Covid Cases In India: భారత్‌లో కరోనా వైరస్ వ్యాప్తి వరుసగా మూడో రోజు తగ్గింది.  నిన్నటితో పోల్చితే దేశంలో  50 వేల పాజిటివ్ కేసులు తక్కువ నమోదయ్యాయి. వరుసగా ఐదోరోజులు 3 లక్షలు దాటిన కరోనా కేసులు నేడు భారీగా తగ్గాయి.  తాజాగా గడిచిన 24 గంటల్లో 2,55,874 (2 లక్షల 55 వేల 874)  మంది కరోనా బారిన పడ్డారు. అదే సమయంలో మరో 614 మంది కరోనా మహమ్మారితో పోరాడుతూ చనిపోయారు. నిన్నటితో పోల్చితే కరోనా మరణాలు 170 వరకు పెరిగాయి.


నిన్న ఒక్కరోజులో 2,67,753 (2 లక్షల 67 వేల 753) మంది కరోనాను జయించారు. దీంతో దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 22,36,842కు చేరుకుంది. భారత్‌లో కరోనా యాక్టివ్ కేసులు చాలా రోజుల తరువాత క్రితం రోజుతో పోల్చితే తగ్గాయి. రోజువారీ పాజిటివిటీ రేటు 15.52 శాతానికి తగ్గినట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ తాజా బులెటిన్‌లో వెల్లడించింది.  







ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటివరకూ 35.43 కోట్ల మందికి కరోనా సోకింది. 56 లక్షల మందిని కొవిడh మహమ్మారి బలిగొంది. వైరస్ వ్యాప్తిని నిర్మూలించేందుకు 981 కోట్ల డోసుల వ్యాక్సిన్లను ప్రజలు తీసుకున్నారని ప్రముఖ జాన్ హాప్‌కిన్స్ యూనివర్సిటీ తాజాగా తెలిపింది.







దేశంలో నిన్న ఒక్కరోజులో 16 లక్షల 49 వేల 108 మందిని పరీక్షించగా 2.5 లక్షల మందిలో కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకూ 71 కోట్ల 88 లక్షల 2 వేల 433మందికి కొవిడ్ టెస్టులు చేసినట్లు కేంద్రం వైద్యశాఖ తెలిపింది. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు మొత్తం 162.97 కోట్ల డోసుల వ్యాక్సిన్ మోతాదులు పంపిణీ చేశారు. అందులో 13.42 కోట్ల కరోనా టీకా డోసులు నిల్వ ఉన్నాయి.


Also Read: Karimnagar: రోడ్డు ప్రమాదంతో ఓ సీనియర్ నేత కుమారుడి జీవితం అంధకారం.. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఆదుకోవాలని విజ్ఞప్తి


 Also Read: Hyderabad Crime: వ్యాయామం చేస్తుండగా మందలించిన తల్లి... కోపంతో తల్లిని హత్య చేసిన కొడుకు... అడ్డొచ్చిన చెల్లిపై దాడి


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి