Delhi High Court Extends Stay On Kejriwal Bail Petition: ఢిల్లీ లిక్కర్ పాలసీకి (Delhi Liquor Case) సంబంధించి సీఎం అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) మరోసారి చుక్కెదురైంది. ఆయన బెయిల్‌పై స్టే కొనసాగుతుందని ఢిల్లీ హైకోర్టు (Delhi HighCourt) మంగళవారం తీర్పు వెలువరించింది. ఢిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించి కేజ్రీవాల్ పిటిషన్‌పై రికార్డులు పరిశీలించకుండానే ట్రయల్ కోర్టు బెయిల్ మంజూరు చేసిందని ఉన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. ఈ క్రమంలో లిక్కర్ కేసుకు సంబంధించి ఆయన తీహాడ్ జైలులోనే ఉండనున్నారు. కాగా, సోమవారం సుప్రీంకోర్టులోనూ ఆయనకు ఊరట దక్కలేదు. ట్రయల్ కోర్టు ఇచ్చిన బెయిల్‌పై హైకోర్టు స్టే విధించడంపై ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారించిన న్యాయస్థానం హైకోర్టు తీర్పు వచ్చేంత వరకూ వేచి ఉండాల్సిందేనని స్పష్టం చేసింది.










ఈ నెల 26న విచారణ


కేజ్రీవాల్ పిటిషన్‌పై ఈ నెల 26న (బుధవారం) సుప్రీంకోర్టు విచారణ జరపనుంది. హైకోర్టు తుది తీర్పు వచ్చిన వరకూ వేచి ఉండాలని కేజ్రీవాల్‌కు సూచించింది. ఈ క్రమంలో హైకోర్టు బెయిల్‌పై స్టే కొనసాగిస్తూ తీర్పు ఇచ్చింది. దీంతో ఉత్కంఠ నెలకొంది. కాగా, ఢిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించి మనీ లాండరింగ్ కేసులో సీఎం కేజ్రీవాల్‌కు ఈ నెల 20న ట్రయల్ కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసిన ఈడీ.. హైకోర్టును ఆశ్రయించింది. ఈ క్రమంలో విచారించిన ఉన్నత న్యాయస్థానం ఆయన బెయిల్‌పై స్టే విధించింది. దీంతో హైకోర్టు నిర్ణయాన్ని కేజ్రీవాల్ సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. దీనిపై బుధవారం విచారణ జరగనుంది.


Also Read: Delhi minister : విషమించిన ఢిల్లీ మంత్రి అతిషి ఆరోగ్య పరిస్థితి.. ఆసుపత్రికి తరలింపు