గతంలో 14-15 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకుని 17 ఏళ్ల వయసులో తల్లి కావడం సాధారణంగా జరిగేదని గుజరాత్‌ హైకోర్టు అభిప్రాయపడింది. తన ఏడు నెలల పిండాన్ని తొలగించాలని కోరుతూ 17 ఏళ్ల బాలిక దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా గుజరాత్ హైకోర్టు ఇలా స్పందించింది. అత్యాచార బాధితురాలు దాఖలు చేసిన పిటిషన్‌పై గుజరాత్ హైకోర్టు విచారణ జరిపింది.


"మనం 21వ శతాబ్దంలో జీవిస్తున్నాం కాబట్టి, మన అమ్మ లేదా ముత్తాతను అడగండి, వివాహం చేసుకోవడానికి గరిష్ట వయస్సు 14-15 సంవత్సరాలు. 17 ఏళ్లు నిండకముందే పాప పుట్టింది. అబ్బాయిల కంటే అమ్మాయిలు ముందుగానే పరిపక్వత చెందుతారు. దాని కోసం ఒకసారి మనుస్మృతి చదవండి. అని కోర్టు చెప్పింది. 


ఈ కేసులో బాలిక వయసును పరిగణనలోకి తీసుకుని అబార్షన్ చేసేందుకు ఓకే చెప్పాలని బాధితురాలి తండ్రి తరపు న్యాయవాది తెలిపారు. అయితే, పిండం 7 నెలల కంటే ఎక్కువ వయస్సు ఉన్నందున అబార్షన్ చేయవచ్చా లేదా అనే అనే విషయంపై వైద్యులను సంప్రదించాలని హైకోర్టు తెలిపింది.


మైనర్, పిండం ఇద్దరి ప్రాణాలకు ముప్పు ఉంటే గర్భస్రావాన్ని అనుమతించలేమని కోర్టు స్పష్టం చేసింది. మైనర్ బాలికకు వైద్య పరీక్షలు నిర్వహించాలని కోర్టు ఆదేశించింది. వైద్యుల నివేదిక తర్వాతే గుజరాత్ హైకోర్టు దీనిపై నిర్ణయం తీసుకోనుంది. తదుపరి విచారణను జూన్ 15కు వాయిదా వేసింది.


ముస్లిం చట్టాల ప్రకారం వివాహ వయసు 13 ఏళ్లు అని బాధితురాలి తరఫు న్యాయవాది బదులిచ్చారు. మైనర్ అత్యాచార బాధితురాలి తండ్రికి 7 నెలల తర్వాత ఆమె గర్భం దాల్చిన విషయం తెలిసింది. దీంతో బాలికకు అబార్షన్ చేయించాలని గుజరాత్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు.


భారతదేశంలో కొన్ని సందర్భాల్లో 20 వారాల తర్వాత మాత్రమే గర్భస్రావానికి  అనుమతించారు. కానీ 2021లో చట్టంలో సవరణ తరువాత ఈ కాల పరిమితిని 24 వారాలకు పెంచారు. అయితే కొన్ని సందర్భాల్లో 24 వారాల తర్వాత కూడా అబార్షన్ చేయించుకునేందుకు కోర్టు అనుమతి తీసుకోవచ్చు.


అలహాబాద్‌ కోర్టులో కుజదోష వివాదం


మాంగళిక(కుజదోషం) ఉందో లేదో నిర్ధారించేందుకు అత్యాచార బాధితురాలి జాతకాన్ని కోరుతూ అలహాబాద్ హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ ఆర్డర్స్ పై సుప్రీం కోర్టు స్టే విధించింది. ఈ కేసును సుమోటోగా స్వీకరించిన దేశ అత్యున్నత న్యాయస్థానం.. ప్రత్యేక సమయంలో ఈ అంశాన్ని విచారించింది. అత్యాచార బాధితురాలి జాతకాన్ని పరిశీలించి తనకు కుజదోషం ఉందో లేదో చెప్పాలని లక్నో యూనివర్సిటీలోని జ్యోతిషశాస్త్ర విభాగం అధిపతిని అలహాబాగ్ హైకోర్టు మే 23న ఆదేశించింది. ఆ ఉత్తర్వులను సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా.. జస్టిస్ సుధాన్షు ధులియా, జస్టిస్ పంకజ్ మిథాల్ లతో కూడిన సుప్రీం కోర్టు వెకేషన్ బెంచ్ ముందు సమర్పించారు. జస్టిస్ బ్రిజ్ రాజ్ సింగ్ తో కూడిన అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు ఆందోళనకరంగా ఉన్నాయంటూ వాదించారు. 


అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు అసంబద్ధంగా ఉన్నాయని, బాధితురాలి గోప్యతకు భంగం కలిగించే విధంగా ఉన్నాయని సుప్రీం కోర్టు బెంచ్ పేర్కొంది. ఈ అంశంలో జ్యోతిష శాస్త్రం వాస్తవాన్ని చెప్పగలదా? లేదా? అనే విషయంలోకి తాము వెళ్లదలచుకోలేదని, కేవలం ఈ అంశంతో ముడిపడి ఉన్న విషయాలపైనే తాము దృష్టి సారిస్తామని విచారణ సందర్భంగా న్యాయమూర్తి జస్టిస్ ధూలియా వ్యాఖ్యానించారు. జ్యోతిష్య శాస్త్రంపై పార్టీకి ఉన్న మనోభావాలను పూర్తిగా గౌరవిస్తామని పేర్కొన్నారు. బెయిల్ పిటిషన్ పై నిర్ణయం తీసుకునేటప్పుడు వ్యక్తిగత జ్యోతిష్య విషయాలను పరిగణనలోకి తీసుకోవడానికి వీల్లేదని సుప్రీంకోర్టు పేర్కొంది. ఈ కేసులో జ్యోతిష్య శాస్త్రాన్ని ఎందుకు పరిగణించాలో అర్థం కావడం లేదని వ్యాఖ్యానించింది. కుజదోషం ఉందో లేదో నిర్ధారించాలన్న అలహాబాద్ హైకోర్టు ఉత్తర్వులపై స్టే విధిస్తూనే.. మెరిట్ ల ఆధారంగా బెయిల్ దరఖాస్తును హైకోర్టు పరిశీలించవచ్చని దేశ అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. 


అసలేంటీ కేసు..?