First Accident on Atal setu: అరేబియా సముద్రంపై ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన అటల్‌ సేతుపై మొదటి యాక్సిడెంట్‌ జరిగింది. జనవరి 12న ప్రధాని మోడీ ప్రారంభించిన ఈ బ్రిడ్జిపై పది రోజుల్లోనే ప్రమాదం చోటు చేసుకుంది. బ్రిడ్జిపై వెళ్తున్న కారు ముందు వెళ్తున్న కారును ఓవర్‌ టేక్‌ చేసేందుకు ప్రయత్నించి అదుపుతప్పి రెయిలింగ్‌ని ఢీకొట్టింది. అయితే, ఆ టైంలో కారులో ప్రయాణిస్తున్న వారికి దెబ్బలు తగిలాయని, పెను ప్రమాదం తప్పిందని అక్కడివాళ్లు చెప్తున్నారు. కారు వెళ్తున్న స్పీడ్‌కి నేరుగా సముద్రంలో పడిపోయి ఉండేదని అదృష్టవశాత్తు దెబ్బలతో బయటపడినట్లు చెప్పారు. కాగా.. ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలన్నీ వంతెనపై వెళ్తున్న మరో కారులోని డ్యాష్‌కామ్‌లో రికార్డ్‌ అవ్వడంతో విషయం వెలుగులోకి వచ్చింది. 


ఇద్దరు మహిళలు, ముగ్గురు చిన్నారులు కారులో రాయ్‌గఢ్‌ జిల్లాలోని చిర్లేకు వెళ్లేందుకు బయలుదేరారు. కాగా.. వాళ్ల కారు అటల్‌ సేతుపైకి చేరుకోగానే ప్రమాదానికి గురయ్యింది. ముందు వెళ్తున్న మరో వెహికిల్‌ని ఓవర్‌టేక్‌ చేస్తుండగా ప్రమాదం జరిగినట్లు డ్యాష్‌క్యామ్‌లో రికార్డ్‌ అయ్యింది. కాగా.. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మహిళలు, చిన్నారులను ఆసుపత్రికి తరలించి ట్రీట్మెంట్‌ అందిస్తున్నారు. 






 


అరేబియా సముద్రం మీద ఈ అటల్‌ సేతును నిర్మించారు. ముంబైలోని సేవ్రీ నుంచి రాయ్‌గఢ్‌ జిల్లాలోని నవశేవాను కలపుతూ దీన్ని నిర్మించారు. ముంబయి ట్రాన్స్‌ హార్బర్‌ లింక్‌గా కూడా ఈ అటల్‌ సేతు వ్యవహరిస్తుంది. ఇక దీని ద్వారా ప్రయాణిస్తే.. సేవ్రీ నుంచి నవశేవాకు కేవలం 20 నిమిషాల్లో చేరుకోవచ్చు. ఆరు లేన్లుగా దీన్ని నిర్మించారు.మొత్తం పొడవు 21.8 కిలోమీటర్లు కాగా.. దాదాపు 16 కిలోమీటర్లు సముద్రంపైనే ఉండటం విశేషం. దాదాపు 17,840 కోట్ల వ్యయంతో నిర్మించిన అటల్‌ సేతును ప్రధాని మోడీ జనవరి 12న ప్రారంభించారు. 2016లో మోడీనే ఈ సేతుకు శంకుస్థాపన చేశారు. ఇండియాలోనే లాంగెస్ట్‌  సీ బ్రిడ్జ్‌గా దీనికి రికార్డు ఉంది. 


అటల్‌ సేతుపైకి ఆటోలు, టూ వీలర్స్‌కి అనుమతి లేదు. కాగా.. ముంబై ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌, నవీ ముంబై ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌ మధ్య దూరాన్ని తగ్గించేందుకు అటల్‌సేతు ఎంతో ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ముంబై నుంచి పుణె, గోవా తదితర ప్రాంతాలకు ట్రావెలింగ్‌ టైంని కూడా అటల్‌ సేతు వల్ల తగ్గుతుంది.   


 


Also Read : ప్రాణ ప్రతిష్ఠ తరవాత ప్రధాని మోదీ ఆ తీర్థం ఎందుకు తీసుకున్నారో తెలుసా?