Chandrayaan-3: 100 కి.మీ వృత్తాకార కక్ష్య నుంచి చంద్రుడిపైకి చంద్రయాన్-3 దించడం అత్యంత క్లిష్టమైన దశ అని ఇస్రో చీఫ్ ఎస్ సోమనాథ్ తెలిపారు. 100 కి.మీ వృత్తాకార కక్ష్య నుంచి చంద్రుడికి దగ్గరగా వ్యోమనౌక కదలడం ప్రారంభించినప్పుడు చంద్రయాన్-3 అత్యంత క్లిష్టమైన దశ ప్రారంభమవుతుందని ఆయన చెప్పారు. చంద్రయాన్-3 కక్ష్య నిర్ధారణ ప్రక్రియ ఆగస్టు 9, 17 తేదీ మధ్య అంతరిక్ష నౌకను 100 కి.మీ వృత్తాకార కక్ష్యలో ఉంచడానికి ప్రణాళికలు వేస్తున్నట్లు చెప్పారు. మొత్తం మీద భారత్ చేపట్టిన మూడో చంద్రయాత్ర సక్రమంగానే సాగుతోందన్నారు.
లాంచ్ వెహికల్ మార్క్-3 రాకెట్ ద్వారా జూలై 14న ప్రయోగించిన చంద్రయాన్-3 అంతరిక్ష నౌక ఇప్పుడు చంద్రుని చుట్టూ 170 కి.మీ 4,313 కి.మీ దీర్ఘవృత్తాకార కక్ష్యలో తిరుగుతోంది. చంద్రయాన్-3ని చంద్రుని ఉపరితలానికి దగ్గరగా తరలించే ప్రక్రియ అత్యంత కీలకం, క్లిష్టతరం. విక్రమ్ ల్యాండర్ ఆగస్టు 23న చంద్రుడిపైకి దిగే అవకాశం ఉంది.
చంద్రయాన్ భూమి నుంచి చంద్రుడిపై 100 కి.మీ వరకు తమకు ఎలాంటి ఇబ్బంది కనిపించదని, భూమి నుంచి ల్యాండర్ స్థానాన్ని కచ్చితంగా అంచనా వేయడంలో మాత్రమే సమస్యలు ఉన్నాయని సోమనాథ్ తెలిపారు. ఇది చాలా క్లిష్టమైనవని, దానిని తాము కక్ష్య నిర్ధారణ ప్రక్రియ అని పిలుస్తామన్నారు. ఈ లెక్కలు అన్నీ సరిగ్గా ఉంటనే మిగిలిన ప్రక్రియను పూర్తి చేయవచ్చని ఆయన పేర్కొన్నారు.
గతంతో పోలిస్తే ఈసారి దానిని చాలా కరెక్ట్‌గా దించగలుగుతున్నామన్నారు. కక్ష్య మార్పులు ప్రణాళికాబద్ధంగా జరుగుతున్నాయని. ఎటువంటి తప్పులకు ఆస్కారం లేదని, ప్రయోగం కచ్చితంగా అద్భుతమైన ఫలితాలను చూపుతుందని, అంతా బాగానే ఉంటుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. చంద్రయాన్-2, 2019 మిషన్ పాక్షికంగా విజయవంతమైందని చంద్రునిపై అంతరిక్ష నౌకను ల్యాండ్ చేయడానికి ఆ అనుభవం చాలా ఉపయోగపడుతుందని అన్నారు.
చంద్రయాన్-2 అనుభవం చాలా ఉపయోగపడుతుందని, గత ప్రయోగంలో ఏ పొరపాట్లు, ఎక్కడ తాము ఫెయిల్ అయ్యామో చాలా వివరంగా పరిశీలించామన్నారు. అన్నింటిని సరి చేసుకుంటూ చంద్రయాన్-3లో చాలా మార్పులు చేస్తూ పునర్మించినట్లు సోమనాథ్ చెప్పారు. చంద్రయాన్-2 మిషన్ తీసిన చంద్రుని చిత్రాలను ఉపయోగించి చంద్రయాన్-3ని సురక్షితంగా ల్యాండింగ్ చేసేందుకు కీలక ప్రాంత్రాలు, ఏరియా కొలతలను పెంచామని వివరించారు.
గత వైఫల్యాలను అధిగమించడానికి మరింత శ్రద్ధగా, అంకిత భావంతో పనిచేశామని తెలిపారు. వీటన్నింటిని ధృవీకరించడానికి అత్యంత క్లిష్టమైన ప్రయోగాన్ని నిర్వహించినట్లు అని సోమనాథ్ చెప్పారు. శనివారం లూనార్ ఆర్బిట్ ఇన్సర్షన్ తర్వాత చంద్రుని కక్ష్యలోకి ప్రవేశించిన చంద్రయాన్-3 మొదటిసారి జాబిలి ఉపరితలాన్ని తన కెమెరా ద్వారా పంపింది.
'ఆగస్టు 5, 2023 రోజు చంద్రుని కక్ష్యలోకి ప్రవేశించిన సమయంలో చంద్రయాన్-3 స్పేస్ క్రాఫ్ట్ చంద్రుడిని తన కెమెరాల ద్వారా బంధించింది' అని ఇస్రో తన అధికారిక ట్విట్టర్ అకౌంట్ లో పోస్టు చేసింది. చంద్రయాన్-3 మిషన్ ఇప్పటి వరకు ప్రణాళికబద్ధంగా, విజయవంతంగా ఒక్కో దశను దాటుకుంటూ తన లక్ష్యం వైపు సాగుతోంది. విక్రమ్ ల్యాండర్ ను ఈ నెల చివర్లో ఆగస్టు 23వ తేదీన చంద్రుని ఉపరితలంపై సాఫ్ట్ ల్యాండింగ్ చేయనున్నట్లు ఇస్రో వెల్లడించింది.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి
Join Us on Telegram: https://t.me/abpdesamofficial