Chandrayaan 3 Landing LIVE: చంద్రయాన్ 3 సాఫ్ట్ ల్యాండింగ్ సక్సెస్‌ఫుల్ - చంద్రుడిపై కాలర్ ఎగరేసిన భారత్, లైవ్‌లో చూడండి
Chandrayaan 3 Landing LIVE Updates: యావత్ ప్రపంచమే ఆసక్తిగా ఎదురు చూస్తున్న చంద్రయాన్- 3 ప్రయోగం క్షణ క్షణ అప్‌డేట్ కోసం ఈ పేజ్‌ను ఫాలో అవ్వండి.
ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్ 3 ప్రయోగంలో కీలక దశ ముగిసింది. భారత శాస్త్రవేత్తలు అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు. విక్రమ్ ల్యాండర్ ను చంద్రుడిపై విజయంతంగా సాఫ్ట్ ల్యాండింగ్ చేశారు. అయితే జాబిల్లిపై ప్రస్తుతం సెకనుకు సెంటీమీటర్ వేగంతో ల్యాండర్ విక్రమ్ కదులుతోంది. చంద్రుడి ఉపరితలంపై అడుగుపెట్టిన వెంటనే ల్యాండర్ విక్రమ్ పని మొదలుపెట్టేసింది. అక్కడి నుంచి నాలుగు ఫొటోలను షేర్ చేసింది. ఈ ఫొటోలను ఇస్రో సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది. బెంగళూరు కేంద్రానికి, చంద్రయాన్ 3 ల్యాండర్ కు కనెక్షన్ కుదిరింది. హారిజాంటర్ వెలాసిటీ కెమెరా తీసిన చిత్రాలు ఇవి అని ఇస్రో పేర్కొంది.
చంద్రయానన్-3 ప్రయోగం విజయవంతం అయింది. చంద్రుడి దక్షిణ ధ్రువంపై సాఫ్ట్ ల్యాండింగ్ సక్సెస్ అయింది. రష్యాకు కూడా సాధ్యం కానీ ఫీట్ ను భారత్ సాధించింది. ఎంతో ఉత్కంఠకు దారితీసి చివరికి భారత త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడేలా చేసింది. విక్రమ్ ల్యాండర్ చంద్రుని ఉపరితలంపై సాఫ్ట్ ల్యాండింగ్ అయింది. పూర్తి కథనం చదవండి
ఇస్రో శాస్త్రవేత్తలు అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు. చంద్రయాన్ 3 స్పేస్ క్రాఫ్ట్ ల్యాండర్ విక్రమ్ చంద్రుడి నేలపైన సాఫ్ట్ ల్యాండింగ్ విజయవంతం అయింది. తద్వారా చంద్రుడి దక్షిణ ధృవంపై కాలుమోపిన తొలి దేశంగా భారత్ నిలిచింది. దాదాపు 7 వారాలుగా ఎదురు చూస్తున్న భారతీయులు విక్రమ్ సాఫ్ట్ ల్యాండింగ్ వీక్షిస్తూ సంబరపడ్డారు. చంద్రయాన్ 2 నేర్పిన పాఠాలతో భారత శాస్త్రవేత్తలు చంద్రయాన్ 3లో విక్రమ్ సాఫ్ట్ ల్యాండింగ్ అయిన క్షణంలో ఒక్కసారిగా శాస్త్రవేత్తల ముఖంలో ఆనందం వెల్లివిరిసింది. పూర్తి కథనం చదవండి
చంద్రయాన్ విజయంతో ఇస్రో శాస్ర్తవేత్తలను కృషిని కొనియాడారు. దీంతో భారత్ సరికొత్త చరిత్ర సృష్టించిందని మోదీ అన్నారు. చంద్రయాన్ సూపర్ సక్సెస్ మరీ కీలకమైన మైలురాయిగా పేర్కొన్న ప్రధాని తన జీవితం ధన్యమైందని అన్నారు. పూర్తి కథనం చదవండి
చంద్రుని దక్షిణ ధృవంపై ఇస్రో ద్వారా చంద్రయాన్-3 విజయవంతం పట్ల ఇస్రో శాస్త్రవేత్తలకు నందమూరి బాలకృష్ణ శుభాకాంక్షలు తెలిపారు. ‘‘చంద్రయాన్-3 విజయవంతంగా ప్రయోగించి చంద్రుడిపై ఉన్న ఆసక్తికర అంశాలను మానవాళికి అందించడంలో ముందడుగు వేసారు ఇస్రో శాస్త్రవేత్తలు. చంద్రుడిపై నివాస యోగ్యత, నీటి లభ్యత, జీవరాసుల మనుగడకు సంబంధించిన సమాచారం ప్రపంచానికి చేరవేయడంలో భారతదేశం ముందుంటుంది. ఎన్నో ప్రపంచ దేశాలకు ఆదర్శంగా మారిన భారత శాస్త్రవేత్తలకు, శాస్త్రవేత్తలను ప్రోత్సహించిన భారత ప్రభుత్వానికి శుభాకాంక్షలు. శాస్త్ర సాంకేతిక, బౌగోళిక, చంద్రమండల, అంతరిక్ష రంగాల్లో భారత్ గణనీయమైన అభివృద్ధి సాధించాలని కోరుకుంటున్నాను. 140 కోట్ల భారతీయుల కలను సాకారం చేసిన భారత శాస్త్రవేత్తలకు మరోక్కసారి శుభాభినందనలు’’ అని నందమూరి బాలకృష్ణ అన్నారు.
చంద్రయాన్ 3 స్పేస్ క్రాఫ్ట్ చంద్రుడి నేలపైన సాఫ్ట్ ల్యాండింగ్ విజయవంతం అయింది. 40 రోజులుగా ఎదురు చూస్తున్న కోట్లాది కళ్లు ఆ ఘట్టాన్ని చూసి ఆనందంతో సంబరపడిపోయాయి. సాఫ్ట్ ల్యాండింగ్ అయిన క్షణంలో ఒక్కసారిగా శాస్త్రవేత్తల ముఖంలో ఆనందం వెల్లివిరిసింది. ఒకరికొకరు అభినందనలు తెలుపుకున్నారు. అంతకుముందు అరగంట పాటు దేశమంతా అందరూ టీవీలు, ఫోన్ల తెరలకు అతుక్కుపోయి ఉత్కంఠగా సాఫ్ట్ ల్యాండింగ్ ప్రక్రియను తిలకించారు.
మరికాసేపట్లో చంద్రుడి దక్షిణ ధ్రువంపై చంద్రయాన్-3 మిషన్ లో భాగంగా విక్రమ్ ల్యాండర్ జాబిలిపై సాఫ్ట్ ల్యాండింగ్ కానుంది. అలా చంద్రుడి దక్షిణ ధ్రువంపై ల్యాండ్ అయిన మొదటి దేశంగా చరిత్ర సృష్టించనుంది భారత్.
The Journey of Chandrayaan 3 : ఇస్రో చంద్రయాన్ 3 జర్నీ ఇక్కడ వీక్షించండి
చంద్రయాన్ 3 సాఫ్ట్ ల్యాండింగ్ లైవ్
చంద్రయాన్ 3 సాఫ్ట్ ల్యాండింగ్ ప్రక్రియ మొదలు అయింది. దీనికి సంబంధించి ఇస్రో లైవ్ స్ట్రీమింగ్ స్టార్ట్ చేసింది. మీరు ఇక్కడ లైవ్‌లో చంద్రయాన్ 3 ల్యాండింగ్ చూడవచ్చు.
కాసేపట్లో హైదరాబాద్‌లోని బిర్లా ప్లానెటోరియంకు చేరుకున్న గవర్నర్ తమిళిసై
చంద్రయాన్ 3 లైవ్ ను ప్రత్యేకంగా వీక్షించనున్న గవర్నర్
చరిత్ర సృష్టించేందుకు భారత్ సిద్ధమైంది. ఈరోజు సాయంత్రం 6 గంటలకు చంద్రయాన్-4 ల్యాండర్ చంద్రుడిపై దిగనుంది. నాసా, యూరోపియన్ స్పేస్ కమిషన్ కూడా ఈ మిషన్ ను పర్యవేక్షించనున్నాయి. ల్యాండింగ్ సమయంలో ప్రధాని మోదీ దక్షిణాఫ్రికా నుంచి వర్చువల్గా దీన్ని పరిశీలించనున్నారు.
చంద్రయాన్ 3 విజయవంతం కావాలంటూ తిరుపతిలో శ్రీవారికి మొక్కులు సమర్పించుకున్నారు భక్తులు. తిరుపతిలోని అలిపిరి పాదాల మండపం వద్ద టెంకాయలు కొట్టిన భక్తులు చంద్రయాన్ సక్సెస్ అవుతుందన్న ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇస్రో శాస్త్రవేత్తల నిరంతర కృషితో కచ్చితంగా చంద్రుడిపైన చంద్రయాన్-3 ల్యాండ్ అవుతుందని నమ్మకంతో ఉన్నారు తిరుపతి వాసులు. చంద్రయాన్-3 విజయవంతంతో భారతదేశ ఒక చరిత్రను సృష్టిస్తుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు.
ఇస్రో సృష్టించబోయే చరిత్రను తిలకించేందుకు సిద్ధంగా ఉండాలని ప్రజలకు బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి ట్వీట్ చేశారు. చంద్రయాన్-3 నిర్దేశించని చంద్రునిపై దిగేందుకు సిద్ధమవుతోందన్నారు. టైం దగ్గర పడుతున్న కొద్దీ ఉత్సాహం పెరుగుతుందని అభిప్రాయపడ్డారు. చంద్రయాన్ విజయం కోసం ప్రార్థనలు చేస్తున్నారని పేర్కొన్నారు. 1.4 బిలియన్ల హృదయాలు ఇవి కలుపుతున్నాయని తెలిపారు.
1. రఫ్ బ్రేకింగ్
రఫ్ బ్రేకింగ్ లో చంద్రయాన్ ల్యాండర్ గంటకి 6వేల కిలోమీటర్ల స్పీడ్ తో ఉంటుంది. సో దాన్ని తగ్గించటానికి ల్యాండర్ కి ఉన్న నాలుగు చిన్నపాటి ఇంజన్లను మండిస్తారు. సో ల్యాండర్ రివర్స్ అయి వేగం తగ్గుతూ వస్తుంది. 11 నిమిషాలు ఈ ప్రక్రియ జరుగుతుంది.ఈ రఫ్ బ్రేకింగ్ స్టేజ్ కంప్లీట్ అయ్యేప్పటికి ఇంక చంద్రుడి ఉపరితలం 7.4 కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది. అప్పుడు
2. ఆటిట్యూడ్ హోల్డ్
ఇప్పుడు రివర్స్ ఉందని చెప్పుకున్న ల్యాండర్ తన యాంగిల్ 50 డిగ్రీస్ కి మార్చుకుంటుంది. ల్యాండర్ పొజిషన్ డిటెక్షన్ కెమెరా అని ఈ ల్యాండర్ కి ఓ కెమెరా పెట్టారు. అది పనిచేయటం మొదలుపెడుతుంది. ఇది ల్యాండర్ దిగటానికి ప్లేస్ ఎక్కడ బాగుంది. రాళ్లు రప్పలు ఏమన్నా ఉన్నాయా మొత్తం మానిటర్ చేస్తుంది. జస్ట్ పదిసెకన్లలో ఓ నిర్ణయానికి వస్తుంది. ఈ స్టేజ్ కంప్లీట్ అయ్యేప్పటికి ఇక చంద్రుడి ఉపరితలం 6.8 కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది.
3. ఫైన్ బ్రేకింగ్ దశ
దాదాపు మూడు నిమిషాలు ఉండే ఈ దశలో మొత్తం స్ట్రైట్ గా వచ్చేస్తుంది ల్యాండర్. సో దాని కాళ్లు ల్యాండ్ అయ్యేందుకు సిద్ధంగా నేల వైపుకు ఉంటాయి. వేగం మొత్తం సున్నాకు తగ్గిపోవాలి. ఇక చంద్రుడి ఉపరితలం జస్ట్ కిలోమీటరకు అంటే తక్కువకు వచ్చేస్తుంది. ఓ పది 12సెకన్లు కదలకుండా గాల్లో అలా వేలాడుతూ ఉంటుంది కూడా. ల్యాండింగ్ ప్రదేశాన్ని జస్ట్ ఓ సారి సరిచూసుకుని..ఇక ఫైనల్ స్టేజ్ కి రెడీ అయిపోతుంది.
4. టెర్మినల్ డిసెంట్ లేదా టచ్ డౌన్
ఇది ఇక ఫైనల్ స్టేజ్..ఈ దశ రెండు నిమిషాలు ఉంటుంది. చంద్రుడి ఉపరితలానికి 60మీటర్లకు చేరుకుంటుంది. ఫైనల్ గా మరోసారి రాళ్లు రప్పలు ఏమన్నాయా ఉన్నాయేమో చూసుకుని లేవనుకుంటే ఓకే..లేదంటే కొంచెం పక్కకు జరుగుతుంది. 150మీటర్ల వరకూ పక్కకు జరిగేలా ఇస్రో శాస్త్రవేత్తలు విక్రమ్ ల్యాండర్ లో ఏర్పాట్లు చేశారు. సో అలా ప్లేస్ ఫైనల్ చేసుకుని దిగటం స్టార్ట్ చేస్తుంది మొత్తం ల్యాండర్ నాలుగు కాళ్లు చంద్రుడి దక్షిణధృవం ఉపరితలంపై ఆనతాయి. ల్యాండర్ లో ఉండే టచ్ డౌన్ సెన్సర్లు వెంటనే మన ఇస్రోకు ఇన్ఫర్మేషన్ ను పంపిస్తాయి సేఫ్ గా ల్యాండ్ అయిపోయిందని. ఇంజిన్లు కూడా ఆఫ్ అయిపోతాయి.
సో ఇది ఈ 17 నిమిషాల టైమ్ లో ఈ దశలన్నీ కంప్లీట్ అయితే ఇస్రో చంద్రుడి దక్షిణధృవంపై ల్యాండర్ ను దింపిన తొలి అంతరిక్ష సంస్థగా సరికొత్త చరిత్ర సృష్టిస్తుంది.
చంద్రుడిపై ప్రయోగాలకు ఇస్రో చేపట్టిన చంద్రయాన్ 3 ప్రయోగం తుది దశకు చేరుకుంది. చంద్రయాన్-3 జూలై 14న మధ్యాహ్నం 2:35 గంటలకు శ్రీహరికోట రేంజ్ లోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ప్రయోగించారు భారత శాస్త్రవేత్తలు. ఆగస్టు 23న సాయంత్రం 6 గంటల 4 నిమిషాలకు చంద్రుడిపై ల్యాండర్ విక్రమ్ మాడ్యుల్ సాఫ్ట్ ల్యాండ్ జరగనుంది. అయితే కీలకమైన సాఫ్ట్ సమయంలో ఇస్రో శాస్త్రవేత్తలకు విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ కదలికల్ని జాగ్రత్తగా నిర్వహించాలి. అందుకోసం సిగ్నల్స్ ను నిర్వహించేందుకు ఇస్రోకు నాసా, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ (ESA) సహకరిస్తామని ప్రకటించాయి.
ఆస్ట్రేలియాలోని న్యూ నోర్సియా అనే గ్రౌండ్ స్టేషన్ సైతం నేడు చంద్రుడిపై కీలకమైన ల్యాండింగ్ ప్రాసెస్ లో ఇస్రోకు సహకారం అందిస్తామని తెలిపింది. భారత్ కు చెందిన ఇస్రో శాస్త్రవేత్తలు వినియోగించే సొంత టెక్నాలజీ, యాంటెన్నాతో పాటు కమ్యూనికేషన్ కోసం, సిగ్నల్స్ ను సరైన విధంగా ట్రాక్ చేయడానికి నాసా, యూరప్ స్పేస్ ఏజెన్సీలు తమ యాంటెన్నాతో సహకరించడానికి సిద్ధంగాఉన్నాయి.
చంద్రయాన్-2 సమయంలో ఎదురైన సాంకేతిక సమస్యలపై శివన్ మాట్లాడుతూ.. చంద్రయాన్-3లో లోపాలను సరిదిద్దినట్లు చెప్పారు. డిజైన్ మార్జిన్‌లు మెరుగుపరిచారని, మిషన్ విజయవంతం కావడానికి సిస్టమ్‌లో రిడెండెన్సీలు చేర్చినట్లు తెలిపారు. ఇస్రో శాస్త్రవేత్తల గొప్పదనాన్ని ఆయన మెచ్చుకున్నారు. నిరాశల నుంచి వేగంగా పుంజుకుని కొత్త మిషన్ ప్రారంభంచారని, మిషన్ డేటాను వేగంగా విశ్లేషించడం, సమస్యలను గుర్తించడంలో ఇస్రో సామర్థ్యాన్ని ప్రతిబింబిస్తుందన్నారు.
విక్రం ల్యాండింగ్ సమయంలో ల్యాండర్ మాడ్యూల్‌కు సంబంధించి ఏవైనా ప్రతికూల అంశాలు తలెత్తితే చంద్రుడిపై ల్యాండింగ్‌ను ఆగస్టు 27కి మార్చనున్నట్లు అహ్మదాబాద్‌లోని ఇస్రో స్పేస్ అప్లికేషన్ సెంటర్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న నిలేష్ ఎం.దేశాయ్ వెల్లడించారు. మాడ్యూల్ స్థితి, చంద్రుడికి సంబంధించి ప్రతికూల పరిస్థితులు బట్టి ల్యాండింగ్‌పై నిర్ణయం తీసుకుంటామన్నారు.
ఇస్రో చేపట్టిన ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ చంద్రయాన్ -3 సేఫ్ ల్యాండింగ్ బుధవారం సాయంత్రం జరగనుంది. జాబిల్లిపై చంద్రయాన్ 3 ల్యాండర్ విక్రమ్ సాఫ్ట్ ల్యాండింగ్ చేయనుంది. అందుకే ఆగస్టు 23న. సాయంత్రం జరిగే సేఫ్ ల్యాండింగ్ కోసం ప్రపంచ దేశాలు ఉత్కంఠగా చూస్తున్నాయి. ఈ క్రమంలో తెలంగాణ విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీల్లో ఈ చారిత్రక ఘట్టాన్ని విద్యార్థులు లైవ్ లో వీక్షించేలా ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు డీఈవోలు, ప్రిన్సిపల్స్ కు స్కూల్ ఎడ్యూకేషన్ డైరెక్టర్ ఉత్తర్వులు ఇచ్చారు.
మరి కొన్ని గంటల్లో చంద్రుడి దక్షిణ ధ్రువంపై చంద్రయాన్-3 కాలుమోపనుంది. విక్రమ్ ల్యాండర్ సాఫ్ట్ ల్యాండింగ్ చేసి.. జాబిలి దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టిన మొట్టమొదటి దేశంగా నిలవనుంది. అయితే ఈ ప్రయోగంలో అత్యంత కీలకమైనది, క్లిష్టమైనది, తప్పులు జరగడానికి అత్యంత ఎక్కువ అవకాశాలు ఉన్నది 20 నిమిషాల సమయం. ఆ 20 నిమిషాల సమయంలో దేశం మొత్తం ఎంతో ఉత్కంఠగా ఉండనుంది. టీ20 మ్యాచ్ లో ఆఖరి ఓవర్లో, ఆఖరి బంతికి ఎలాంటి టెన్షన్ ఉంటుందో అంతకు మించిన ఉత్కంఠ, ఒత్తిడి, టెన్షన్ ఉంటుందనడంలో సందేహం లేదు.
Chandrayaan 3 Landing: మరికొన్ని గంటల్లో ఇస్రో చరిత్ర పుటల్లోకి ఎక్కనుంది. చంద్రుడి దక్షిణ ధ్రువంపై ల్యాండ్ అయిన మొదటి దేశంగా నిలిచేందుకు సిద్ధమైంది. బుధవారం ఉదయం 6.04 గంటలకు చంద్రుని దక్షిణ ధ్రువంపై చంద్రయాన్-3 విక్రమ్ ల్యాండర్ సాఫ్ట్ ల్యాండింగ్ కానుంది. ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా అత్యంత పకడ్బందీగా తీర్చిదిద్దిన విక్రమ్ ల్యాండర్ ప్రణాళికాబద్ధంగా ల్యాండ్ అయ్యేందుకు సిద్ధంగా ఉంది. విక్రమ్ ల్యాండర్ సజావుగా దిగితే.. చంద్రుని దక్షిణ ధ్రువంపై ల్యాండ్ అయిన మొదటి దేశంగా భారత్ నిలుస్తుంది. అయితే ఇక్కడితో పని అయిపోలేదు.
Background
Chandrayaan 3 Landing LIVE Updates: భారత కీర్తి పతాక సగర్వంగా ఎగిరే క్షణం అరుదైన ఘట్టం మరికొన్ని గంటల్లో ఆవిష్కృతం కానుంది. యావత్ ప్రపంచమే శభాష్ అనే తరుణం రానే వచ్చింది. సాంకేతికంగా ఎన్నో అడుగులు ముందున్న దేశాలకి కూడా సాధ్యం కాని చారిత్రాత్మకమైన మరెవరూ సాధించలేని అరుదైన ఫీట్ భారత్ అంతరిక్ష సంస్థ సొంత కానుంది. అంతరిక్ష రంగంలో హేమాహేమీలు ఉన్నప్పటి వారు చేరుకోలేని ప్రాంతంలో భారతీయ జెండా రెపరెపలాడబోతోంది.
యావత్ ప్రపంచం ఆగస్టు 23 కోసం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. చంద్రుడి రహస్యాలను ఛేదించేందుకు ప్రయోగించిన 'చంద్రయాన్-3' ప్రయోగం ప్రస్తుతం కీలక దశకు చేరుకుంది. చంద్రుడిపై అడుగుపెట్టే ఘడియలు దగ్గరపడుతున్నా కొద్దీ మరింత ఆసక్తి పెరగుతోంది. చంద్రుడిపై నమూనాలను సేకరించేందుకు ప్రయోగించిన విక్రమ్ ల్యాండర్ చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండ్ కావాలని అంతా కోరుకుంటున్నారు. మరీ ముఖ్యంగా రష్యా ప్రయోగించిన 'లూనా-25' ప్రయోగం విఫలం కావడంతో చంద్రయాన్-3పై అందరి దృష్టిపడింది. ల్యాండింగ్ కనుక విజయవంతమైతే అంతరిక్ష చరిత్రలో భారత్ సరికొత్త రికార్డు నిలిపిన దేశంగా మారనుంది.
ఇస్రో చేపట్టిన ప్రతిష్ఠాత్మక చంద్రయాన్-3 ల్యాండర్ మాడ్యూల్.. చందమామకు మరింత చేరువైంది. ప్రొపల్షన్ మాడ్యుల్ నుంచి ఇప్పటికే విడిపోయిన విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ ప్రస్తుతం.. చంద్రుడి చుట్టూ పరిభ్రమిస్తున్నాయి. ఈ క్రమంలో ఇస్రో సోమవారం (ఆగస్టు 21) కీలక ప్రకటన చేసింది. 2019 జూలై 22న ఇస్రో చంద్రయాన్-2 ఆర్బిటర్‌ను ప్రయోగించిన సంగతి తెలిసిందే. ఈ ఆర్బిటర్ ప్రస్తుతం చంద్రుడి చుట్టూ కక్ష్యలో పరిభ్రమిస్తోన్నంది. ఈ ఆర్బిటర్‌తో చంద్రయాన్-3కి చెందిన ల్యాండర్ మాడ్యుల్‌ను విజయవంతంగా అనుసంధానించినట్లు ఇస్రో ట్వీట్ చేసింది. చంద్రయాన్ 3 ల్యాండర్ మాడ్యుల్‌కు చంద్రయాన్ 2 ఆర్బిటర్ స్వాగతం పలికిందన్నది ఆ ట్వీట్ సారాంశం.
స్వాగతం.. మిత్రమా! చంద్రయాన్-2 ఆర్బిటర్.. చంద్రయాన్-3 ల్యాండర్ మాడ్యుల్‌ను స్వాగతిస్తోంది. ప్రస్తుతం ఈ రెండింటి మధ్య పరస్పర సమాచార మార్పిడి జరుగుతోంది. డేటాను ఎక్స్ఛేంజ్ చేసుకుంటున్నాయి. ల్యాండర్ మాడ్యుల్‌ను చేరుకునేందుకు బెంగళూరులోని ఇస్ట్రాక్ కేంద్రానికి ఇప్పుడు మరిన్ని దారులు ఉన్నాయి.. అని ఇస్రో ట్వీట్ చేసింది.
రష్యా లూనా 25 ల్యాండర్ చంద్రుడిపై కుప్పకూలడంతో ప్రపంచమంతా భారత్ వైపు చూస్తోంది. ఇస్రో పంపిన చంద్రయాన్ 3 జాబిల్లి దక్షిణ ధృవంపై సాఫ్ట్ ల్యాండ్ అవుతుందా అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. చంద్రుడి దక్షిణ ధృవంపై ల్యాండర్ ను దింపాలన్న ప్రయోగాలు ఎందుకు విఫలమవుతున్నాయి. ఇప్పుడు ఇదే మిలియన్ డాలర్ల ప్రశ్న. 2019లో చంద్రయాన్ 2, ప్రస్తుతం రష్యా లూనా 25 ఫెయిలయ్యాయి. సౌత్ పోల్ మీద ల్యాండర్ దింపాలనుకున్న ప్రతీసారి ఎందుకు సైంటిస్టుల్లో వణుకు మొదలవుతుంది. వాస్తవానికి అమెరికా నాసాకు, సోవియట్ యూనియన్ కు, చైనా కు చంద్రుడి ల్యాండర్ ను దింపిన అనుభవం ఉంది. కానీ ఈ మూడు కూడా ల్యాండర్ ను దింపింది నార్త్ పోల్ దగ్గరే. చంద్రుడి సౌత్ పోల్ (South Pole of Moon) దగ్గర ల్యాండర్ ను దింపాలన్న ఆలోచన కూడా చేయలేదు మిగిలిన దేశాలు.
జాబిల్లి దక్షిణ ధృవంపై ఎలాగైనా సరే మిషన్ ను ల్యాండ్ చేయాలన్న టాస్క్ ను భారత్ ముందుగా తలకెత్తుకుంది. చంద్రయాన్ 1 తో చంద్రుడిపై నీటి జాడలను కనుగొన్న ఇస్రో రెట్టించిన ఉత్సాహంతో 2019లో చంద్రయాన్ 2 ప్రయోగం చేసింది. విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ ను చంద్రయాన్ 2 మాడ్యూల్ లో పంపి సౌత్ పోల్ మీద దింపాలనుకున్నా అది సాధ్యం కాలేదు. చంద్రయాన్ 2 క్రాష్ ల్యాండ్ కావటంతో అప్పటి ఇస్రో ఛైర్మన్ శివన్ ప్రధాని మోదీని పట్టుకుని మరీ వెక్కి వెక్కి ఏడ్చిన ఘటనను ఎవరూ మర్చిపోలేరు.
ఇప్పుడు రష్యా కూడా ఎంతో అనుభవం ఉన్నా చంద్రుడి సౌత్ పోల్ మీద ల్యాండర్ ను దింపలేకపోయింది. అంతరిక్ష ప్రయోగాలన్నీ ఎప్పుడూ కూడా ట్రైల్ అండ్ ఎర్రర్ మోడ్ లోనే జరుగుతాయి. కానీ చంద్రుడి సౌత్ పోల్ సంగతి వేరు.చంద్రుడు ఒకే నిర్దిక్ష కక్ష్యలో భూమి చుట్టూ గిరగిరా తిరుగుతుండటంతో చంద్రుడి సౌత్ పోల్ మిస్టీరియస్ గా మారింది. చంద్రుడి మీద ఉత్తర ధృవం దగ్గర పగలు సమయంలో ఉష్ణోగ్రత 54 డిగ్రీలవరకూ ఉంటే... దక్షిణ ధృవంలో రాత్రి సమయాల్లో అది -203 డిగ్రీలవరకూ ఉంటూ కఠిన పరిస్థితులను తలపిస్తూ ఉంటుంది.
- - - - - - - - - Advertisement - - - - - - - - -