళలు వారణాసి కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై స్పందించిన వారణాసి సివిల్‌ జడ్జి కోర్టు అక్కడ వీడియోగ్రఫీ సర్వేకు ఆదేశాలిచ్చారు.

Also Read: PM Boris Johnson: ఆహా, అట్నా- 'వర్క్ ఫ్రమ్ హోం' గురించి ఏం చెప్పారు పీఎం సారూ!

Also Read: Green Card: భారతీయులకు శుభవార్త- ఇక ఆరు నెలల్లోగా గ్రీన్ కార్డ్‌కు క్లియరెన్స్!