ఆడపిల్ల పుడుతుందని తెలిస్తే పురిట్లోనే చంపేసే కాలం నుంచి స్కానింగ్‌లో తెలుసుకుని పుట్టకముందే చంపేసే వరకు ఎన్నో ఘటనలు సమాజంలో చూసుంటాం. కానీ దేశ రాజధాని దిల్లీలో ఓ దారుణం జరిగింది. ఓ తల్లి ఏకంగా తన కన్నబిడ్డను 2 నెలల పసికందుని మైక్రోవేవ్ ఓవెన్‌లో పెట్టింది. 







ఎందుకలా చేసింది?


దిల్లీలో నివాసం ఉంటున్న గుల్షన్ కౌశిక్, డింపుల్ కౌశిక్‌లకు ఈ ఏడాది జనవరిలో ఓ పాప పుట్టింది. వీరికి ఒక కొడుకు కూడా ఉన్నాడు. తల్లి డింపుల్‌కు ఏమైందో తెలియదు గానీ రెండు నెలల పసికందుని మైక్రోవేవ్ ఓవెన్‌లో పెట్టింది. ఇలా చేసి వెంటనే తన కొడుకుతో కలసి గదిలోకి వెళ్లి తలుపుకి తాళం వేసుకుని ఉండిపోయింది.


అయితే ఆమె అత్తగారికి అనుమానం వచ్చి తలుపుతట్టింది. ఎంతకీ తలుపు తీయకపోడంతో ఇరుగు పోరుగు అంతా వచ్చి తలుపు పగలుగొట్టి చూడగానే తల్లి కొడుకులిద్దరూ అపస్మారక స్థితిలో ఉన్నారు. అయితే వారి వద్ద పాప కనిపించలేదు. వారంతా చుట్టూ గాలించిన కాసేపటికి ఏదో అనుమానంతో మైక్రోవేవ్ ఓవెన్‌ తెరిచి చూడగా అందులో పాప చనిపోయి ఉంది. ఇది చూసి షాక్ అయి.. వారు పోలీసులకు సమాచారమిచ్చారు.


తల్లే చేసింది!


పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో పాప తల్లే ప్రధాన నిందుతురాలిగా తేలింది. ఆడపిల్ల పుట్టడంతో కలత చెంది భర్తతో తరచూ గొడవ పడుతున్నట్లు దర్యాప్తులో తేలింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అయితే ఆడపిల్ల పుట్టినందుకే హత్య చేసి, ఓవెన్‌లో పెట్టిందని తల్లిపై ఆరోపణలు చేస్తున్నారు స్థానికులు. 


Also Read: Court Notice To Lord Shiva : దేవుడిపై కబ్జా కేసు - పైగా రూ. పదివేలు ఫైన్ వేస్తామని వార్నింగ్ ! ఇప్పుడు దేవుడికి దారేది?


Also Read: Swami Sivananda: 125 ఏళ్ల యోగా గురువు ఆరోగ్యం గురించి టాప్ 10 సీక్రెట్స్ ఇవే!