Corona Cases: భారత్‌లో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గడంతో పాజిటివ్ కేసులు నిలకడగా ఉన్నాయి. కొన్ని రోజుల కిందటి వరకు పది వేల కరోనా కేసులు నమోదయ్యేవి. తాజాగా గడిచిన 24 గంటల్లో భారత్‌లో 5,921 (5 వేల 9 వందల 21) మందికి కొవిడ్ పాజిటివ్ (Corona Cases In India)గా నిర్ధారణ అయింది. రోజువారీ పాజిటివిటీ రేటు 1 శాతాని కంటే తక్కువకు దిగొచ్చింది. రోజువారీ పాజిటివిటీ రేటు 0.63 శాతం ఉండగా.. యాక్టివ్ కేసులు 0.15 శాతం ఉన్నాయని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజా బులెటిన్‌తో తెలిపింది.
భారీగా పెరిగిన రికవరీ రేటు
దేశంలో యాక్టివ్ కేసులు 70 వేల దిగువకు వచ్చాయి. భారత్‌లో ప్రస్తుతం 63,878 (63 వేల 8 వందల 78) మంది కరోనాకు చికిత్స (Active Corona Cases In India) తీసుకుంటున్నారు. నిన్న ఒక్కరోజులో మరో 289 మందిని కరోనా మహమ్మారి బలిగొంది. తాజా మరణాలతో కలిపితే దేశంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 5,14,878 (5 లక్షల 14 వేల 878) కు చేరుకుందని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ తెలిపింది. నిన్న ఒక్కరోజులో 11,651 (11 వేల 6 వందల 51) మంది కరోనా బారి నుంచి కోలుకున్నారు. కొవిడ్ రికవరీ రేటు 98 శాతానికి పైగా ఉన్నట్లు సమాచారం.
178 కోట్ల డోసుల వ్యాక్సిన్..
గత ఏడాది జనవరి (2021)లో కరోనా వ్యాక్సిన్ ప్రారంభించినప్పటి నుంచి శనివారం ఉదయం వరకు దేశంలో 178 కోట్ల 55 లక్షల 66 వేల 940 డోసుల కొవిడ్ టీకాలు పంపిణీ చేశారు. ప్రపంచ వ్యాప్తంగా కరోనా బాధితులు 443.4 మిలియన్లకు చేరారు. కరోనా మరణాలు 5.98 మిలియన్లు నమోదయ్యాయి. కరోనా వ్యాక్సినేషన్ 10.56 బిలియన్ల డోసులు పూర్తయినట్లు ప్రముఖ జాన్ హాప్‌కిన్స్ యూనివర్సిటీ తెలిపింది.
ఏపీలో కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. రాష్ట్రంలో గడిచిన 24 గంటల వ్యవధిలో 14,788 కోవిడ్ నిర్థారణ పరీక్షలు చేయగా 86 మందికి కోవిడ్ పాజిటివ్(Covid Positive) నిర్ధారణ అయింది. రాష్ట్రంలో కోవిడ్ బారినపడి చనిపోయిన వారి సంఖ్య 14,729కి చేరింది. ఒక్కరోజు వ్యవధిలో రాష్ట్రంలో 288 మంది కోలుకున్నారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు 2,302,192 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. ఏపీ(AP)లో 1341 యాక్టివ్ కేసులున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.
Also Read: Screen Time: ఏ వయసు పిల్లలు ఎంతసేపు స్క్రీన్ చూడొచ్చు? అతిగా స్క్రీన్ చూడడం వల్ల వచ్చే ప్రమాదమేంటి?
Also read: పిల్లల ఎత్తు పెరగడం ఏ వయసులో ఆగిపోతుందో తెలుసా? వారి ఎత్తు పెంచేందుకు కొన్ని చిట్కాలు ఇవిగో...