దేశ రాజధాని ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఢిల్లీలోని చాందినీ చౌక్‌లోని లజపత్ రాయ్ మార్కెట్‌లో ఈ రోజు (డిసెంబరు 6) తెల్లవారుజామున ఈ అగ్నిప్రమాదం జరిగింది. దాదాపు 13 అగ్నిమాపక యంత్రాలు మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నట్లుగా ఏఎన్ఐ వార్తా సంస్థ తెలిపింది. అయితే, ఈ ప్రమాదంలో ఇప్పటిదాకా ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని ఢిల్లీ ఫైర్ సర్వీసెస్ (డీఎఫ్ఎస్) అధికారులు ప్రకటించారు. మొత్తం 13 ఫైర్ ఇంజిన్లను మంటలు ఆర్పేందుకు మోహరించినట్లుగా చెప్పారు.
ఈ అగ్ని ప్రమాదం ఎలా జరిగిందన్న సమాచారం ఇంకా తెలియరాలేదు. అయితే ప్రమాదానికి కారణం షార్ట్ సర్క్యూట్ కావచ్చునని భావిస్తున్నారు. ప్రస్తుతం 13 అగ్నిమాపక శకటాలు అక్కడే ఉండి మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నాయి.
ఎటువంటి ప్రాణనష్టం లేదా గాయాలు లేవు
ఢిల్లీ ఫైర్ సర్వీస్ అసిస్టెంట్ డివిజనల్ ఆఫీసర్ రాజేష్ శుక్లా మాట్లాడుతూ.. మొత్తం 105 షెల్స్ మంటల్లో చిక్కుకున్నాయని తెలిపారు. ఈ ప్రాంతాన్ని తెహ్ బజారీ అని పిలుస్తారు. ఈ ప్రమాదంలో కోట్లాది రూపాయల నష్టం వాటిల్లిందని అన్నారు. ఎంత అనేది ఇప్పుడే చెప్పలేమని అన్నారు. తెల్లవారుజామున 5.45 గంటల ప్రాంతంలో మంటలు చెలరేగినట్లు సమాచారం అందిందని అగ్నిమాపక శాఖ అధికారులు తెలిపారు.
విద్యుదాఘాతం వల్ల మంటలు చెలరేగాయని స్థానికులు కూడా అంచనా వేస్తున్నారు. ఇందులో ఎలాంటి ప్రాణనష్టం, గాయాలు జరగలేదు. మొత్తానికి 13 ఫైరింజన్లు కలిసి అగ్ని కీలలను పూర్తిగా ఆర్పివేశాయి. అగ్నిమాపక శాఖతో పాటు పెద్ద సంఖ్యలో స్థానికులు కూడా సహాయక చర్యల్లో నిమగ్నమైయ్యారు. దాదాపు 60 దుకాణాలు మంటల్లో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో కోట్లాది రూపాయల నష్టం వాటిల్లే అవకాశం ఉంది.
Also Read: పాన్ కార్డుపై డౌటా? అసలు, నకిలీ ఇలా గుర్తించండి
ప్రసిద్ధ చాందినీ చౌక్ మార్కెట్
చాందినీ చౌక్ మార్కెట్ దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింనది. ఇక్కడ ఎలక్ట్రానిక్ వస్తువులే కాకుండా బట్టల దుకాణాలు కూడా పెద్ద సంఖ్యలో ఉన్నాయి. ప్రతిరోజు లక్షలాది మంది ఈ మార్కెట్‌కు షాపింగ్ కోసం వస్తుంటారు. చాందినీ చౌక్ పరాటా లేన్, ఇంకా ఇరుకైన వీధులకు కూడా ప్రసిద్ధి చెందింది. ఈ వీధుల్లోనే షాపర్లు షాపింగ్ చేస్తుంటారు.
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి.