Tamannah Reaction On Liking Deepika Padukone Post: దీపికా పదుకోన్.. ఈ పేరు గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ప్రభాస్ 'స్పిరిట్' మూవీ నుంచి ఆమెను తప్పించడం, ఆ స్టోరీ లీక్ చేశారంటూ డైరెక్టర్ సందీప్ వంగా పోస్ట్ పెట్టడం, దీపికా ఇండైరెక్ట్‌గా స్పందించడం వీటన్నిటిపైనా పెద్ద చర్చే సాగింది. తాజాగా.. దీపికాకు మిల్కీ బ్యూటీ తమన్నా సపోర్ట్ చేస్తున్నారంటూ ప్రచారం సాగుతుండగా.. తమన్నా దీనిపై క్లారిటీ ఇచ్చారు.

నాకు చాలా పనులున్నాయి

దీపికా పోస్టుకు తాను లైక్ కొట్టానంటూ వస్తోన్న వార్తలపై తమన్నా తాజాగా స్పందించారు. 'తనకు తానుగా పోస్టులను ఇన్ స్టాగ్రామ్ ఎలా లైక్ చేస్తుందో చెబితే బాగుంటుంది. ఎందుకంటే ఈ విషయం తెలియని కొంతమంది దీన్ని పెద్ద వార్తలా ప్రచారం చేశారు. నేను పూర్తి చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. దీన్ని ఇంతటితో వదిలేయండి.' అంటూ తమన్నా పోస్ట్ పెట్టారు.

Also Read: పవన్ 'ఓజీ'లో చంద్రబాబు ఇంటికి కాబోయే కోడలు... మెగా మేనల్లుడు ఆట పట్టించడం వెనుక అసలు కహానీ

అసలేం జరిగిందంటే?

డైరెక్టర్ సందీప్ వంగా ట్వీట్‌కు ఇండైరెక్ట్‌గా ఓ ఇంటర్వ్యూలో దీపికా స్పందించారు. తన మనసు చెప్పిందే వింటానని.. నిజాయతీగా ఉండేందుకు ప్రాధాన్యం ఇస్తానని అన్నారు. ఈ వీడియోతో పాటు దీపికాకు చెందిన ఓ పాత వీడియోను ఆమె అభిమాని షేర్ చేశాడు. అందులో ఆమె.. పురుషులు, లింగ వివక్షత, ఓవర్ టైం వర్క్, వేతన వ్యత్యాసం, స్కిల్స్ లేకపోవడం వంటి వాటిపై మాట్లాడారు.

ఈ పోస్ట్‌కు తమన్నా లైక్ కొట్టారని సదరు అభిమాని స్క్రీన్ షాట్ షేర్ చేశాడు. దీనిపై సోషల్ మీడియాలో పెద్ద చర్చే సాగింది. స్టార్ డైరెక్టర్ చేసిన కామెంట్స్‌ దీపికను ఉద్దేశించే అని నెట్టింట ప్రచారం సాగుతుండగా.. ఈ టైంలో తమన్నా దీపికాకు సపోర్ట్ చేస్తున్నారంటూ వార్తలు హల్చల్ చేశాయి. తాజాగా దీనిపై తమన్నా ఫుల్ క్లారిటీ ఇచ్చారు.

అసలు వివాదం ఏంటంటే?

ప్రభాస్ 'స్పిరిట్' సినిమాలో బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకోన్ నటించాల్సి ఉంది. అయితే.. ఆమె పెట్టిన కండిషన్స్, రెమ్యునరేషన్లు నచ్చక డైరెక్టర్ సందీప్ వంగా ఆమెను తప్పించి.. యానిమల్ హీరోయిన్ తృప్తి దిమ్రిని హీరోయిన్‌గా తీసుకున్నారు. ఈ క్రమంలో 'స్పిరిట్' మూవీపై బాలీవుడ్‌లో పెద్ద చర్చే సాగింది. దీపికాను సపోర్ట్ చేస్తూ ఆమె ఫ్యాన్స్ కూడా పోస్టులు పెట్టారు. ఇదో అడల్ట్ రేటెడ్ మూవీ అని అందుకే దీపిక తప్పుకొందనే కామెంట్స్ చేశారు.

దీనిపై డైరెక్టర్ సందీప్ వంగా ఘాటుగానే ట్వీట్ చేశారు. ఎక్కడా దీపికా పేరు ప్రస్తావించకపోయినా.. తన కథ లీక్ చేశారని అన్నారు.  'నా స్టోరీని బయటపెట్టడం ద్వారా ఎలాంటి మనిషివో చెప్పావు. నీ ఫెమినిజం అంటే ఇదేనా?, దర్శకుడిగా ప్రతి స్టోరీ వెనుక కొన్నేళ్ల కష్టం ఉంటుంది. ఈసారి స్టోరీ మొత్తం చెప్పేసినా.. నాకు కొంచెం కూడా ఫరఖ్ పడదు. డర్టీ పీఆర్ గేమ్.' అంటూ రాసుకొచ్చారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తాను నిజాయతీకి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తానని చెప్పడంతో ఇండైరెక్ట్‌గా సందీప్‌కే కౌంటర్ ఇచ్చారంటూ చర్చ సాగుతోంది.