సీనియర్ ఎన్‌టీఆర్ స్మారక నాణెం విడుదల, కార్యక్రమానికి పలువురు ప్రముఖులు
NTR Rs 100 Coin: ఎన్‌టీఆర్ స్మారక రూ. 100 నాణెం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విడుదల చేశారు.
Ram Manohar Last Updated: 28 Aug 2023 11:56 AM
Background
NTR Rs 100 Coin:నందమూరి తారక రామారావు శతజయంతి ఉత్సవాల సందర్భంగా మరో అదురై దృశ్యం సాక్షాత్కారమైంది. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఎన్టీఆర్ ముఖ చిత్రం ఉన్న వంద రూపాయల నాణేన్ని విడుదల చేశారు....More
NTR Rs 100 Coin:నందమూరి తారక రామారావు శతజయంతి ఉత్సవాల సందర్భంగా మరో అదురై దృశ్యం సాక్షాత్కారమైంది. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఎన్టీఆర్ ముఖ చిత్రం ఉన్న వంద రూపాయల నాణేన్ని విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ కుటుంబ సభ్యులందరూ హాజరయ్యారు. కేంద్ర ప్రభుత్వం ఆహ్వానం మేరకు నందమూరి కుటుంబ సభ్యులంతా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎన్టీఆర్‌తో పరిచయం ఉన్న పలువురు ప్రముఖులు సైతం కార్యక్రమానికి హాజరయ్యారు. షూటింగ్‌లో బిజీగా ఉన్నందున జూనియర్ ఎన్టీఆర్, పాదయాత్రలో ఉన్నందున లోకేష్ హాజరుకాలేదు. ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలను పురస్కరించుకొని కేంద్ర ప్రభుత్వం ఎన్టీఆర్ నాణేన్ని ముద్రించింది. 44 మిల్లీ మీటర్ల చుట్టు కొలతతో ఉండే ఈ వంద రూపాయిల నాణేన్ని 50శాతం వెండి, 40 శాతం రాగి, 5 శాతం నికెల్, 5 శాతం జింక్‌తో తయారు చేశారు. ఈ నాణేనికి ఓ వైపు మూడు సింహాలతో పాటు అశోక చక్రం ఉండగా మరోవైపు ఎన్టీఆర్ చిత్రం, ఆ చిత్రం కింద నందమూరి తారక రామారావు శతజయంతి అని హిందీ భాషలో ముద్రించారు. ఆయన శతజయంతి ఈ ఏడాదితో ముగిసింది. కనుక 1923- 2023 అని ముద్రితమై ఉంటుంది.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
రాష్ట్రపతి ప్రశంసలు
ఎన్‌టీఆర్ పేరిట రూ.100 నాణెం విడుదల చేయాలన్న కేంద్ర ఆర్థిక శాఖ ప్రతిపాదించడం గొప్ప విషయం. పురంధేశ్వరి ఈ ప్రక్రియలో ముందు నుంచి అన్నీ దగ్గరుండి చూసుకున్నారు. తెలుగు సినిమా ద్వారా దేశ సంస్కృతిని చాటి చెప్పారు. రామాయణ, మహాభారతాలకు ఆయన నటనతో జీవం పోశారు. రాముడు, కృష్ణుడి చరిత్రని అందరికీ చాటి చెప్పారు. ఆయననే రాముడు అనుకునే స్థాయిలో నటించారు.
ద్రౌపది ముర్ము, రాష్ట్రపతి