సామాన్యుడి పార్టీగా ఎదిగిన ఆమ్ ఆద్మీ పార్టీ (Aam Aadmi Party) నాలుగో సారి ఢిల్లీ పీఠం దక్కించుకునే విషయంలో బొక్క బొర్లా పడింది.   జాతీయ రాజకీయాల్లో అరవింద్ కేజ్రీవాల్‌కు చెందిన ఆప్ తీరు చాలా  ఆకర్షించింది. ఢిల్లీ ఆ తర్వాత పంజాబ్ రాష్ట్రాల్లో  ప్రభుత్వాలు ఏర్పాటు చేసేసరికి బీజేపీని ఎదుర్కొనే పార్టీగా ఓ దశలో చర్చసాగింది.  అదే చర్చ  ఆ పార్టీని కిందకు లాగి పడేసిందనే చెప్పాలి.  జాతీయ రాజకీయాల్లో ఏ ప్రాంతీయ పార్టీ ముందుకు సాగినా మోదీ, అమిత్ షా ద్వయం ముకుతాడు వేసే వ్యూహాలతో ఆ పార్టీని దించి పారేస్తోంది. ఇందుకు భారత రాష్ట్ర సమితి, ఆ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ను ఓ ఉదాహరణగా చెప్పుకోవచ్చు.  


పదేళ్ల పాటు తెలంగాణలో చక్రం తిప్పిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోను అదే రీతిలో తన ప్రభావం చూపేందుకు మహారాష్ట్ర వేదికగా  కార్యాచరణ ప్రారంభించారు. అంతే దీన్ని గుర్తించిన మోదీ- అమిత్ షా ద్వయం తెలంగాణ ఎన్నికల్లో  బీఆర్ఎస్ కు చెక్ పెట్టేలా వ్యూహాలు పన్ని విజయవంతం చేశారన్న చర్చ సాగుతోంది. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో విజయం సాధించినా, మూడో దఫా కేసీఆర్ గెలవకుండా బీజేపీ డిఫెన్స్ వ్యూహాన్ని అమలు చేసిందని,  అదే అగ్రేసీవ్ గా బీజేపీ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పని చేసి ఉండే  బీఆర్ఎస్ వ్యతిరేక ఓటు చీలి తిరిగి కేసీఆర్ గద్దె నెక్కే అవకాశం ఉందన్నది వాస్తవమని మీడియా వర్గాలు కూడా చెబుతున్నాయి.  


ఇది గమనించే బీజేపీ దూకుడు తగ్గించేందుకు గాను బండి సంజయ్ ను బీజేపీ రాష్ట్ర పీఠం నుండి దింపి, వ్యూహాత్మకంగా కిషన్ రెడ్డికి అప్పగించిందని అదే  కారు కొంప ముంచిందన్న విశ్లేషణలు ఉన్నాయి. ఏది ఏమైనా ఓ ప్రాంతీయ పార్టీ ఎదిగి జాతీయ రాజకీయాల్లో పాత్ర పోషించడం ఇప్పటి కిప్పుడు సాధ్యం కాదన్న పరిస్థితిని మోదీ- అమిత్ షా ద్వయం  సృష్టించారనడంలో సందేహం లేదు.


 ఇక ఆమ్ ఆద్మీ పార్టీ ఓటమికి ప్రధాన కారణాలు



1.  లిక్కర్ స్కాం -  అవినీతిని నిర్మూలిస్తామన్న హమీతో  ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీ పీఠం దక్కించుకుంది. అరవింద్ కేజ్రీవాల్ వ్యక్తిత్వం ఆ పార్టీ హామీలు  ఢిల్లీ ఓటర్లను ఆకర్షించాయి . అందుకే  రెండు సార్లు  ఢిల్లీ లో ఆమ్ ఆద్మీ పార్టీ జయకేతనం ఎగురవేసింది. దశాబ్దకాలంగా సాగిన కేజ్రీ వాల్ పాలనకు గండి కొట్టింది లిక్కర్. లిక్కర్ ప్రవాహంలో  ఆ పార్టీ కొట్టుకొని పోయింది.  ఈ స్కాంలో  సీఎం కేజ్రీ వాల్, ఉప ముఖ్యమంత్రి కేజ్రీవాల్ సైతం ఊచలు లెక్కపెట్టాల్సి వచ్చింది. ఈ వ్యవహారం ఢిల్లీ ఓటర్లపై తీవ్ర ప్రభావం చూపింది. అవినీతిపై సమరం చేసిన నాయకులే చివరకు అవినీతి కేసుల్లో జైలుకు వెళ్లడం  ఆ పార్టీని నైతికంగా బాగా దెబ్బ తీసింది.  ఈ ఎన్నికల్లో  ఆప్ ఓటమికి ప్రధాన కారణాల్లో ఇది  ఒకటి.



2. హమీల అమలులో వైఫల్యం -  ఢిల్లీ ఓటర్లకు ఆమ్ ఆద్మీ ఇచ్చిన ప్రధాన హామీల్లో వాయు కాలుష్యం తగ్గించడం, యమునా నదిని వందకు వంద శాతం శుద్ది చేస్తామని చెప్పారు. తాని ఈ రెండు హామీలను  కేజ్రీవాల్ సర్కార్ నిలబెట్టుకోలేకపోయింది. సురక్షిత తాగు నీరు నల్లా కనెక్షన్ల ద్వారా అందిస్తానన్న హమీ నిలబెట్టుకోలేకపోయిదంి. అంతే కాకుండా ఢిల్లీ రోడ్లను  యూరోపియన్ దేశాల్లోని రోడ్ల మాదిరి మారుస్తానని హామి ఇచ్చారు. ఇది నిలబెట్టుకోలేకపోయింది.  ఇదే విషయాన్ని ఆప్ సారధి కేజ్రీ వాల్ తన ప్రచాంలోను చెప్పారు. ఈ మూడు హామీలు నిలబెట్టుకోలేకపోయనని చెప్పడం గమనార్హం.  అంతే కాకుండా 12 లక్షల వరకు పన్ను మినహాయింపు ఇస్తూ మోదీ సర్కార్ తీసుకున్న నిర్ణయం మధ్య తరగతి ఓటర్ పైన ప్రభావం చూపింది.  ఈ కారణాల  ఆమ్ ఆద్మీ పార్టీ  చతికిల పడింది.


3. కాంగ్రెస్ తో వైరం -  ఇండియా కూటమిలో భాగం అయిన ఆమ్ ఆద్మీ పార్టీ- కాంగ్రెస్ ల మధ్య వైషమ్యాలు ఈ ఎన్నికల్లో రెండు పార్టీలను దెబ్బ తీశాయి. కాంగ్రెస్ ఖాతా తెరవకుండా డకౌట్ కాగా  ఆమ్ ఆద్మీ పార్టీ అధికారాన్ని దూరం చేసుకుంది. రెండు పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు విషయంలో సయోధ్య కుదరకపోవడంతో కేజ్రీవాల్ ఒంటరి పోరుకు సిద్దమయ్యారు.  ఇది తప్పని ఈ ఎన్నికల ఫలితాలు చెబుతున్నాయి.  కాంగ్రెస్ - ఆప్ పార్టీల మధ్య గొడవలు  విజయాన్ని దూరం చేశాయి. ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థులకు పడే  ఓట్లకు కాంగ్రెస్ గండి కొట్టంది. దాదాపు 15 నుంచి 20 నియోజకవర్గాల్లో ఆప్ అభ్యర్థులు వెయి నుంచి రెండు వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. అదే కాంగ్రెస్ -  ఆప్ కలిసి పోటీ చేస్తే బీజేపీకి ఇంత సుళువుగా విజయం దక్కేది కాదు. తిరిగి ఆప్ పార్టీనే సర్కార్ ఏర్పాటు చేసే స్థితిలో ఉండేది.