Chandrayaan-3 inserted into the lunar orbit: భారత్ పతిష్టాత్మకంగా ప్రయోగించిన చంద్రయాన్-3 మిషన్ లో మరో కీలక ఘట్టం జరిగింది. చంద్రయాన్ 3 చంద్రుని కక్ష్యలోకి ప్రవేశించింది. భూ కక్ష్యలను పూర్తి చేసుకున్న చంద్రయాన్ 3 శనివారం రాత్రి ఏడు గంటల అనంతరం చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశించినట్లు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) తెలిపింది. ఈ ప్రయోగంలో అత్యంత కీలకమైన దశ చంద్రయాన్‌ను చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశపెట్టడం. అంతరిక్ష నౌక వేగాన్ని తగ్గించి కచ్చితమైన ప్రణాళికతో ట్రాన్స్ లూనార్ కక్ష్యలోకి చంద్రయాన్ 3 విజయవంతంగా ప్రవేశించింది. దాదాపు 18 రోజులపాటు చంద్రుడి కక్ష్యలో తిరగనున్న చంద్రయాన్ 3 చంద్రుడిపై దిగనుంది. అక్కడి నుంచి జాబిల్లిపై పరిశోధనలు కొనసాగుతాయి.






జులై 14న ఇస్రో శాస్త్రవేత్తలు చంద్రయాన్ 3 ప్రయోగం ప్రారంభించారు. భూమి నుంచి అన్ని కక్ష్యలు పూర్తి చేసుకున్న చంద్రయాన్ 3 నేడు(ఆగస్టు 5న) భూ కక్ష్య నుంచి విజయవంతంగా చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశించింది. దాదాపు 18 రోజులపాటు జాబిల్లి కక్ష్యలో తిరుగుతూ చివరగా ఆగస్టు 23 లేదా 24న చంద్రుడిపై ల్యాండ్ అయ్యే అవకాశం ఉంది. చంద్రయాన్-3 మిషన్ ఆగస్టు 23, 2023న సాయంత్రం 5.47 గంటలకు చంద్రునిపై ల్యాండ్ అవుతుందని ఇస్రో శాష్త్రవేత్తలు భావిస్తున్నారు. ఈ మిషన్ అంతరిక్ష పరిశోధనలో భారతదేశానికి కీలకం కాబోతుందని, భవిష్యత్తులో గ్రహాంతర కార్యకలాపాలకు మార్గం సుగమం చేస్తుంది. ఈ మిషన్ చంద్రుని ఉపరితలంపై సురక్షితంగా ల్యాండింగ్‌ చేసి చంద్రునిపై రోవర్‌ను దించడమే ఇస్రో లక్ష్యంగా పెట్టుకుంది. చంద్రయాన్ 2లో ల్యాండర్ విక్రమ్ చంద్రుడిపై సరిగ్గా ల్యాండ్ కాలేదు. ఈసారి దీన్ని అధిగమించి చంద్రుడి ఉపరితలంపై అది కూడా ఎవరూ ప్రయోగాలకు సాహసించని దక్షిణ ధ్రువంలో విక్రమ్ ను సేఫ్ గా ల్యాండ్ చేసేలా ఇస్రో శాస్త్రవేత్తలు చంద్రయాన్ 3ని ప్రయోగించారు.


చంద్రయాన్ భూమి నుంచి గురుత్వాకర్షణ శక్తి లేకుండా అంతరిక్షంలో తేలుతుంది. భూమి నుంచి వేగం, దూరం మిశ్రమం వ్యోమనౌక పడిపోకుండా అంతరిక్షంలోకి విసిరేయకుండా  సమతుల్యత పాటిస్తుంది. ఈ సమతుల్యతే చంద్రుడిని భూమి చుట్టూ తిరిగేలా చేస్తుంది. ఇదే సూత్రం చంద్రయాన్-3 తిరుగు ప్రయాణంలో వర్తిస్తుంది. ఇటువంటి పరిస్థితుల్లో ఇస్రో చంద్రయాన్‌ను తిరిగి భూమిపైకి తీసుకొచ్చేందుకు అంతరిక్ష నౌకకు ఆదేశాలు, సూచనలు ఇస్తుంది. ఈ దశలో ఖచ్చితమైన లెక్కలు, సమయం చాలా కీలకం. ఏ మాత్రం తేడా జరిగినా అంతరిక్ష నౌక అంతరిక్షంలో పోవడం లేదా, భూమి లేదా చంద్రునిపై క్రాష్ అయ్యే అవకాశం ఉంటుంది.. అదే జరిగితే, మిషన్‌ను మళ్లీ చంద్ర కక్ష్యలోకి ప్రవేశపెట్టడానికి తగినంత ఇంధనం ఉండకపోవచ్చని ఇస్రో మాజీ అధికారి ఒకరు తెలిపారు. ఇక్కడ మరో సమస్య ఏర్పడేందుకు అవకాశం ఉంది. రేడియేషన్‌తో కూడిన స్పేస్‌లో అంతరిక్షనౌక ఎక్కువ సేపు ఉండడం ద్వారా కొన్ని సాధనాలు పనిచేయకపోవచ్చు.