E-Passport Guide : విదేశాలకు వెళ్లేవారు పాస్​పోర్ట్​ని ఎక్కువగా వాడుతారు. అయితే ఇండియాలో ఇన్నిరోజులు పాస్​పోర్ట్​ను డిజిటల్ చేయలేదు. పొరుగుదేశాలు ఇప్పటికే ఈ-పాస్​పోర్టులను వినియోగిస్తుండగా.. ఇప్పుడు ఇండియాలో కూడా దీనిని అందుబాటులోకి తెచ్చారు. ఈ-పాస్​పోర్ట్​ వినియోగంలోకి వస్తే.. ఎయిర్​పోర్ట్​లో ఎంట్రీ ఫాస్ట్​గా ఉంటుంది. అంతేకాకుండా పర్సనల్ డేటా కూడా బయటకు రాదు. బెటర్ సెక్యూరిటీ కోసం దీనిని అందుబాటులోకి తెచ్చారు. 

ఈ-పాస్​పోర్ట్ 

ఈ-పాస్​పోర్ట్​ చిన్న గోల్డ్ చిప్​తో వస్తుంది. దీనిలో బయోమెట్రిక్ పద్ధతిలో సమాచారం స్టోర్ చేస్తారు. ఫింగర్ ప్రింట్స్, ఫేస్ స్కాన్, మొదలైన అంశాలన్నీ ఈ చిప్​లో స్టోర్ అయి ఉంటాయి. ఈ పాస్​పోర్ట్​ ఫ్యూచర్​లో స్మార్ట్ ఐడీ కానుంది. 

పాత పాస్​పోర్ట్ వాడుతుంటే.. 

మీరు ఇప్పటికే పాస్​పోర్ట్​ వాడేవారు అయితే వెంటనే దీనిని మార్చుకోవాల్సిన అవసరం లేదు. మీకుండే వీలును బట్టి దీనిని మార్చుకోవచ్చు. పాస్​పోర్ట్ ఎక్స్​పైరీ అయిపోతున్నప్పుడు మీరు ఈ-పాస్​పోర్ట్ సేవలు వినియోగించుకోవచ్చు. కేవలం 5 నిమిషాల్లో మీరు ఈ-పాస్​పోర్ట్​ కోసం అప్లై చేయవచ్చు. 

ఈ-పాస్​పోర్ట్​ అప్లై చేయాల్సిన విధానం

ముందుగా passportindia.gov.in సైట్​లోకి వెళ్లి రిజిస్టర్ అవ్వాలి. ఇప్పుడు Login క్లిక్ చేయాలి. అక్కడ Apply for Fresh/Reissue అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిలో మీరు Fresh లేదా Reissue ఆప్షన్ ఎంచుకోవాలి. మీరు కొత్తగా పాస్​పోర్ట్​కి అప్లై చేసేవారు అయితే  Fresh అని.. పాస్​పోర్ట్ ఉండి.. E-Passport కోసం అప్లై చేసేవారు అయితే Reissue అనే ఆప్షన్ ఎంచుకోవాలి. 

ఈ ఆప్షన్ తర్వాత  Pay Fee and Book Your Slot అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఇక్కడ మీరు ఫీజు పే చేసి.. మీ స్లాట్ బుక్ చేసుకోవచ్చు. కన్ఫార్మేషన్ మెసేజ్ లేదా Receiptని సేవ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ప్రాసెస్ పూర్తి చేసిన తర్వాత Passport Seva Kendraకు మీ ఒరిజనల్ డాక్యుమెంట్స్​తో వెళ్లి.. ఫార్మాలిటీలు పూర్తి చేసుకోవాలి. అంతే ఈ ప్రాసెస్ పూర్తి చేస్తే కొన్నిరోజుల్లో వెరిఫికేషన్ ప్రాసెస్ జరుగుతుంది. తర్వాత పాస్​పోర్ట్ డెలీవరి చేస్తారు.

ఏ ప్రాంతాల్లో దీనిని అప్లై చేసుకోవచ్చంటే.. 

ప్రస్తుతం ఇండియాలో ఈ-పాస్​పోర్ట్ సేవలు కొన్ని సిటీల్లో మాత్రమే అందుబాటులో ఉన్నాయి. హైదరాబాద్, చెన్నై, నాగపూర్, భుభనేశ్వర్, జమ్మూ, రాంచీ, గోవా, జైపూర్, సూరత్, ఢిల్లీ, సిమ్లా​లో ఈ సేవలు అందుబాటులో ఉన్నాయి. మరికొన్ని రోజుల్లో భారతదేశం అంతటా ఈ సేవలను అమలు చేయాలని విదేశాంగ మంత్రిత్వ శాఖ లక్ష్యంగా చేసుకుంది. 

Also Read : భారతీయులు వీసా లేకుండా ఈ దేశానికి వెళ్లొచ్చట.. అనౌన్స్ చేసిన ఫిలిప్పీన్స్‌, పూర్తి వివరాలు, అర్హతలివే