Shivaji Jayanti 2025: పదహారేళ్లకే క్రికెట్లోకి సచిన్ అడుగుపెడితే వాహ్ అన్నారు క్రికెట్ పండితులు. అతి పిన్న వయస్కుడిగా అతడు అరంగ్రేటం చేసి ఆ తర్వాత సాధించిన విజయాలతో సచిన్ ను క్రికెట్ గాడ్ గా  ప్రస్తుతించింది ప్రపంచం. కాని సచిన్ పుట్టిన అదే మరాఠా గడ్డపై 16 ఏళ్లకే కత్తి పట్టి  ఓ పెద్ద సామ్రాజ్యాన్ని స్థాపించిన మహా వీరుడు మరోకరు ఉన్నారని మీకు తెలుసా. ఆయన ఎవరో కాదు. ఛత్రపతి శివాజీ మహరాజ్   శివాజీ మహరాజ్  జయంతి సందర్భంగా  ఆయన వీర గాధ తెలుసుకుందాం.


 జననం , బాల్యం....


ఛత్రపతి శివాజీ మహరాజ్  1630వ సవంత్సరం, ఫిబ్రవరి 19వ తేదీన శివనేరి కోటలో జన్మించారు.  ఆయన తండ్రి  షాహజీ భోంస్లే,  తల్లి జీజీ బాయి.  ఛత్రపతి శివాజీ మహరాజ్ అసలు పేరు శివాజీ రాజే భోంస్లే.  తండ్రి షాహజీ బోంస్లే బీజాపూర్ ఆస్థానంలో  ఉన్నత అధికారిగా పని చేసేవారు.  ఆ రాజకీయ వాతావరణం శివాజీ కుటుంబంలో ఉండేది. తల్లి జీజీబాయి  దేశం పట్ల బాల్యం నుంచే భక్తిని  ఉగ్గుపాలతో శివాజీకి నూరి పోసింది.  అంతే కాకుండా పరిపాలన  నైపుణ్యాలను, యుద్ధ తంత్రాలను  నేర్పింది. భారతీయ సంస్కృతిని, రాజ్య రక్షణ అనే లక్ష్యాలతో శివాజీ తల్లి  జీజీబాయి  సంరక్షణలో పెరిగారు. 


16 ఏళ్లకే కత్తి పట్టిన యువ శివాజీ


 యువ శివాజీగా ఉన్నప్పుడే మొఘలులపై  విజయం సాధించాలని,  హిందూ రాజ్యస్థాపన చేయాలని,స్వతంత్రగా రాజ్యం నిర్మించాలన్న గొప్ప లక్ష్యాలు  ఉండేవి.  అందుకు అనుగుణంగా స్వంత సైన్యాన్ని తయారు చేసుకున్నాడు.   తన లక్ష్య సాధన కోసం ఏకంగా మొఘులుల సేనాధిపతి మహమ్మద్ ఆదిల్ షా నే ఎదుర్కొన్నాడు. అప్పుడు ఆదిల్ షా బిజాపూర్ సంస్థానానికి పాలకుడిగా ఉన్నారు.  మొదటి దెబ్బ తను పుట్టిన సంస్థానాధీశుడిపైన వేయాలని 16 ఏళ్ల శివాజీ సంకల్పించాడు.  అందు కోసం 1654లో ఆదిల్ షా ఆధీనంలో ఉన్న టోర్నా కోటను స్వాధీనం చేసుకున్నాడు. చాలా రహస్యంగా,  చాకచక్యంగా  ఆ కోటలోకి తన సైన్యంతో ప్రవేశించి , ఆదిల్ షా  సైన్యాన్ని ఓడించి  కోటను స్వాధీనం చేసుకోవడం మన యువ వీర శివాజీ  యుద్ధ నైపుణ్యానికి ప్రతీకగా చెప్పుకోవచ్చు.


 శివాజీ యుద్ధనైపుణ్యానికి ప్రతీక టోర్నా కోట స్వాధీనం


టోర్నా కోట స్వాధీనం చేసుకోవాడనికి శివాజీ చక్కటి వార్ స్ట్రాటజీని అమలు చేశారనే చెప్పాలి. ఆ కోటలోకి వెళ్లడానికి రహస్య మార్గాలను శివాజీ సైన్యం అన్వేషించింది. బీజాపూర్ సుల్తాన్ సైన్యం  ఊహించని గుట్టల ప్రాంతాన్ని  శివాజీ మహరాజ్ కోట స్వాధీనం చేసుకోవాడనికి ఉపయోగించుకున్నారు.  సుల్తాన్ సైన్యం అలసిపోయి విశ్రమించే సమయాన్ని కోటపై దాడికి ఎంచుకున్నారు. పగటి సమయంలో కోటను తన పరిమిత సైన్యంతో దాడి చేసి స్వాధీనం చేసుకోవడం కష్టసాధ్యమైన పని అని శివాజీ అర్థ రాత్రి వేళ,సుల్తాన్ సైన్యం అలసిపోయి విశ్రమించే సమయంలో, అది  ఈ మార్గంలో కోటపై దాడి జరిగే అవకాశం ఉందన్న ఆలోచన కూడా లేని మార్గాన్ని శివాజీ ఎంచుకుని మెరుపుదాడి చేశారు.  శివాజీ సైన్యం చూపిన తెగువకు  ఆదిల్ షా సుల్తాన్ సైన్యం  కోటను విడిచి పారిపోయింది. ఇలా పదహారేళ్లకే వీర శివాజీ తన యుద్ధ నైపుణ్యాన్ని చూపించి మరాఠా సామ్రాజ్య స్థాపను బీజం వేశారు.  ఇది  ఆయన తొలి విజయం. 


Also Read: Chhatrapati Sambhaji Maharaj: చావు సిగ్గుతో తలదించుకున్న వేళ! శంభాజీ మహారాజును ఔరంగజేబు ఎంత దారుణంగా చంపించాడంటే..