Philippines Announces Visa Free Entry for Indians : వీసా లేకుండా ఇండియన్స్ తమ దేశానికి రావొచ్చంటూ ఫిలిప్పీన్స్ వీసా ఫ్రీ సౌలభ్యాన్ని కల్పించింది. అంటే భారత పాస్​పోర్ట్ హోల్డర్లు వీసాకి అప్లై చేయకుండానే టూరిజంలో భాగంగా ఫిలిప్పీన్స్ వెళ్లొచ్చు. అయితే ఈ ఫ్రీ వీసాతో అక్కడ ఎన్ని రోజులు ఉండొచ్చో.. ఇలా వెళ్లడానికి ఉండాల్సిన అర్హతలు ఏమిటో? అక్కడ చూడదగ్గ ప్రదేశాలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం. 

భారతదేశం నుంచి పర్యాటకుల రద్దీని పెంచుకునేందుకు ఫీలిప్పీన్​ ఈ-వీసా ఆఫర్​తో పాటు.. రెండు వీసా రహిత ఎంట్రీలను అందిస్తోంది. ట్రావెల్, టూర్​పై ఇంట్రెస్ట్ ఉండేవారు అక్కడి ద్వీపాలను, బీచ్​లు, దీవులలోని బ్యూటీఫుల్ ప్రదేశాలు చూడాలనుకునేవారు వెళ్లొచ్చు. మీకు ఫిలిప్పీన్స్ వెళ్లాలనుకుంటే ముందుగా తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటో చూసేద్దాం. 

ఫ్రీ వీసా ఎంట్రీలో మొదటి రకం (14 రోజులు)

ఇండియన్స్​కు వీసా లేకుండా ఫీలిప్పీన్స్​లో 14 రోజులు ఉండేందుకు అవకాశం కల్పిస్తుంది. అన్ని ప్రధాన విమానాశ్రయాలు, ఓడరేవులు, క్రూయిజ్ టెర్మినల్స్​ దగ్గర ఎంట్రీ ఉంటుంది. అయితే ఇలా వెళ్లినవారు ఎక్కువ రోజులు ఉండేందుకు వీలు ఉండదు. 

అర్హతలివే.. 

ఫీలిప్పీన్స్​కి వెళ్లాలనుకుంటే ఆ జర్నీ కేవలం పర్యాటక ప్రయోజనంగానే ఉండాలి. బస తర్వాత ఆరు నెలల వరకు ఉండాలనుకుంటే పాస్​పోర్ట్ చెల్లుబాటు అవుతుంది. ఇలా ఉండాలనుకుంటే స్టేయింగ్, తిరిగి వెళ్లే టికెట్ రుజువును చూపించాల్సి ఉంటుంది. అలాగే అక్కడ మీరు ఉండేందుకు సరిపడా బ్యాంక్ బ్యాలెన్స్, మీ వర్క్ ఐడెంటిటీ చూపించాల్సి ఉంటుంది. 

ఫ్రీ వీసా ఎంట్రీలో రెండో రకం (30 రోజులు)

ఆస్ట్రేలియా, జపాన్, అమెరికా, కెనడా, స్కెంజెన్, సింగపూర్, యునైటెడ్ కింగ్డమ్ దేశాలకు చెల్లుబాటు అయ్యే వీసాలు లేదా అక్కడ సొంత ఇళ్లు కలిగిన భారతీయులకు మరో ఆఫర్ ఉంది. వీరు ఫీలిప్పీన్స్​లో 30 రోజులు ఫ్రీ వీసా స్టేయింగ్​కు అర్హత కలిగి ఉంటారు. 

అర్హతలివే

పైన చెప్పిన దేశాలకు చెందిన వీసాలు లేదా పర్మినెంట్ అడ్రస్​ను ఇవ్వాల్సి ఉంటుంది. ఆరు నెలల చెల్లుబాటుతో పాస్‌పోర్ట్ చూపించాలి. తిరుగు ప్రయాణానికి సంబంధించిన డిటైల్స్ ఇవ్వాలి. ఫిలిప్పీన్స్​లో ఇమ్మిగ్రేషన్ రికార్డ్ క్లీన్​గా ఉండాలని గుర్తించుకోండి. 

ఈ-వీసా ప్రాసెస్ 

ఫ్రీ వీసా అర్హతలు లేని ఇండియన్స్ ఈ-వీసా ద్వారా ఫిలిప్పీన్స్​ను విజిట్ చేయవచ్చు. అధికారిక ఈ-వీసా పోర్టల్ ద్వారా టెంపరరీ విజిటర్ వీసా తీసుకుని 30 రోజుల సింగిల్ ఎంట్రీ స్టెయింగ్​ను పొందవచ్చు. దీనికోసం పాస్​పార్ట్, ఐడీ కార్డ్, పాస్​పోర్టులు సిద్ధం చేసుకోవాలి. వసతిని నమోదు పరచాలి. 

ఫిలిప్పీన్స్​లో చూడదగ్గ ప్రదేశాలివే.. 

ఫిలిప్పీన్స్ వెళ్తే అక్కడ మీరు కొన్ని ప్రదేశాలు కచ్చితంగా చూడొచ్చు. అక్కడ మీరు ఎంజాయ్ చేయగలిగే మూమెంట్స్ ఏంటో చూసేద్దాం. భూగర్భ నదులు, అందమైన, ఆకట్టుకునే మడుగులు చూసేందుకు పలావన్ వెళ్లొచ్చు. తెల్లని ఇసుకతో కూడిన బీచ్​లు, నైట్​ లైఫ్​ని ఎంజాలనుకునేవారు బోరాకేకి వెళ్లొచ్చు. చారిత్రక ప్రదేశాలు, షార్క్ డైవింగ్ చేయాలనుకునేవారికి సెబు మంచి ఆప్షన్. 

చాక్లెట్ హిల్స్, స్మాల్ టార్సియర్​లు చూసేందుంకు బోహెల్.. సిటీ వాతావరణం కోసం మనీలా వెళ్లొచ్చు. ద్వీపాలు, సర్ఫింగ్ చేసేందుకు సియర్గావ్ అనువైన ప్రదేశం. బాగ్యుయోలో చల్లని వాతావరణం ఉంటుంది. ఇక్కడ పైన్ అడవులు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. Hanging coffins, కేవ్ ట్రెక్స్ కోసం సగాడా బెస్ట్ ఆప్షన్. ఒకవేళ మీరు ఫిలిప్పీన్స్ వెళ్తే మంచి ఎక్స్​పీరియన్స్ కోసం ఈ ప్రదేశాలు కచ్చితంగా విజిట్ చేయండి.