Pakistan Army Chief Asim Munir Shani Effect: 22 ఏప్రిల్ 2025న జమ్మూ-కశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన ఉగ్రవాద దాడిలో 26 మంది పర్యటకులు మరణించారు. దీని వెనుక అత్యంత ప్రముఖంగా వినిపించిన పేరు పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ జనరల్ ఆసిమ్ మునీర్ (Asim Munir), దాడికి కొన్ని రోజుల ముందు అసిమ్ ఉద్దేశపూర్వకమైన ప్రసంగం చేసి వాతావరణాన్ని విషపూరితం చేశాడు. కానీ ఈ మొత్తం కుట్రకు గ్రహాల నక్షత్రాల కదలికల ద్వారా చాలా ముందుగానే సంకేతాలు లభించాయా?
శని ప్రభావం
ప్రస్తుతం మీనరాశిలో ఉన్న శని...మేష రాశి నుంచి 12వ స్థానంలో సంచిస్తున్నాడు. అంటే మేష రాశివారికి శని మొదటి దశ ప్రారంభమైంది. దీనిని జ్యోతిష్య శాస్త్రం ప్రకారం భ్రమ దశ అంటారు. ఆసిమ్ మునీర్ నామ రాశి ప్రకారం మేషం ..అందుకే ప్రస్తుతం ఆయన నిర్ణయాల్లో కఠినత్వం, అహంకారం, వివేచన లేకపోవడం పెరుగుతోంది.
మంగళుడి నీచస్థానం పాక్ కు అశుభం
అనవసర ఆగ్రహం, విఫలమైన వ్యూహం వెనుక గ్రహాల కదలిక స్పష్టంగా కనిపిస్తోంది. మేష రాశి అధిపతి మంగళుడు ప్రస్తుతం కర్కాటక రాశిలో నీచస్థితిలో ఉన్నాడు. ఈ యోగం నిర్ణయాల్లో విఫలం, అధిక కోపం సైనిక వ్యూహాల్లో విఫలం సూచిస్తుంది. సైన్యానికి మంగళుడు మంచిదిగా పరిగణించబడుతుంది, మునీర్‌కు మంగళుడు అధికారాలను పెంచుతాడు కానీ నీచస్థితిలో ఉండటం వల్ల ఫలితం దానికి విరుద్ధంగా ఉంటుంది.
శుక్రుని దశ అగ్నికి ఆజ్యం పోస్తుంది
పాకిస్థాన్ కుండలి నుంచి స్పష్టంగా తెలుస్తోంది...అదిప్పుడు సంక్షోభంగా మారబోతోంది. పాకిస్థాన్ కుండలి మేష లగ్నం... ప్రస్తుతం శుక్రుని దశ నడుస్తోంది. శుక్రుడు ఈ కుండలిలో మారకేశుడు..అంటే పరిస్థితి ఓ రోగి వెంటిలేటర్‌పై ఉన్నట్లుగా ఉంటుంది. ఈ దశ దేశంపై ఆర్థిక, వ్యూహాత్మక సామాజిక సంక్షోభాలను ఒకేసారి తెస్తుంది.
భారత్-పాక్ ఉద్రిక్తత యుద్ధం వైపు పెరుగుతోందా?
8 మే 2025న పాకిస్థాన్ భారతదేశంపై క్షిపణులు డ్రోన్లతో దాడి చేసి ఉద్రిక్తతను తీవ్రతరం చేసింది. భారత కుండలి (Bharat Kundli) వృషభ లగ్నం, ఇందులో శుక్రుడు లగ్నేశుడుగా శుభ ఫలితాలను ఇస్తున్నాడు. శని దృష్టి ఇప్పుడు న్యాయం వైపు మళ్లుతోంది. పాకిస్థాన్ యొక్క ఈ చర్యకు భారతదేశం తగిన సమాధానం ఇస్తోంది..మరింత గట్టిగా పాక్ కుట్రలు తిప్పికొట్టబోతోంది ఆసిమ్ మునీర్...శని ప్రభావంలో చిక్కుకున్న సేనాధిపతి
శని మొదటి దశలో వ్యక్తి మానసిక స్థైర్యం బలహీనపడుతుంది. ఆసిమ్ మునీర్ ఇటీవలి ప్రసంగం, నిర్ణయంలో శని శిక్ష కనిపిస్తుంది. జనరల్ అసిమ్ మునీర్ 29 జనవరి 2022న ఉదయం 11 గంటల 30 నిమిషాలకు రావల్పిండిలో పాకిస్థాన్ సైన్యాధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు మకర లగ్నం ఉదయించింది. ప్రమాణ స్వీకారం చేసిన సమయంలోనే శని-చంద్రుల సంయోగం వల్ల విషయోగం ఏర్పడింది. శని శిక్ష నుంచి ఆసిమ్ మునీర్ తప్పించుకోలేడు, చేసిన పనికి తగిన ఫలితం అనుభవించాల్సిందే.
ఆసిమ్ మునీర్ (Asim Munir) రాశిలో శని, పాకిస్థాన్ కుండలి (Pakishtan Kundli)లో మారకేశుని దశ మరియు ప్రస్తుత సమయంలో ఇతర గ్రహాల గోచారం, ఈ మూడు పాకిస్థాన్ కు చిక్కులు తెచ్చిపెడుతుందని చెబుతున్నారు జ్యోతిష్య శాస్త్ర పండితులు.
13 నుంచి 23 మే 2025 వరకు ఉన్న సమయం ఆసిమ్ మునీర్‌కు చాలా సవాలుతో కూడుకున్నది. జూన్ విషయానికి వస్తే 6, 7 , 9 తేదీలు కూడా సంక్షోభంతో కూడుకున్నవే భారతదేశంపై శని ప్రభావం ఎలా ఉందంటే?
భారత కుండలిలో శని మూడవ భావంలో ఉన్నాడు, ఇది ధైర్యం, విధానం మరియు ఆత్మవిశ్వాసానికి సంకేతం. అందుకే భారతదేశం ప్రతి దశలోనూ పాకిస్తాన్ కుట్రలు తిప్పకొడుతోంది. భారతదేశ పరిస్థితి చాలా బలంగా ఉంది. దౌత్య రంగంలో కూడా ఈసారి పాక్ నిలవడం కష్టమే...ఎందుకంటే భారత్ అంతలా బదులు చెప్పబోతోంది.
గమనిక: అంతర్జాలంలో అందుబాటులో ఉన్న కొన్ని వివరాలు, జ్యోతిష్య శాస్త్రం గ్రంధాల ఆధారంగా రాసిన కథనం ఇది. దీనిని ఎంతవరకూ విశ్వశించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం...