India Pakistan Attack: భారత సైన్యం ఉగ్రవాద లాంచ్‌ప్యాడ్‌లను ధ్వంసం చేసింది. 2025 మే 8- 9 రాత్రి జమ్మూ కశ్మీర్, పంజాబ్‌లోని అనేక నగరాల్లో డ్రోన్ దాడులకు పాకిస్థాన్ విఫలయత్నం చేసినప్పుడు ఈ చర్య  చేపట్టింది ఇండియన్ ఆర్మీ. ఉగ్రవాద లాంచ్‌ప్యాడ్‌లపై భారత సైన్యం ముందస్తు దాడి చేసింది. బాంబులతో ఆ ప్రదేశాన్ని బూడిద చేసింది. నియంత్రణ రేఖకు దగ్గరగా ఉన్న ఉగ్రవాద లాంచ్‌ప్యాడ్‌లు భారత పౌరులు, భద్రతా దళాలపై ఉగ్రవాద దాడులను ప్లాన్ చేయడానికి ఈ లాంచ్‌ ప్యాడ్‌లను వాడుకుంటున్నారు. భారత సైన్యం చేపట్టిన చర్యల కారణంగా ఉగ్రవాదులకు కోలుకోలేని దెబ్బలు తగులుతున్నాయి.  

ఉగ్రవాదులను టార్గెట్ చేస్తే పాకిస్థాన్‌ తప్పుడు ప్రచారం చేస్తోంది. భారత్‌ పౌర స్థానాలను లక్ష్యంగా చేసుకుంటుందని ఆరోపించింది. కానీ భారత సైన్యం ఉగ్రవాదులకు వ్యతిరేకంగా, అంతర్జాతీయ చట్టం ప్రకారం మాత్రమే పనిచేస్తుందని భారతదేశం పునరుద్ఘాటించింది. ఏ పౌర లేదా సైనికేతర ప్రాంతాలను టచ్ చేయలేదు. 

పాకిస్తాన్‌లోని ఓ గురుద్వారాపై భారత్ డ్రోన్ దాడి చేసిందనే వాదనలను ప్రభుత్వం శనివారం (మే 10) తోసిపుచ్చింది. "సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియో గురుద్వారాపై భారత్‌ చేసిన డ్రోన్ దాడిగా చెబుతోంది. ఈ వాదన పూర్తిగా ఫేక్" అని పిఐబి ఫ్యాక్ట్ చెక్ యూనిట్ తెలిపింది. భారత్‌ మత విద్వేషాలు సృష్టించడానికి ఇలాంటి కంటెంట్ ప్రచారం చేస్తున్నట్టు పేర్కొంది. నంకనా సాహిబ్ సిక్కు మత స్థాపకుడు గురునానక్ జన్మస్థలం. ఇక్కడ ఉండే గురుద్వారా సిక్కులకు గౌరవనీయమైన ప్రదేశం. అందుకే దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు పాకిస్థాన్ కుయుక్తులు పన్నుతోంది. 

పాకిస్తాన్ రక్షణ వ్యవస్థలే లక్ష్యంగా భారత్‌ ఎదురుదాడి పాకిస్తాన్ డ్రోన్లు, క్షిపణులను ఉపయోగించి భారతదేశంలోని 26 ప్రదేశాలపై దాడులు చేసింది. ప్రతిస్పందనగా పాకిస్థాన్‌ ఆయుధాలు కూల్చేసిన భారత సైన్యం ఎదురుదాడి చేసింది. 

ఎంపిక చేసుకున్న లక్ష్యాలను మాత్రమే టార్గెట్ చేశాయి. వీటిలో సైన్యానికి సంబందించిన టెక్నాలజీ సెంటర్లు, కమాండ్ అండ్ కంట్రోల్‌ సెంటర్లు, రాడార్ సైట్లు, ఆయుధ డిపోలు ఉన్నాయి. భారత యుద్ధవిమానాలు,  ఫైటర్ జెట్‌లు రఫికి, మురిద్, చక్లాలా, రహిమ్యార్ ఖాన్, సుఖూర్,  చునియా వద్ద ఉన్న సైనిక స్థావరాలపై దాడి చేశాయి.  

భారత, పాకిస్తాన్ మధ్య జెట్‌ఫైట్  ఏప్రిల్ 22న పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడి తర్వాత ఉద్రిక్తతలు పెరిగిన తర్వాత భారత్‌, పాకిస్తాన్ మొదటిసారి జైట్‌ఫైట్‌ జరిగింది. శనివారం తెల్లవారుజామున రెండు దేశాల యుద్ధ విమానాలు అరుదైన డాగ్‌ఫైట్‌లో పాల్గొన్నాయి. పాకిస్తాన్ విమానాలు భారత గగనతలంలోకి రావడంతో ఈ ఘర్షణ జరిగింది. భారత వైమానిక దళం గట్టి స్పందననే పాకిస్థాన్ ఎదుర్కొంది. దెబ్బకు పాకిస్థాన్ జెట్‌లు వెనక్కి పారిపోయాయి. పాకిస్తాన్ జెట్‌లు జమ్మూ మీదుగా భారత గగనతలంలోకి ప్రవేశించిన తర్వాత ఈ డాగ్‌ఫైట్ ప్రారంభమైంది.