Delhi Airport: 



విస్టారా ఫ్లైట్‌లో ఘటన..


ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. విస్టారా ఫ్లైట్‌ (Vistara Flight) ఎక్కిన ఓ ప్రయాణికుడు ఫోన్‌లో "బాంబ్" గురించి మాట్లాడటం పక్కనే కూర్చున్న మహిళా ప్యాసింజర్ విన్నారు. వెంటనే సిబ్బందికి సమాచారం అందించాడు. జూన్ 7వ తేదీన ఈ ఘటన జరిగినట్టు పోలీసులు వెల్లడించారు. యూపీలోని ఫిలిబిట్‌కు చెందిన అజీమ్ ఖాన్ అనే ప్రయాణికుడు ఈ పని చేసినట్టు చెప్పారు. దుబాయ్‌కి వెళ్లేందుకు కనెక్టింగ్ ఫ్లైట్ కోసం ఢిల్లీ నుంచి ముంబయికి వెళ్తుండగా ఫోన్‌లో అవతలి వ్యక్తితో బాంబ్ గురించి ప్రస్తావిస్తూ చాలా సేపు మాట్లాడాడు. పక్కనే ఉన్న మహిళా ప్రయాణికురాలు భయపడిపోయి ఫ్లైట్ సిబ్బందికి సమాచారం ఇవ్వడం వల్ల అంతా అప్రమత్తమయ్యారు. వెంటనే పోలీసులకూ సమాచారం అందించారు. ఆ మహిళ ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసుకుని ఆ వ్యక్తిని  అదుపులోకి తీసుకున్న సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) సిబ్బంది..ఆ తరవాత పోలీసులకు అప్పగించింది. ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది.