ABP  WhatsApp

Centre on Surrogate Ads: ఆ యాడ్‌లపై కేంద్రం నిషేధం- కొత్త మార్గదర్శకాలు జారీ

ABP Desam Updated at: 10 Jun 2022 04:53 PM (IST)
Edited By: Murali Krishna

Centre on Surrogate Ads: తప్పుదారి పట్టించే ప్రకటనలపై కేంద్రం ఉక్కుపాదం మోపింది. ఇందుకోసం కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది.

ఆ యాడ్‌లపై కేంద్రం నిషేధం- కొత్త మార్గదర్శకాలు జారీ

NEXT PREV

Centre on Surrogate Ads: తప్పుదారి పట్టించే ప్రకటనల నివారణకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం కొత్త మార్గదర్శకాలను శుక్రవారం విడుదల చేసింది. దీని ప్రకారం ఇక సరోగేట్ ప్రకటనలను నిషేధించనున్నారు. అలానే పిల్లలే లక్ష్యంగా చేసే యాడ్‌లపై కూడా షరతులు వర్తింపచేసేలా నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు వినియోగదారుల వ్యవహారాల సెక్రటరీ రోహిత్ కుమార్, అదనపు సెక్రటరీ నిధి ఖారే తెలిపారు. ఈ మార్గదర్శకాలను తప్పక పాటించాలని వాణిజ్య సంస్థలను కేంద్రం ఆదేశించింది.



ఈ మార్గదర్శకాలు అన్ని రకాల ప్రకటనలకు వర్తిస్తాయి. ఎలాంటి మాధ్యమాల్లో వచ్చే యాడ్‌లైనా సరే ఈ మార్గదర్శకాలను పాటించాల్సిందే. తయారీదారు, సర్వీస్ ప్రొవైడర్, వ్యాపారి ఇలా అందరూ ఈ మార్గదర్శకాలకు లోబడే ప్రకటనలు చేయాలి.  - కేంద్రం


సరోగేట్ అంటే



ఈ మార్గదర్శకాల ప్రకారం 'సరోగేట్ అడ్వర్టైజ్‌మెంట్' అనేది వస్తువులు లేదా సేవలకు సంబంధించిన ప్రకటనలను సూచిస్తుంది. చట్టం నిషేధించిన యాడ్‌లు ఈ కోవలోకి వస్తాయి. అటువంటి నిషేధం లేదా చట్టరీత్యా పరిమితమైన యాడ్‌లు ఎట్టి పరిస్థితుల్లోనూ చిత్రీకరించరాదని కేంద్ర స్పష్టం చేసింది. ఒక వేళ అలాంటి యాడ్‌లు ప్రసారం చేస్తే చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించింది.


ఇటీవల


మహిళలపై లైంగిక దాడులను ప్రేరేపించేలా ఉంటున్న వాణిజ్య ప్రకటనలకు అడ్డుకట్ట వేయడంపై కూడా కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ విధంగా ఉన్న యాడ్‌లను తమ తమ సామాజిక మాధ్యమ వేదికల నుంచి తొలగించాలంటూ కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ ఇటీవల ట్విట్టర్‌, యూట్యూబ్‌లకు లేఖలు రాసింది.


కొన్ని పరిమళ ద్రవ్యాల(పర్‌ఫ్యూమ్స్‌) ప్రకటనలు సామూహిక అత్యాచారాల సంస్కృతిని పెంచేలా ఉంటున్నాయని, వాటిని తొలగించాలని సూచించింది. మర్యాద, నైతికతలను దెబ్బతీసేలా మహిళలను చిత్రీకరిస్తున్న ఆ వీడియోలు మీడియా నియమాలను ఉల్లంఘించడం కిందికే వస్తాయని లేఖల్లో పేర్కొంది.


అడ్వర్టయిజ్‌మెంట్‌ స్టాండర్డ్స్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా (ఏఎస్‌సీఐ) సైతం ప్రకటనల తీరుపై ఓ కన్నేసి ఉంచాలని, మార్గదర్శకాలకు విరుద్ధంగా ఉన్నవాటిని తక్షణ ప్రాతిపదికన ఉపసంహరించుకునేలా ప్రకటనకర్తలను కోరాలని కేంద్ర మంత్రిత్వశాఖ తన లేఖలో పేర్కొంది. ఈ సూచనకు ఏఎస్‌సీఐ సానుకూలంగా స్పందించింది.


Also Read: Prophet Remark Row: దేశవ్యాప్తంగా ముస్లింల ఆందోళన- నుపుర్ శర్మను అరెస్ట్ చేయాలని డిమాండ్


Also Read: Also Read: Karnataka News: రోడ్డుపై రెచ్చిపోయిన ఎమ్మెల్యే కుమార్తె- పోలీసులతో గొడవ, వీడియో వైరల్!


 


Published at: 10 Jun 2022 04:28 PM (IST)

- - - - - - - - - Advertisement - - - - - - - - -

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.