Genius Behind Made In India Akash Missile System:  మే 8,  మే 9  రాత్రి సమయంలో జమ్మూ కాశ్మీర్‌లోని పశ్చిమ సరిహద్దు , నియంత్రణ రేఖ వెంబడి పాకిస్తాన్ చేసిన అనేక డ్రోన్ దాడులను భారత సైన్యం విజయవంతంగా  కూల్చివేసింది.  మేడ్-ఇన్-ఇండియా ఆకాశ్ క్షిపణి వ్యవస్థ ఆకాశ్ ఈ పని తీరు చూపించింది. ఆకాశ్ క్షిపణి  పాకిస్తాన్‌కు కలిగించిన విధ్వంసం  భారతదేశంలో తయారు చేసిన ఆయుధాలను కూడా శత్రువులను సమర్థవంతంగా అడ్డుకోగలదని నిరూపించింది. 

 ఆకాశ్ మిస్సైల్  డెడ్లీ ఫైటర్ 

 ఆకాశ్ మిస్సైల్  స్వదేశీ సాంకేతికతతో అభివృద్ధి చేసిన మధ్య శ్రేణి సర్ఫేస్-టు-ఎయిర్ మిస్సైల్  వ్యవస్థ. ఇది డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) ఆధ్వర్యంలో ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిస్సైల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ (IGMDP)లో భాగంగా రూపొందించారు.   ఈ వ్యవస్థ భారత సైన్యం , వైమానిక దళంలో క్రియాశీలంగా ఉంది ఆకాశ్-NG వెర్షన్‌లో 70-80 కి.మీ. వరకు ఇది లక్ష్యాలను చేధిస్తుంది.  ఫైటర్ జెట్‌లు, క్రూయిజ్ మిస్సైళ్లు, డ్రోన్లు, హెలికాప్టర్లు, బాలిస్టిక్ మిస్సైళ్ల నుండి విడుదలైన వార్‌హెడ్‌లను నాశనం చేయగలదు. ఒకే మిస్సైల్‌తో 88 శాతం, రెండు మిస్సైళ్లతో 98.5 శాతం ఖచ్చితత్వంతో లక్ష్యాలను అందుకుంటుంది. 

ఆకాష్ మిస్సైళ్లను అభివృద్ధి చేయడానికి బారత్ చాలా కష్టపడింది.  1983లో  పరిశోదనలు ప్రారంభమయ్యాయి.  1990లో మొదటి టెస్ట్ ఫైరింగ్ చేశారు. 20 సంవత్సరాల పాటు అభివృద్ధి చేశారు.  భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (BDL), భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL), టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్, లార్సెన్ అండ్ టుబ్రో సంస్థలు తయారు చేస్తున్నాయి. వీటిని విదేశాలకూ ఎగుమతి చేస్తున్నారు.  మే 2015లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో వాడటం ప్రారంభించార..ుు  మే 8-9, 2025 రాత్రి జమ్మూ కాశ్మీర్ మరియు పశ్చిమ సరిహద్దులో పాకిస్తాన్ డ్రోన్లు , మిస్సైళ్లను ఆకాశ్ వ్యవస్థ విజయవంతంగా అడ్డుకుంది. ఇది భారత రక్షణ సామర్థ్యాలను, స్వదేశీ సాంకేతికత   శక్తిని నిరూపించింది.  

ఆకాష్ సృష్టికర్త  డాక్టర్ ప్రహ్లాద రామారావు  

ఆకాష్ క్షిపణి వెనుక మాస్టర్ మైండ్  డాక్టర్ ప్రహ్లాద రామారావు.  భారతదేశంలోని ప్రముఖ మిస్సైల్ సైంటిస్ట్, పద్మశ్రీ అవార్డు గ్రహీత, DRDOలో దశాబ్దాల పాటు సేవలందించి, భారత రక్షణ సామర్థ్యాలను గణనీయంగా బలోపేతం చేశారు.  డాక్టర్ APJ అబ్దుల్ కలాం ఆయనను 37 ఏళ్ల వయసులో ఆకాశ్ ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా నియమించారు.  అతి చిన్న వయసులో ఈ బాధ్యత తీసుకున్న రికార్డు ప్రహ్లాద రామారావు సొంతం.  15 సంవత్సరాల్లో అభివృద్ధి చేయాలనుకున్నారు కానీ   బదులుగా 20 సంవత్సరాలు (1983-2003) పట్టినప్పటికీ, ఆకాశ్ వ్యవస్థను పూర్తిగా స్వదేశీ సాంకేతికతతో అభివృద్ధి చేశారు. అనేక దేశాలు ఆకాశ్ విజయవంతం కాదని విమర్శించాయి, కానీ డాక్టర్ కలాం మద్దతుతో, రామారావు 1,000 మంది శాస్త్రవేత్తల బృందంతో విజయం సాధించారు. 2005-2008 మధ్య జరిగిన ట్రయల్స్‌లో ఆకాశ్ విజయవంతంగా లక్ష్యాలను నాశనం చేసింది, 2008లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో చేరింది  

 ఆకాశ్ వ్యవస్థ పాకిస్తాన్ దాడులను నిరోధించినప్పుడు, ఆయన దీనిని తన “జీవితంలో అత్యంత సంతోషకరమైన రోజు”గా వర్ణించారు, “నా బిడ్డ అద్భుతంగా పనిచేసింది” అని మీడియా సంస్థతో చెప్పారు. ప్రస్తుతం  హైలెనర్ టెక్నాలజీస్‌లో LENR రీసెర్చ్‌పై దృష్టి సారించారు.  ఇది న్యూక్లియర్ ఫ్యూజన్ ద్వారా సస్టైనబుల్ ఎనర్జీని ఉత్పత్తి చేయడం లక్ష్యంగా దీన్ని ప్రారంభించారు.