దేశంలో కొత్తగా 2,593 మంది కరోనా బారిన పడ్డారు. దాంతో భారత్‌లో యాక్టివ్ కేసుల సంఖ్య (Active Corona Cases In India) 15 వేలు దాటింది. ప్రస్తుతం 15,873 మంది కరోనా బాధితులు ఉన్నారు. అదే సమయంలో 1,755 మంది కరోనా మహమ్మారిని జయించడంతో కొవిడ్19 విజేతల సంఖ్య 4 కోట్ల 25 లక్షల 19 వేల 4 వందల 79 (4,25,19,479)కు చేరినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తాజా హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది. 


తాజాగా 44 కరోనా మరణాలు.. 
గడిచిన 24 గంటల్లో కరోనాతో 44 మంది మృతి చెందారు. దేశంలో మొత్తం కొవిడ్19 మరణాల సంఖ్య 5,22,193 (5 లక్షల 22 వేల 193)కు పెరిగింది. యాక్టివ్ కేసులు 0.04 శాతం ఉండగా, కొవిడ్ మరణాల రేటు 1.21 శాతానికి చేరుకుందని వైద్య శాఖ అధికారులు తెలిపారు. దేశంలో కరోనా కేసులు ప్రతిరోజూ పెరగడం ఫోర్త్ వేవ్ హెచ్చరికల్ని సూచిస్తుంది. పలు రాష్ట్రాలు తాజా కరోనా కేసులతో అప్రమత్తమై కొవిడ్19 ఆంక్షలు కఠినతరం చేశారు. తెలంగాణలో అయితే మాస్క్ ధరించకపోతే రూ.1000 జరిమానా ఇంకా తొలగించలేదని, హెల్త్ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాస్ స్పష్టం చేశారు.






దేశంలో కొవిడ్ టీకాలు..
దేశంలో నిన్న ఒక్కరోజులో 19 లక్షల 5 వేల 374 మంది కరోనా టీకాలు తీసుకున్నారు. ఇప్పటివరకూ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో కలిపి 187 కోట్ల 67 లక్షల 20 వేల 3 వందల 18 డోసుల టీకాలు ఇచ్చారు. 12 నుంచి 14 ఏళ్ల వయసు చిన్నారులలో 2.65 కోట్ల డోసుల తొలి టీకా పూర్తయినట్లు కేంద్ర వైద్యశాఖ తెలిపింది. చిన్నారులను సైతం కరోనా నుంచి రక్షించుకునేందకు 5-12 లోపు పిల్లలకు వ్యాక్సిన్ అందించేందుకు కేంద్రం అనుమతి ఇచ్చింది. త్వరలోనే చిన్నారులకు వ్యాక్సిన్‌పై ప్రకటన వెలువడనుంది. 







Also Read: Snack For Heart: ఈ స్నాక్స్‌తో గుండె జబ్బులు పరార్, వీటిని రోజూ తింటే మరింత ఆయుష్షు


Also Read: రోజూ ఉదయానే ఇలా చేయండి, ఎంతటి మధుమేహం అయినా నియంత్రణలోకి వచ్చేస్తుంది