తమిళ చలనచిత్ర పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. సీనియర్ నటుడు రాజేష్ (Actor Rajesh Death) ఇవాళ ఉదయం తుది శ్వాస విడిచారు.‌ ఆయన వయసు 75 సంవత్సరాలు. రాజేష్ మృతి పట్ల సీనియర్ హీరోయిన్ రాధిక శరత్ కుమార్ సహా పలువురు నటీనటులు తమ సంతాపం వ్యక్తం చేశారు.

తెలుగులోనూ సినిమాలు చేసిన రాజేష్!రాజేష్ అసలు పేరు రాజేష్ విలియమ్స్. ఆయనది తమిళనాడులోని తంజావూరు.‌ విలియమ్స్ నట్టర్, లిల్లీ గ్రేస్ దంపతులకు డిసెంబర్ 20, 1949లో జన్మించారు.‌ తమిళ సీరియళ్లతో పాటు సినిమాలు చేశారు. అలాగే మలయాళంలోనూ యాక్ట్ చేశారు.‌ నటుడిగా ఆయనది 50 సంవత్సరాల అనుభవం. 

'బంగారు చిలక', 'చాదస్తపు మొగుడు', 'మా ఇంటి మహారాజు'... మూడు తెలుగు సినిమాలలో రాజేష్ నటించారు. తమిళ సినిమాలు 150కు పైగా చేశారు. డబ్బింగ్ ఆర్టిస్ట్ కింద వర్క్ చేశారు.

Also Read: పవన్ 'ఓజీ'లో చంద్రబాబు ఇంటికి కాబోయే కోడలు... మెగా మేనల్లుడు ఆట పట్టించడం వెనుక అసలు కహానీ

రాజేష్ హఠాన్మరణం తనను ఎంతగానో కలచి వేసిందని రాధిక శరత్ కుమార్ పేర్కొన్నారు. ఆయనతో కలిసి ఎన్నో సినిమాలలో నటించానని, రాజేష్ అంటే తనకు ఎంతో గౌరవం అని, సినిమాలపై ఆయనకు ఉన్న జ్ఞానం అపారమని రాధిక తెలిపారు. చిత్ర సీమ గొప్ప నటుడుని కోల్పోయిందని ఆవిడ తెలిపారు.

Also Readటాలీవుడ్ డైరెక్టర్స్ మీద బాలీవుడ్ 'డర్టీ పీఆర్ గేమ్స్'... రాజమౌళి నుంచి సందీప్ రెడ్డి వంగా వరకు... ఎవరెఎర్ని టార్గెట్ చేశారో తెలుసా?