Delhi Airport: 



ట్యాక్సీవేస్ ప్రారంభం..


ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో అదనపు హంగులను జోడించారు. పౌరవిమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా చేతుల మీదుగా ఎలివేటెడ్ ఈస్టర్న్ క్రాస్ ట్యాక్సీవేస్‌ ప్రారంభమయ్యాయి. ఇదే సమయంలో నాలుగో రన్‌వేని కూడా ఇనాగరేట్ చేశారు. దేశంలోనే అతి పెద్ద విమానాశ్రయం...ఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ (IGIA).రోజూ కనీసం 1500 విమానాలు ఇక్కడి నుంచి సర్వీస్‌లు అందిస్తూ ఉంటాయి. విమానం ల్యాండ్ అయిన తరవాత ప్రయాణికులు అక్కడి నుంచి నడుచుకుంటూ వచ్చేందుకు సమయం పడుతోంది. టేకాఫ్ అయ్యే ముందు కూడా ప్యాసింజర్స్ విమానం వరకూ వెళ్లడం వల్ల ఎక్కువ సమయం వృథా అవుతోంది. ఇలా టైమ్ వేస్ట్ అవకుండా...ఎయిర్‌పోర్ట్‌లని టర్మినల్స్‌ని, రన్‌వేలతో కనెక్ట్ చేయాలని భావించారు. అందులో భాగంగానే ఈ Eastern Cross Taxiways (ECT) నిర్మించారు. ఇప్పుడు నిర్మించిన ట్యాక్సీ వే పొడవు 2.1 కిలోమీటర్లు. దేశంలో తొలిసారి ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లోనే ఈ తరహా ట్యాక్సీవే అందుబాటులోకి వచ్చింది. ఈ వే కింద రోడ్‌ ఉంటుంది. ఇది ఎయిర్‌పోర్ట్‌లోని నార్త్, సౌత్ ఎయిర్‌ఫీల్డ్స్‌ని అనుసంధానిస్తుంది. మరో ప్రత్యేకత ఏంటంటే...టర్మినల్ 1 నుంచి మూడో రన్‌వేకి ఉన్న దూరం దాదాపు 7 కిలోమీటర్ల మేర తగ్గిపోతుంది. అంతే కాదు. ఈ ట్యాక్సీ వేపై నుంచి విమానాలు తిరగొచ్చు. ప్రయాణికుల సమయాన్ని ఆదా చేయాలనే ఉద్దేశంతోనే ఈ నిర్మాణం చేపట్టినట్టు అధికారులు వెల్లడించారు.