New Parliament Building: 



కొత్త పార్లమెంట్ భవనంపై విమర్శలు..


కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ కొత్త పార్లమెంట్ బిల్డింగ్‌పై విమర్శలు చేశారు. ఈ బిల్డింగ్‌ని పార్లమెంట్ భవనం అనే కన్నా "మోదీ మల్టీప్లెక్స్" అంటే మంచిదంటూ మండి పడ్డారు. అక్కడ అంతా ఆయన చెప్పినట్టే నడుస్తోందని అసహనం వ్యక్తం చేశారు. పాత పార్లమెంట్ భవనాన్ని బాగా మిస్ అవుతున్నానని, కొత్త భవనం చాలా ఇరుగ్గా ఉందని అన్నారు. మోదీ ప్రభుత్వం కావాలనే హైప్ చేసి కొత్త పార్లమెంట్‌ని నిర్మించారని, ఈ ఆర్కిటెక్చర్‌తో ప్రజాస్వామ్యాన్ని చంపేశారని ఫైర్ అయ్యారు. ట్విటర్‌లో సుదీర్ఘ పోస్ట్‌ పెట్టి మోదీ సర్కార్‌పై ఇలా ఆగ్రహం వ్యక్తం చేశారు. 


"కొత్త పార్లమెంట్ ప్రారంభోత్సవానికి మోదీ సర్కార్ చాలా హడావుడి చేసింది. అనవసరంగా హైప్ చేసింది. అది కేవలం ప్రధాని మోదీ ఆలోచనలకు అనుగుణంగా కట్టుకున్న భవనం మాత్రమే. అందుకే దాన్ని పార్లమెంట్ అనడం కన్నా మోదీ మల్టీప్లెక్స్ అంటే మంచిది. నాలుగు రోజుల పాటు ఆ పార్లమెంట్‌కి వెళ్తే కానీ అర్థం కాలేదు ఎంత ఇరుగ్గా ఉందో. రెండు సభల్లోని లాబీల్లో అనవసరమైన చర్చలు జరుగుతున్నాయి. అబద్ధాలు ప్రచారమవుతున్నాయి. ఆర్కిటెక్చర్ ప్రజాస్వామ్యాన్ని చంపేస్తుందనడానికి ఇదే నిదర్శనం. ఈ విషయంలో ప్రధాని మోదీ సక్సెస్ అయ్యారు"


- జైరాం రమేశ్, కాంగ్రెస్ సీనియర్ నేత 






ట్విటర్‌లో పోస్ట్..


పాత పార్లమెంట్ భవనంతో పోల్చుకుంటే...కొత్త భవనంలో హాల్స్ సౌకర్యంగా లేవని, ఒకరినొకరు చూడాలంటే బైనాక్యులర్స్ వాడాలేమో అంటూ సెటైర్లు వేశారు జైరాం రమేశ్. సభల మధ్య నడిచేందుకు పాత భవనంలో చాలా సులువుగా ఉండేదని, ఇక్కడ మాత్రం అంతా ఇరుగ్గా ఉందని అన్నారు. 


"కొత్త పార్లమెంట్ హాల్స్‌లో ఒకరినొకరు చూసుకోవాలంటే బైనాక్యులర్స్ వాడాలేమో. ఏ మాత్రం సౌకర్యంగా లేవు. పాత పార్లమెంట్ బిల్డింగ్ ఎన్నో చరిత్రాత్మకైన చర్చలకు వేదికగా నిలిచింది. అందులో రెండు సభల మధ్య నడవడానికి ఎంతో అనువుగా ఉండేది. కొత్త బిల్డింగ్‌లో పొరపాటున దారి తప్పితే వెనక్కి వచ్చేందుకు కూడా లేదు. అంతా కన్‌ఫ్యూజన్‌గా ఉంది.2024లో మోదీ ప్రభుత్వం మారాక కానీ ఈ కొత్త భవనాన్ని సరైన విధంగా వినియోగించుకునే అవకాశముండదు. అసలు ఈ బిల్డింగ్ నిర్మించేటప్పుడు సరైన విధంగా సలహాలు తీసుకోలేదని మాకు సమాచారం అందింది. అందుకే ఇలా తయారైంది. మా వాళ్లందరి అభిప్రాయం ఇదే. "


- జైరాం రమేశ్, కాంగ్రెస్ సీనియర్ నేత 


Also Read: జమిలి ఎన్నికలపై కోవింద్ కమిటీ తొలి భేటీ, పెరుగుతున్న ఉత్కంఠ