From 610 kg to 63 kg  How worlds heaviest man :   ఆరు నెలల కిందటి వరకూ ప్రపంచంలోనే అత్యంత భారీకాయుడైన వ్యక్తి ఎవరంటే ఖాలీద్ షారి పేరు చెబుతారు.  ఆయన అలా రికార్డుల్లోకి ఎక్కారు. ఆయన సౌదీ అరేబియాకు చెందినవారు. బరువు కారణంగా ఆయన ప్రపంచం దృష్టిలో పడ్డారు కానీ..మరణానికి తగ్గరయ్యారు. కదల్లేని పరిస్థితి చేరి ఇక చనిపోవడమే మిగిలిందనుకుంటున్న సమయంలో సౌదీ రాజుకు విషయం తెలిసింది. దాంతో ఆయన అండగా నిలబడ్డారు. ఖాలీద్ ప్రాణాలను నిలబెట్టాలని నిర్ణయించుకున్నారు. వైద్యులతో ప్రత్యేకంగా మాట్లాడి చికిత్స చేసే ఏర్పాట్లు చేశారు. అంత వరకే బయట ప్రపంచానికి తెలుసు. కానీ ఆ తర్వాత జరిగిందే అసలైన చరిత్ర.   



ఖాలిద్‌కు  సౌదీ అరేబియా మాజీ రాజు అబ్దుల్లా భరోసా ఇవ్వడంతో ఆయన తరపున  యంత్రాగం రంగంలోకి దిగింది. అతి కష్టం మీద ఆయనను ఆస్పత్రికి తరలించారు. అక్కడ ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు. ముఫ్పై మంది ప్రత్యేకమైన వైద్యుల్ని నియమించారు. వారి పర్యవేక్షణలో వైద్యం ప్రారంభించారు. పలు సర్జరీలు చేశారు. అలాగే కఠినమైన  డైట్ అమలు చేశారు. ఆరు నెలల్లో అతని  బరువు 63 న్నర కేజీలకు చేరింది. రోజూ వైద్యం చేసే వైద్యులు.. కూడా ఇంతగా బరువు తగ్గిస్తామని ఊహించలేకపోయారు. ఇప్పుడు ఖాలిద్ పూర్తి ఆరోగ్యంతో.. అతి తక్కువ బరువుతో సాధారణ జీవితాన్ని గడుపుతున్నారు.   



అయితే ఖాలిద్‌కు చర్మ సంబంధమైన సమస్యలు ఉంటున్నాయి. వాటికి కొన్ని  ఆపరేషన్లు చేయాల్సి ఉంటుందని అంటున్నారు. చిన్న చిన్న సమస్యలు ఉన్నప్పటికీ అసలు లేచి నిలబడలేని ఘోరమైన పరిస్థితి నుంచి అందరిలా.. మారగలగడంతో.. ఖాలిద్ ప్రపంచ వింతల్లో ఒకరిగా మారిపోయారు. ఆయన గురించి తెలుసుకునేందుకు ప్రపంచం అంతా ఆసక్తి చూపిస్తోంది. అలాగే సౌదీ రాజు అబ్దుల్లా ఓ పౌరుడి గురించి ఇంతగా కేర్ తీసుకోవడం చాలా మందిని ఆశ్చర్యపరిచింది. 


ప్రస్తుత ప్రపంచంలో స్థూలకాయం అనేది పెద్ద  సమస్యగా మారింది. అందుకే.. బరువు తగ్గించుకునే ప్రయత్నాలకు .. అలాంటి ఆపరేషన్లకు ఓవర్ వెయిట్ అయిన వారు ప్రయత్నాలు చేస్తున్నారు.