Corona Cases: దేశంలో కొత్తగా 10 వేల లోపే పాజిటివ్ కేసులు, కరోనాతో మరో 119 మంది మృతి
Covid Cases India Updates : కరోనా థర్డ్ వేవ్ భారత్‌లో తగ్గుతోంది. గడిచిన 24 గంటల్లో దేశంలో 10 వేల లోపే కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

Corona Cases In India: దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి క్రమంగా తగ్గుతోంది. తాజాగా పది వేల లోపే పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో కరోనా పాజిటివ్ కేసులు భారత్‌లో 8,013 (8 వేల 13) మందికి కొవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. డైలీ పాజిటివిటీ రేటు 1.11 శాతానికి దిగొచ్చింది. కొవిడ్ 19 రికవరీ రేటు ఏకంగా 98 కంటే ఎక్కువ అయింది. దేశంలో ప్రస్తుతం 1,02,601 (1 లక్షా 2 వేల 6 వందల 1) మంది కరోనాకు చికిత్స (Active Corona Cases In India) తీసుకుంటున్నారు.
తాజాగా 119 మంది మృతి
ఆదివారం ఒక్కరోజులో 16,765 (16 వేల 765) మంది కరోనా మహమ్మారిని జయించారు. వారితో కలిపితే భారత్‌లో కరోనా బారి నుంచి కోలుకున్న వారి సంఖ్య 4,23,07,686 (4 కోట్ల 23 లక్షల 7 వేల 686)కు చేరింది. కొవిడ్ తో పోరాడుతూ తాజాగా 119 మంది మరణించారని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ సోమవారం ఉదయం హెల్త్ బులెటిన్‌లో తెలిపింది. కిందటి రోజుతో పోల్చితే కరోనా పాజిటివ్ కేసులతో పాటు మరణాలు భారీగా తగ్గాయి. దేశంలో కరోనా మరణాల సంఖ్య 5,13,843 (5 లక్షల 13 వేల 843)కు చేరినట్లు అధికారులు వెల్లడించారు.
మహారాష్ట్రలో 782 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారించగా.. మొత్తం కేసుల సంఖ్య 78,65,298కి చేరుకున్నాయి. ఇదే రాష్ట్రంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 4,629కు చేరగా దాపు 90 శాతం మంది డిశ్చార్జ్ అయ్యారు. కేరళలో 2,524 కేసులు నమోదయ్యాయి, దీంతో కేరళలో మొత్తం కేసుల సంఖ్య 64,97,204కి చేరుకుంది. రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 65,223కు పెరిగింది.
177.50 కోట్ల డోసుల వ్యాక్సిన్..
గత ఏడాది జనవరి (2021)లో కరోనా వ్యాక్సిన్ ప్రారంభించినప్పటి నుంచి సోమవారం ఉదయం వరకు దేశంలో 177 కోట్ల 50 లక్షల డోసుల కొవిడ్ టీకాలు పంపిణీ చేశారు. నిన్న ఒక్కరోజు 7,23,828 శాంపిల్స్ కు కరోనా టెస్టులు నిర్వహించగా పదివేల లోపే పాజిటివ్ కేసులు వచ్చాయి. ఇప్పటివరకూ 76,74,81,346 (76 కోట్ల 74 లక్షల 81 వేల 346) శాంపిల్స్ పరీక్షించినట్లు తెలిపారు. ప్రస్తుతం యాక్టివ్ కేసులు కేవలం 0.24 శాతం ఉన్నాయి.
Also Read: Yadlapati Venkatarao: టీడీపీ నేత, మాజీ మంత్రి యడ్లపాటి వెంకట రావు కన్నుమూత, 102 ఏళ్ల వయసులో
Also Read: Ukraines Lifestyle: ఉక్రెయిన్లో ఒక నెల ఖర్చు ఎంత తక్కువో తెలుసా? మనం హ్యాపీగా బతికేయచ్చు