India Pakistan Attack News :
జైపూర్ జోధ్‌పూర్‌లో పాల్ బాలాజీ జ్యోతిష్య సంస్థ డైరెక్టర్ జ్యోతిష్యచార్యులు డాక్టర్ అనిష్ వ్యాస్ పేర్కొన్న వివరాల ప్రకారం...
నరేంద్ర మోడీ 1950 సెప్టెంబర్ 17న మధ్యాహ్నం 12 గంటల 9 నిముషాలకు జన్మించారు. ఆయన జనన సమయంలో చంద్రుడు, మంగళుడు ఇద్దరూ కుండలి మొదటి ఇంట్లో వృశ్చిక రాశిలో ఉన్నారు. అయితే పదకొండో ఇంట్లో సూర్యుడు, బుధుడు కేతువు కలిసి ఉన్నారు. గురువు నాలుగ స్థానంలో, శుక్రుడు - శని వ్యతిరేక దిశలో ఉన్నారు. జాతకం ప్రకారం మోదీది వృశ్చిక లగ్నం. మంగళుడు శుభస్థానంలో ఉన్నాడు. ఫలితంగా మోదీ ఆత్మవిశ్వాసం నానాటికీ మరింత పెరుగుతుంది. ధైర్యంతో తన ప్రత్యర్థులను ఓడించి ముందుకు సాగుతారు. తన ప్రత్యర్థులను ఎప్పటికీ క్షమించలేరు. అవకాశం వస్తే ప్రత్యర్థులకు ప్రతీకారం తీసుకుంటారు.
జనన కుండలి ప్రకారం లగ్నశ మంగళుడు నవమేశ చంద్రునితో కలిసి ఉన్నాడు. అందుకే PM మోదీ కుండలిలో చంద్రుని దశ ప్రారంభమైన వెంటనే రాజకీయాల్లో రాణించడం మొదలవుతుంది...అంచెలంచెలుగా పార్టీలో ప్రాబల్యం పెరుగుతుంది. చంద్రుడు, మంగళుని రాజయోగం గత రెండు దశాబ్దాల కన్నా ముందు గుజరాత్ మరియు ఇప్పుడు కేంద్ర రాజకీయాల్లో పెద్ద విజయాలను అందిస్తుంది. నరేంద్ర మోదీ కుండలిలో చంద్రుని నుంచి కేంద్రంలో గురువు ఉండటం వల్ల గజకేసరి యోగం, పంచమ భావంలో ఉన్న రాహువుపై దశమేశ సూర్యుని దృష్టి వల్ల ఏర్పడుతున్న రాజయోగం కూడా పెద్ద విజయాలను అందిస్తుంది.
చంద్ర-మంగళ యోగంతో శత్రుహంత యోగం కూడా ఏర్పడుతుంది. దీని వలన మోదీని ప్రత్యర్థులు , శత్రువులు ఎప్పటికీ ఏమీ చేయలేరు.
రుచక మహాయోగం వల్ల వ్యక్తిలో నిర్ణయం తీసుకునే సామర్థ్యం బలంగా ఉంటుంది, దీని ప్రభావం ప్రధాని మోదీ తీసుకున్న నిర్ణయాల్లో స్పష్టత ఉంటుంది
చంద్ర-మంగళ యోగం వల్ల వ్యక్తి సాధారణంగా కనిపిస్తారు కానీ తన రోజువారీ పనుల్లో చాలా చురుకుగా ఉంటాడు, ఇది ప్రధానమంత్రి మోదీ తీరు గమనిస్తే అర్థమవుతుంది. ఈ యోగం వ్యక్తిని క్రమశిక్షణకు లోబడి ఉండేలా చేస్తుంది.
PM నరేంద్ర మోడీ కుండలిలో గజకేసరి యోగం కూడా ఉంది, దీని వలన వారి వ్యక్తిత్వం సింహంలా కనిపిస్తుంది.
మోడీ కుండలిలో మంగళుడు , చంద్రుడు లగ్నంలో ఉన్నారు. ఏకాదశ స్థానంలో సూర్యుడు బుధుని సంయోగం ఉంది. దీని వలన బుధాదిత్య రాజయోగం ఏర్పడింది. అందుకే PM మోదీ ఎల్లప్పుడూ ప్రజాదరణ పొందిన నేతగా ఉంటారు. అలాగే ఎల్లప్పుడూ గౌరవాన్ని పొందుతారు. శత్రువులు ఎప్పటికీ వారిని ఓడించలేరు.
జ్యోతిష్యచార్యులు డాక్టర్ అనిష్ వ్యాస్ తెలిపిన వివరాల ప్రకారం..ఏప్రిల్ 2025 నుంచి జూన్ 2026 వరకు PM మోదీ దేశ హితంలో పెద్ద నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందిృ. జూన్ 2025 నుంచి జూన్ 2027 వరకూ మోదీ కొన్ని అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటారు.
ప్రస్తుతం మోదీ కుండలిలో మంగళుని మహాదశ నడుస్తోంది. 2021 నవంబర్ 29న ప్రారంభమై 2028 నవంబర్29 వరకు ఉంటుంది. దీని వలన మోదీతో పాటూ భారతదేశం యొక్క శక్తి , గౌరవం ప్రపంచవ్యాప్తంగా మరింత పెరుగుతుంది.
గురువు అంతర్దశ ఉండటం వలన ప్రపంచంలోని అన్ని దేశాల నేతలు మోదీని తమ నేతగా భావిస్తారు.
దశమ భావంలో శుక్రుడు ఉండటం వలన సవాళ్లు ఎదురవుతాయి కానీ గురువు వలన వాటిని అధిగమించి విజయం సాధిస్తారు.
పంచమ భావం మీన రాశిలో రాహువు ఉన్నాడు. దీని వలన మోదీకి సంతాన సుఖం లభించలేదు. గురువు ప్రభావం వలన మోదీకి వివాహం జరిగింది కానీ సప్తమేశ శత్రుక్షేత్రీగా ఉండటం శనితో సంయోగం కారణంగా వారికి దాంపత్య సుఖంలేదు.
దశమ భావం సింహ రాశిలో శుక్రుడు , శని సంయోగం ఉంది, దీని దృష్టి చతుర్థ భావంపై ఉంది. శుక్రుడు శని సంయోగం దశమ భావంలో ఉంటే, అలాంటి వ్యక్తుల గురించి వారి జీవనశైలి రాజులలా ఉంటుందని చెబుతారు. ప్రజల కారకంగా చతుర్థేశ శని దశమ భావంలో ఉన్నాడు మరియు శని పూర్తి దృష్టి తన భావంపైనే ఉంది.
చతుర్థేశ యొక్క చతుర్థ భావంపై దృష్టి వారిని జనప్రియ నేతగా చేస్తుంది. ఏకాదశ భావం కన్యారాశిలో కేతువు, సూర్యుడు మరియు బుధుని సంయోగం ఉంది. సుఖం మరియు సంపద యొక్క భావం ఏకాదశంలో సూర్యుడు బుధుని సంయోగం వలన బుధాదిత్య యోగం ఏర్పడుతుంది.
మోడీ కుండలిలో పని ప్రదేశానికి అధిపతి సూర్యుడు... లాభ భావంలో తన స్నేహితుడు బుధునితో కలిసి 'బుధాదిత్య' అనే రాజయోగం ఏర్పడుతుంది.
గ్రహాల ఈ స్థితి కారణంగా మోదీ కుండలిలో అనేక శుభ యోగాలు ఏర్పడ్డాయి. గజకేసరి యోగం, మూసల యోగం, కేదార యోగం, రుచక యోగం, వోషి యోగం, భేరి యోగం, చంద్ర మంగళ యోగం, నీచ భంగ యోగం, అమర్ యోగం, కాలహ యోగం, శంఖ యోగం మరియు వృద్ధ యోగం ఏర్పడ్డాయి. ఓ దశలో నీచ రాజభంగ యోగం ఉన్న వ్యక్తి చాలా ప్రభావవంతంగా ఉంటాడని చెబుతారు. సాధారణంగా అలాంటి వ్యక్తి ఎంత ఎక్కువగా వ్యతిరేకతను ఎదుర్కొంటాడో అంతకు మించిన ఎత్తుకు వెళ్తారు.
జ్యోతిష్యచార్యులు డాక్టర్ అనిష్ వ్యాస్ 14 సెప్టెంబర్ 2020లో చెప్పిన అంచనాల ప్రకారం...మోదీ రానున్న ఏడెనిమిది సంవత్సరాలు ప్రధానిగా కొనసాగుతారు. ప్రధానిగా ఆయన గౌరవం ప్రపంచవ్యాప్తంగా మరింత పెరుగుతుంది. ప్రపంచంలో ఒక పెద్ద దేశం తన తప్పు వల్ల కష్టకాలం గడుపుతుంది. ప్రపంచ స్థాయిలో దేశం బలపడుతుంది. భారతదేశ విదేశీ విధానం పూర్తిగా విజయవంతం అవుతుంది. భారతదేశ పొరుగు దేశాల్లో రాజకీయ అల్లర్లు కూడా సంభవించవచ్చు. సైన్యంలో కొత్త ఆయుధాలు మరియు విమానాలు చేరే అవకాశం ఉంది. దేశ భద్రతా విధానం మరింత బలపడుతుంది.
రాహువు , శని స్థితి కారణంగా సరిహద్దుల్లో ఉద్రిక్తత పెరుగుతుంది, కానీ దేశ సైన్యం బలంగా ఉంటుంది. పొరుగు దేశాలపై భారతదేశ ప్రభావం పెరుగుతుంది. ఆర్థిక విషయాల్లో కూడా దేశం ప్రపంచ స్థాయిలో బలంగా ఉంటుంది.
భగవంతుని అమోఘ ఆశీర్వాదం శ్రీ నరేంద్ర మోడీని భారతదేశ భాగ్య విధాతగా చేస్తుందని చెప్పారు జ్యోతిష్యచార్యులు డాక్టర్ అనిష్ వ్యాస్ .