Pakistan 6 Lakh Soldiers:  పాకిస్తాన్ కు ఉన్న ఆదాయ వనరులు మాత్రమే కాదు సైనిక వనరులు కూడా పరిమితమేనని పాకిస్తాన్ కు చెందిన వారే బయట పెడుతున్నారు. పాకిస్తాన్ కు కేవలం ఆరు లక్షల మంది మాత్రమే సైన్యం ఉందని కానీ భారత్ పదహారు లక్షల మంది ఉన్నారని  పాకిస్తాన్  ఎయిర్ మార్షల్ మసూద్ అఖ్తర్ ఆందోళన వ్యక్తం చేశారు.  

భారత్‌తో పోలిస్తే సైనిక సామర్థ్యంలో గణనీయమైన అంతరం ఉందని ఆయన బయట పెట్టారు.  మసూద్ అఖ్తర్ పాకిస్తాన్ నాయకులు కఠిన నిజాలను అంగీకరించాలని  హెచ్చరించారు, భారత్‌కు 16 లక్షల సైనికులు ఉండగా, పాకిస్తాన్‌కు కేవలం 6 లక్షల మంది సైనికులు మాత్రమే ఉన్నారని పేర్కొన్నారు. ఈ సంఖ్యా తేడా పాకిస్తాన్‌కు భారత్‌తో ఏ రంగంలోనూ సమానంగా పోటీపడే అవకాశం లేకుండా చేస్తుందని, ముఖ్యంగా దీర్ఘకాల యుద్ధంలో అసాధ్యమని ఆయన హెచ్చరించారు. 

భారత్-పాకిస్తాన్ మధ్య ఇటీవలి ఉద్రిక్తతలు, ముఖ్యంగా పహల్గాం ఉగ్రదాడి వంటి ఘటనలు, పాకిస్తాన్ సైనిక సామర్థ్యంపై ఒత్తిడిని మరింత పెంచాయి. మసూద్ అఖ్తర్ పాకిస్తాన్  పరిమిత సైనిక బలం..  సామర్త్యాన్ని బలహీనపరుస్తుందని, ఈ విషయంలో ఆశావాద ధోరణి లేదా తప్పుడు ఆత్మవిశ్వాసం ప్రమాదకరమని సూచించారు.  

పాకిస్తాన్ సైన్యం అంతర్గత సవాళ్లకు కూడా ఎదుర్కొంటోంది.  బలూచిస్తాన్‌లో సవాళ్లు,  ఆర్థిక అస్థిరత కూడా పాక్ సైన్యంపై ప్రభావం చూపిస్తున్నాయి. ఇవి పాకిస్తాన్ సైన్యం బహుళ రంగాలలో పని చేయాల్సి వస్తుందని . దీని వల్ల సమర్థత తగ్గిపోతోందని అంటున్నారు.