కరోనా వచ్చాక పిల్లలు దాదాపు రెండేళ్ల పాటూ స్కూలుకి దూరమయ్యారు. ఆన్ లైన్ క్లాసుల పేరుతో ఫోన్లకు, కంప్యూటర్లకు బాగా అలవాటయ్యారు. ఇంట్లో ఉండి అల్లరి చేస్తున్నారన్న కారణంగా ఫోనిచ్చే తల్లిదండ్రులు చాలా మంది ఉన్నారు. దీంతో పిల్లల స్క్రీన్ టైమ్ పెరిగిపోయింది. అతిగా స్క్రీన్ చూడడం వల్ల ‘కంప్యూటర్ విజన్ సిండ్రోమ్’ వచ్చే అవకాశం ఉంది. ఈ సిండ్రోమ్ వచ్చిందంటే మొదట తలనొప్పి, కళ్ల నొప్పి, మెడ నొప్పి, కళ్లు మసకబారడం వంటివి కలుగుతాయి. పిల్లలు త్వరగా అలసిపోతారు. ఎప్పుడూ నిద్ర వస్తోందంటూ చెబుతారు. అలా అంటున్నారంటే వారి స్క్రీన్ టైమ్ బాగా ప్రభావం చూపినట్టే. ఇలాగే వదిలేస్తే వస్తువులు సరిగా కనిపించకపోవడం, స్పష్టత లేకపోవడం, అక్షరాలు మసకగా కనిపించడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. పరిస్థితి ఇంతదాకా రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉంది. 


ఎలక్ట్రానిక్ డివైజ్‌ల నుంచి వచ్చే కాంతి నేరుగా కంటిలోని రెటీనా కణాలపై ప్రభావం చూపిస్తాయి.దీంతో కొన్నాళ్లు రంగులను గుర్తించే శక్తి కూడా తగ్గిపోతుంది. అందుకే స్క్రీన్ టైమ్ ను తగ్గించాల్సిన అవసరం ఉంది. అలాగే చీకటిలో ఫోన్ చూడనివ్వకూడదు. వెలుగు పడే చోట ఫోన్ చూడడం వల్ల కళ్ల మీద ఫోన్ కాంతి నేరుగా పడే అవకాశం తగ్గుతుంది. 


వయసును బట్టి స్క్రీన్ టైమ్...
1. రెండేళ్లలోపు పిల్లలకు పూర్తిగా ఫోన్ ను ఇవ్వకూడదు. 
2. రెండేళ్ల నుంచి అయిదేళ్లలోపు పిల్లలకు రోజుకు ఒక గంట పాటూ ఇవ్వచ్చు. 
3. అయిదేళ్లు దాటిన పిల్లలకు రోజులో ఉదయం ఓ గంట, సాయంత్రం ఓ గంట ఇవ్వచ్చు. 
4. 12 ఏళ్లు దాటిన పిల్లలకు ఆన్ లైన్ క్లాసుల నిమిత్తం మూడు గంటల  పాటూ ఫోన్ చూడనివ్వచ్చు.



గమనిక:ఈ కథనంలో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు. ఏదైనా వ్యాయామం లేదా డైట్‌లో మార్పులు చేయాలనుకుంటే తప్పకుండా మీరు వైద్యుడు, డైటీషియన్‌ను సంప్రదించాలి.


Also read: త్రిబుల్ ధమాకా, ఒకే అబ్బాయిని ప్రేమించిన ముగ్గురు అక్కాచెల్లెళ్లు, ముగ్గురినీ పెళ్లాడిన ప్రియుడు


Also read: పిల్లల ఎత్తు పెరగడం ఏ వయసులో ఆగిపోతుందో తెలుసా? వారి ఎత్తు పెంచేందుకు కొన్ని చిట్కాలు ఇవిగో...