Hanuman Temple Demolished:
భంజన్‌పూర్‌లో కూల్చివేత..
ఢిల్లీలోని భంజన్‌పుర్ ఏరియాలో హనుమాన్ ఆలయాన్ని కూల్చేశారు PWD అధికారులు. ఆలయంతో పాటు ముస్లింల మజర్‌ని కూడా కూల్చేశారు. ఈ రెండింటినీ అక్రమంగా నిర్మించాలని తేల్చారు. యాంటీ ఎన్‌క్రోచ్‌మెంట్ డ్రైవ్‌లో భాగంగా అక్కడ పెద్ద ఎత్తున పోలీసులు మొహరించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్తపడ్డారు. భారీ సెక్యూరిటీ మధ్య కూల్చివేత ప్రారంభించారు. కొన్ని మత సంస్థలు స్థలాల్ని ఆక్రమించి ఇలా ఆలయాన్ని, మజర్‌ని నిర్మించారని అధికారులు వెల్లడించారు. కూల్చి వేత ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతున్నట్టు తెలిపారు. దీనిపై గొడవలు జరిగే అవకాశముందని గుర్తించిన అధికారులు ముందుగానే దీనిపై నోటీసులు ఇచ్చారు. రోడ్ వైడెనింగ్‌లో భాగంగా అక్రమ నిర్మాణాలు కూల్చేస్తున్నామని వెల్లడించారు. అక్కడి పరిస్థితులను పూర్తిగా అంచనా వేసిన ఓ మత కమిటీ "కూల్చేయండి" అని చెప్పాక పనులు మొదలు పెట్టారు. లెఫ్ట్‌నెంట్ గవర్నర్ కూడా అప్రూవ్ చేశాకే కూల్చివేత ప్రారంభించారు.
"అక్రమంగా నిర్మించిన హనుమాన్ ఆలయాన్ని, మజర్‌ని నిర్మించాలని లెఫ్ట్‌నెంట్ గవర్నర్ ఆదేశించారు. ఓ మత కమిటీ అంగీకారంతోనే ఇది జరుగుతోంది. ఇప్పటి వరకూ ఎలాంటి ఉద్రిక్తతలు చోటు చేసుకోలేదు"
- అధికారులు