Gujarat Riots Case :   గుజరాత్ అల్లర్ల కేసులో నరేంద్రమోదీపై ఆరోపణలు రావడానికి కుట్ర చేసింది దివంగత కాంగ్రెస్ అహ్మద్ పటేల్ అని ఈ కేసులో విచారణ జరుపుతున్న ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ నివేదిక వెల్లడించింది. అప్పటి గుజరాత్‌ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా కాంగ్రెస్‌ సీనియర్‌, దివంగత నేత అహ్మద్‌ పటేల్‌ చేసిన పెద్ద కుట్రలో ఉద్యమకారిణి తీస్తా సెతల్వాద్‌ భాగమని నివేదికలో స్పష్టం చేశారు.  అప్పటి మోడీ సర్కార్‌ను బర్తరఫ్‌ చేసేందుకు అహ్మద్‌ పటేల్‌ ఆదేశాల మేరకు జరిగిన కుట్రలో ఆమె భాగస్వామ్యమయ్యారని సెషన్స్‌ కోర్టులో సిట్‌ అఫిడవిట్‌లో పేర్కొంది.  


సిద్ధరామయ్యకు చేదు అనుభవం.. మాజీ సీఎంపై పరిహారం డబ్బులను విసిరికొట్టిన మహిళ


సామాజిక కార్య‌క‌ర్త తీస్తా సెత‌ల్‌వాద్‌, మాజీ డీజీపీ ఆర్‌బీ శ్రీకుమార్‌, ఐపీఎస్ ఆఫీస‌ర్ సంజీవ్ భ‌ట్‌ల‌కు అహ్మ‌ద్ ప‌టేల్ 30 ల‌క్ష‌లు ఇచ్చార‌ని, అల్ల‌ర్ల కేసులో మోదీని ఇరికించాలా ఉద్దేశంతో ప‌టేల్ ఆ డ‌బ్బులు ఇచ్చిన‌ట్లు సిట్ త‌న రిపోర్ట్‌లో పేర్కొన్న‌ది. సెత‌ల్‌వాద్‌, శ్రీకుమార్‌లు నేర కుట్ర‌కు, ఫోర్జ‌రీకి పాల్ప‌డిన‌ట్లు సిట్ వెల్ల‌డించింది. కాంగ్రెస్ నుంచి అక్ర‌మంగా డ‌బ్బు తీసుకునేందుకు తీస్తా, శ్రీకుమార్‌లు కుట్ర‌కు పాల్ప‌డిన‌ట్లు సిట్ అఫిడివిట్‌లో పేర్కొంది. 


చంద్రబాబు తమ్ముడు విజయసాయిరెడ్డి - బంధుత్వం బయట పెట్టిన వైఎస్ఆర్‌సీపీ ఎంపీ!


గుజ‌రాత్ అల్ల‌ర్ల కేసుతో లింకు ఉన్న డాక్యుమెంట్ల‌ను ఫోర్జ‌రీ చేసిన కేసులో మాజీ ఐపీఎస్ సంజీవ్ భ‌ట్‌ను అహ్మ‌దాబాద్ క్రైం బ్రాంచీ పోలీసులు అరెస్టు చేశారు.   2020లో అహ్మ‌ద్ ప‌టేల్ చనిపోయారు. ఆయన చనిపోయిన తర్వాత సిట్ ఇలాంటి ఆరోపణలు చేయడం రాజకీయాల్లో  కలకలం రేపుతోంది. 


సిట్ ఆరోప‌ణ‌లను కాంగ్రెస్ పార్టీ ఖండించింది. ప్ర‌ధాని మోదీ రాజ‌కీయ ప్ర‌తీకారం తీర్చుకుంటున్నార‌ని, మ‌ర‌ణించిన వారిని కూడా త‌న రాజ‌కీయ ల‌బ్ధి కోసం వాడుకుంటున్న‌ట్లు ఆరోపించింది.  సిట్ అభియోగాలను ఖండిస్తూ జైరాం రమేష్ పేరుతో ప్రకటన వెలువడింది. 





ఇప్పటికే గుజరాత్ అల్లర్ల కేసులో నరేంద్రమోదీకి సిట్ క్లీన్ చిట్ ఇచ్చింది. ఆయన పై కుట్ర పన్నారనే కోణంో దర్యాప్తు చేస్తోంది. 


రోడ్లపై ఏపీ రాజకీయాలు - జగన్ ప్రభుత్వంపై విరుచుకుపడుతున్న విపక్షాలు !