2024 Elections: 2024 లోక్‌సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ వ్యూహాలు ఇప్పటి నుంచే రచిస్తోంది. ఇందుకోసం పక్కా ప్రణాళికలు అమలు చేస్తోంది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో భాజపా ఓటమి ఎదుర్కొన్న నియోజకవర్గాల్లో కేంద్ర మంత్రులు త్వరలో పర్యటించబోతున్నారు. ఈ నియోజకవర్గాల్లోని పార్టీ కార్యకర్తలను, ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిదారులను వీరు కలవబోతున్నారు.
8 ఏళ్ల పాలన
నరేంద్ర మోదీ నేతృత్వంలోని భాజపా కేంద్రంలో అధికారంలోకి వచ్చి 8 ఏళ్లు పూర్తవుతున్న వేళ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు సమాచారం. భాజపా ప్రధాన కార్యాలయంలో కేంద్రమంత్రులతో జరిగిన ఓ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ కార్యక్రమంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పాల్గొన్నారు.
భారీ కార్యక్రమాలు
మోదీ 8 ఏళ్ల పాలన సందర్భంగా దేశవ్యాప్తంగా భారీస్థాయిలో కార్యక్రమాలు నిర్వహించాలని భాజపా భావిస్తోంది. ఈ కార్యక్రమాలను జేపీ నడ్డా సహా పార్టీ కీలక నేతలు పూర్తిస్థాయిలో సమీక్షించారు. ఎనిమిదేళ్ల పాలనలో మోదీ ప్రభుత్వం సాధించిన విజయాలను, చేపట్టిన కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని నిర్ణయించారు.
ఇందులో భాగంగా దర్మేంద్ర ప్రధాన్, స్మృతి ఇరానీ, జ్యోతిరాదిత్య సింధియా సహా పలువురు మంత్రులు బంగాల్‌లో పర్యటించనున్నారు. ఆరోగ్య మంత్రి మన్‌సుఖ్ మాండవీయపంజాబ్‌ను సందర్శించనున్నారు. తమకు కేటాయించిన రాష్ట్రాల్లో మంత్రులు రెండు మూడు రోజులు గడపనున్నారు.
ఎనిమిదేళ్ల పాలనకు సంబంధించి మే 30 నుంచి జూన్ 15 వరకు భాజపా.. సేవా, సుశాసన్, గరీబ్ కల్యాణ్ పేరుతో దేశవ్యాప్తంగా సంబరాలను చేపట్టనుంది. అంతకుముందు 2024 ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని దేశంలో బలహీనంగా ఉన్న 74 వేల బూత్‌లను పటిష్ఠం చేసే కార్యక్రమాన్ని జేపీ నడ్డా ప్రారంభించారు.
Also Read: Rajya Sabha Polls 2022: భార్యను పక్కన పెట్టిన అఖిలేశ్ యాదవ్- కీలక నిర్ణయం!
Also Read: Domestic Violence Rajasthan: ఇదేం కొట్టుడురా నాయనా! బ్యాట్‌తో కొడితే కోర్టులో పడిన భర్త!