ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో మాజీ ఉపముఖ్యమంత్రి, ఆప్ సీనియర్ నేత మనీష్ సిసోడియాను కోర్టుకు తరలించారు. ఈ సమయంలో పోలీసులు మనీష్ సిసోడియా మెడను పట్టుకుని తీసుకెళ్లడం కనిపించింది. దీనికి సంబంధించిన వీడియోను ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. పోలీసు చర్యలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు కేజ్రీవాల్.
మనీష్ సిసోడియా పట్ల ఇలా అసభ్యంగా ప్రవర్తించే హక్కు పోలీసులకు ఉందా అని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రశ్నించారు.
ఢిల్లీ పోలీసులు వెంటనే ఈ పోలీసును సస్పెండ్ చేయాలి
ఈ క్లిప్ ను అతిషి ఖాతా నుంచి సిఎం కేజ్రీవాల్ రీట్వీట్ చేశారు. ఈ వీడియోను షేర్ చేసిన అతిషి, "రౌస్ అవెన్యూ కోర్టులో మనీష్ జీతో పోలీసు అసభ్యంగా ప్రవర్తించాడు. ఢిల్లీ పోలీసులు ఆయనను వెంటనే సస్పెండ్ చేయాలి. అని రిక్వస్ట్ చేశారు.
ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో ఢిల్లీ మాజీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా జ్యుడీషియల్ కస్టడీని ఢిల్లీ కోర్టు జూన్ 1 వరకు పొడిగించింది. తన సెల్‌లో కుర్చీలు, టేబుళ్లు ఏర్పాటు చేయాలన్న ఆయన అభ్యర్థనను పరిగణనలోకి తీసుకోవాలని జైలు అధికారులను ఆదేశించింది కోర్టు.