Loksabha Elections 2024:
స్టార్ క్యాంపెయినర్‌గా..
కాంగ్రెస్ సీనియర్ నేత,స్టార్ క్యాంపెయినర్ ప్రియాంక గాంధీ 2024 ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండనున్నారు. విశ్వసనీయ వర్గాలు ఇదే విషయం చెబుతున్నాయి. సీనియర్ నేతలంతా సమావేశమయ్యాక...హైకమాండ్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. సోనియా గాంధీ ఈ నిర్ణయాన్ని ప్రకటించినట్టు తెలుస్తోంది. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడానికి బదులుగా...ఆమె విస్తృతంగా ప్రచారం చేసేందుకు ప్లాన్ రెడీ చేస్తున్నారట. దేశవ్యాప్తంగా స్టార్ క్యాంపెయినర్‌గా ఆమె ప్రచారం చేస్తారట. కేవలం యూపీలో ప్రచారానికి పరిమితం కాకుండా..రాజ్యసభలోనూ ఆమె ఎంట్రీ ఇస్తారని తెలుస్తోంది. హిమాచల్ ప్రదేశ్ నుంచి రాజ్యసభ ఎంపీగా ఆమెకు హైకమాండ్ అవకాశం కట్టబెడతారని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. ఛత్తీస్‌గఢ్‌లోని ఓ రాజ్యసభ ఎంపీ రాజీనామా చేయడం వల్ల ఆ సీటుని భర్తీ చేసేందుకు ప్రియాంక గాంధీకి అవకాశమివ్వనుంది అధిష్ఠానం.
రాజ్యసభ ఎంపీగా..?
ABP Newsతో మాట్లాడిన ఓ కాంగ్రెస్ ఎంపీ ఈ విషయాన్ని కన్‌ఫమ్ చేశారు. నిజానికి ఈ నిర్ణయం ఎప్పుడో ప్రకటించాల్సి ఉంది. కాకపోతే...సోనియా గాంధీ సందిగ్ధంలో పడినట్టు తెలుస్తోంది. ఇటీవలే పార్టీలోని కీలక నేతలందరితోనూ సోనియా సమావేశం నిర్వహించారు. అప్పుడే ప్రియాంక గాంధీ "ఫ్యూచర్ ప్లాన్‌ని" వివరించారట. ఆమె ప్రచారం చేస్తే కాంగ్రెస్‌కు చాలా ప్లస్ అవుతుందని సీనియర్ నేతలంతా ఏకగ్రీవంగా చెప్పారట. అందుకే...2024 ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండనున్నారని సమాచారం. ఎన్నికల్లో పోటీ చేస్తే..ప్రచారంపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టడం సాధ్యం కాదని భావిస్తోంది హైకమాండ్. అయితే..కొందరు నేతలు మాత్రం "ప్రియాంక గాంధీ పోటీ చేస్తే బాగుంటుంది" అన్న అభిప్రాయం వ్యక్తం చేసినట్టు సమాచారం. యూపీ ఇన్‌ఛార్జ్ బాధ్యతల నుంచీ ఆమె తప్పుకుంటారని మరో సమాచారం. కాంగ్రెస్‌కి గెలిచే అవకాశం ఉన్న రాష్ట్రాల్లో ఆమె భారీ ఎత్తున ప్రచారం చేయనున్నారు. అమెథీ నియోజకవర్గంపై ఏ మాత్రం ఇంట్రెస్ట్ చూపించడం లేదు కాంగ్రెస్. అంతే కాదు. అసలు అక్కడ ఏ అభ్యర్థినీ నిలబెట్టకూడదని నిర్ణయం తీసుకున్నట్టు కూడా తెలుస్తోంది. ప్రధాని అభ్యర్థిని ప్రకటించకుండా వ్యూహాత్మకంగా వ్యవహరించాలని కాంగ్రెస్ భావిస్తోంది. అలా అయితే...మిత్రపక్షాలకూ ఎలాంటి ఇబ్బంది ఉండదని కొందరు సలహా ఇచ్చారట.
స్టైల్ మార్చిన ప్రియాంక..
చాలా రోజులుగా ప్రియాంక గాంధీ తన క్యాంపెయినింగ్ స్టైల్ మార్చేశారు. గతంలో కన్నా చాలా వాడిగా విమర్శలు చేస్తున్నారు. మోదీ సర్కార్‌పై మండి పడుతున్నారు. గతేడాది జరిగిన గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల్లో హిమాచల్‌లో కాంగ్రెస్ విజయం సాధించింది. ఈ విజయం వెనక ఉన్నది ప్రియాంక గాంధీయే అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కీలక నేతలందరితోనూ కలిసి విస్తృతంగా ప్రచారం చేశారు. ప్రజల్ని ఆకట్టుకున్నారు. బీజేపీ నేతలు పదేపదే "పరివార రాజకీయాలు" అని విమర్శిస్తున్నా...అందుకు తగ్గ కౌంటర్ ఇస్తూ వస్తున్నారు ప్రియాంక గాంధీ. ముఖ్యంగా ప్రధాని మోదీని టార్గెట్ చేసుకుని గట్టిగానే బదులు చెబుతున్నారు. ఆమెకు తోడు రాహుల్ గాంధీ కూడా స్వరం మార్చారు. "తగ్గేదే లేదు" అనే స్థాయిలో మోదీ సర్కార్‌పై విరుచుకు పడుతున్నారు.