Delhi Crime News: ఇతరులను వేధించడానికి తన భర్త నకిలీ పోలీసుగా, లాయర్ గా చలామణి అవుతున్నట్లు పోలీసులకు ఓ మహిళ ఫిర్యాదు చేసింది. అందుకు సంబంధించిన నకిలీ ఐడీ కార్డులను, యూనిఫామ్ లను కూడా పోలీసులకు అప్పగించింది. ఇదే కాకుండా తననూ, తన పిల్లలను భర్త కొట్టేవాడని, హింసించేవాడని చెప్పంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టగా అతడు పారిపోయాడు. 


గ్రేటర్ నోయిడాలోని గౌర్ సిటీలో నివాసం ఉండే నిషా అనే మహిళ తన భర్త అరాచకాల గురించి పోలీసులకు తెలిపింది. తన భర్త తనూజ్ సింగ్ పోలీసుగా, న్యాయవాదిగా నటించి చాలా మందిని ఇబ్బందులకు గురి చేశాడని వివరించింది. అలాగే తన భర్త ఉపయోగించిన యూనిఫాం, ఐడీ కార్డులు, ఇతర వస్తువులను కూడా నిషా పోలీసులకు అప్పగించింది. అంతేకాకుండా తనను, తన పిల్లలను కొట్టేవడాని ఆరోపిస్తూ.. నిషా సింగ్ తన భర్త గృహహింస చట్టం కింద కేసు పెట్టింది. తనూజ్ నకిలీ పోలీసుగా, న్యాయవాదిగా నటించి ప్రజన నుంచి డబ్బులు వసూలు చేసేవాడని ఆమె ఆరోపించింది.


ఇదిలా ఉండగా.. గౌర్ సిటీ 14వ అవెన్యూలో నివాసం ఉంటున్న తనూజ్ సింగ్ శుక్రవారం (జూలై 14) బిస్రఖ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్లు ఇన్‌ఛార్జ్ అనిల్ రాజ్‌పుత్ తెలిపారు. తన భార్య నిషాతో విభేదాల నేపథ్యంలో తాను ఓ హోటల్‌లో ఉంటున్నానని తనూజ్ సింగ్ తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. జులై 12వ తేదీన తన భార్య తనను ఇంటికి రమ్మని కోరిందని ఆరోపించాడు. అతను అక్కడికి చేరుకోగానే.. నిషా తన కుటుంబ సభ్యులు, స్నేహితులను పిలిచి తనను కొట్టడానికి ప్రయత్నించిందని వివరించాడు. తనూజ్ ఫిర్యాదుపై పోలీసులు శుక్రవారం కేసు నమోదు చేశారు. ఇది జరిగిన రెండు రోజులకే  నిషా తన భర్తపై మోసం, గృహహింస ఆరోపణలు చేస్తూ కేసు పెట్టింది. ఇద్దరి వైపు నుంచి కేసులు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. భార్య పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలుసుకున్న తనూజ్ సింగ్.. ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. అతని ఆచూకీ కోసం పోలీసు బృందాన్ని ఏర్పాటు చేశారు.


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి    
Join Us on Telegram: https://t.me/abpdesamofficial