International Booker Prize 2022:
ప్రతిష్ఠాత్మక బుకర్ ప్రైజ్‌ను ప్రముఖ రచయిత్రి గీతాంజలి శ్రీ అందుకున్నారు. ఆమె రచించిన హిందీ నవల 'టూంబ్ ఆఫ్ శాండ్'కు ఈ ప్రైజ్ లభించింది. దీంతో అంతర్జాతీయ బుకర్ ప్రైజ్ గెలుచుకున్న తొలి హిందీ నవలగా ఆమె రికార్డ్ సృష్టించారు.
2018లో 'రెట్ సమాధి' పేరుతో హిందీలో గీతాంజిలి శ్రీ నవల రాశారు. దీనిని అమెరికాకు చెందిన అనువాదకురాలు డైసీ రాక్‌వెల్ 'టూంబ్ ఆఫ్ శాండ్' పేరుతో ఇంగ్లిష్‌లోకి అనువదించారు. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఈ నవల 2022అంతర్జాతీయ బుకర్ ప్రైజ్‌ను సొంతం చేసుకుంది.
నగదు బహుమానం
లండన్‌లో జరిగిన వేడుకల్లో అనువాదకురాలు డైసీ రాక్‌వెల్‌తో కలిసి 50 వేల పౌండ్ల (సుమారు రూ.49.4 లక్షలు) నగదు బహుమతిని ఆమె పంచుకున్నారు. ఇప్పటికే ఈ పుస్తకం 'ఇంగ్లిష్ పెన్ అవార్డు' కూడా దక్కించుకుంది.
ఇదే కథ
ఉత్తర భారతానికి చెందిన ఓ 80 ఏళ్ల మహిళ తన భర్త మరణానంతరం తీవ్ర నిరాశా నిస్పృహలు, డిప్రెషన్‌లోకి కూరుకుపోతుంది. అయితే ఇలాంటి ప్రతికూల పరిస్థితుల నుంచి బయటపడి తాను తిరిగి కొత్త జీవితాన్ని ఎలా ప్రారంభించిందన్నదే ఈ 'టూంబ్ ఆఫ్ శాండ్' కథ సారాంశం.
Also Read: Ladakh Road Accident: లద్దాఖ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం- ఏడుగురు జవాన్లు మృతి