Coronavirus Cases:  దేశంలో కొత్తగా 3,688 కరోనా కేసులు నమోదయ్యాయి. 50 మంది కరోనాతో మృతి చెందారు. 2,755 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.







  • యాక్టివ్ కేసులు: 18,684

  • మొత్తం మరణాలు: 5,23,803

  • మొత్తం కేసులు: 4,30,75,914

  • రికవరీలు: 4,25,33,377


కరోనా కేసుల సంఖ్య 4,30,72,176కు చేరింది. యాక్టివ్ కేసుల సంఖ్య 18,684కు పెరిగింది.


మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసుల శాతం 0.04 శాతంగా ఉంది. రికవరీ రేటు 98.74గా ఉంది.


డైలీ పాజిటివిటీ రేటు 0.74గా ఉంది. వీక్లి పాజిటివిటీ రేటు 0.66గా ఉంది.


వ్యాక్సినేషన్







దేశంలో కరోనా టీకా పంపిణీ వేగంగా సాగుతోంది. శుక్రవారం 22,58,059 మందికి టీకాలు అందించారు. దీంతో ఇప్పటివరకు పంపిణీ చేసిన డోసుల సంఖ్య 1,88,89,90,935కు చేరింది. కరోనా ఫోర్త్‌ వేవ్ అంచనాల వేళ వ్యాక్సినేషన్ ప్రక్రియన వీలైనంత త్వరగా అందరికీ అందజేయాలని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రయత్నిస్తోంది. దీంతో వ్యాక్సినేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేసింది ఆరోగ్య శాఖ.


Also Read: IT Jobs Alert: ఫ్రెషర్లకు పండగే పండగ- 90 వేల ఐటీ ఉద్యోగాల మేళా, వర్క్ ఫ్రం హోంపై కీలక ప్రకటన!


Also Read: Elon Musk Coca-Cola memes : కోక్‌ను మస్క్ కొనేస్తారా ? నెటిజన్ల రియాక్షన్ చూస్తే నవ్వాపుకోలేరు