Chandrayaan-3 Mission:
చంద్రయాన్ 3 కి కౌంట్‌డౌన్ మొదలు
చంద్రయాన్ 3 మిషన్‌కి మరి కొద్ది గంటలే మిగిలి ఉన్నాయి. దేశమంతా ఈ ప్రయోగంపై చాలా ఆసక్తిగా ఎదురు చూస్తోంది. చంద్రయాన్ 2 ఫెయిల్ అవ్వడం వల్ల చంద్రయాన్ 3ని ఛాలెంజ్‌గా తీసుకుంది ఇస్రో. ఈ సారి కచ్చితంగా విజయం సాధిస్తామన్న ధీమాతో ఉన్నారు సైంటిస్ట్‌లు. ఈ క్రమంలోనే తిరుపతి ఆలయాన్ని సందర్శించారు. చంద్రయాన్ 3 మిషన్ సక్సెస్ కావాలని వెంకన్న స్వామిని కోరుకున్నారు. చంద్రయాన్ 3కి సంబంధించిన మినియేచర్ మోడల్‌ని తమతో పాటు తీసుకొచ్చారు. వెంకన్న సన్నిధిలో ఉంచి ప్రార్థనలు చేశారు. మొత్తం 8 మంది సైంటిస్ట్‌లు తిరుపతి బాలాజీని సందర్శించుకున్నారు. ఇస్రో ఛైర్మన్ ఎస్ సోమనాథ్ శ్రీ చెంగలమ్మ ఆలయం వద్ద ప్రార్థనలు చేశారు. అనుకున్నట్టుగా ఈ మిషన్ సక్కెస్ అవ్వాలని, చంద్రుడిపై సేఫ్‌గా ల్యాండ్ అవ్వాలని కోరుకున్నారు.
"చంద్రయాన్ 3 ప్రయాణం త్వరలోనే మొదలవనుంది. అంతా సరిగానే జరుగుతుందని విశ్వసిస్తున్నాం. అనుకున్నట్టుగానే ఆగస్టు 23వ తేదీన చంద్రుడిపై అది ల్యాండ్ అవుతుందని అనుకుంటున్నాం"
- ఎస్ సోమనాథ్, ఇస్రో ఛైర్మన్
ఇక చంద్రయాన్ 3 మిష్ కౌంట్ డౌన్ మొదలు కానుంది. దాదాపు 26 గంటల పాటు ఇది కొనసాగుతుంది. ఇప్పటికే లాంఛింగ్ రిహార్సల్ చేపట్టింది ఇస్రో.