రష్యా - ఉక్రెయిన్ మధ్య యుద్ధ పరిస్థితులు, ఢిల్లీలోని జహంగీర్ పీర్ ఘర్షణలపై టీవీ చానళ్లలో జరుగుతున్న అవాస్తవాల ప్రచారంపై కేంద్ర ప్రభుత్వం అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ మేరకు మీడియా చానళ్లకు ప్రత్యేకమైన అడ్వయిజరీ జారీ చేసింది. తాము జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారమే ఇక నుంచి వార్తా కథనాలు ఉండేలా చూసుకోవాలని ఆదేశించింది. 


నవనీత్ కౌర్ హనుమాన్ చాలీసా చదువుతానంటే ముంబై అట్టుడికిపోతోంది ! దీని వెనుక ఎంత రాజకీయం ఉందంటే ?


ఇటీవల టీవీ చానళ్లు, వెబ్ చానళ్లు, సోషల్ మీడియాల్లో  విద్వేషపూరితమైన, అభ్యంతరకమైన  భాషతో ఉండేలా ఏ మాత్రం నిజం కానీ .. సాధికారిత లేని వార్తలు ప్రచారం చేస్తే సెన్సేషనలిజానికి పాల్పడే ప్రయత్నం చేస్తున్నాయని కేంద్రం అభిప్రాయ పడింది. ఇది ప్రజలమధ్య విద్వేషాలకు దారి తీసేలా ఉన్నాయని ఇవన్నీ చట్టాలకు వ్యతిరేకంగా జరుగుతున్నాయని భావించింది. ముఖ్యంగా రష్యా -ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధించి.. అలాగే ఢిల్లీలోని జహంగీర్ పీర్ అల్లర్ల గురించి ఇలాంటి కథనాలు ఎక్కువగా వస్తున్నాయని గుర్తించింది. 


హౌరా బ్రిడ్జిపై గుట్కా మరకలకు బాలీవుడ్ స్టార్స్‌కు లింకేంటి ?


ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధించి టీవీ చానళ్లు నిర్వహిస్తున్న చర్చాకార్యక్రమాల్లో సంబంధం లేని అంశాలను క్లెయిమ్ చేస్తున్నారని .. ఇది పూర్తిగా ప్రజలను తప్పుదోవ పట్టించడమేనని కేంద్రం భావిస్తోంది. స్వయంగా యాంకర్లు, చానల్స్ కూడా ఫ్యాబ్రికేటెడ్ న్యూస్ ప్రజల్లోకి పంపేందుకు ప్రయత్నిస్తున్నారని కేంద్రం గుర్తించింది. జహంగీర్ పురి ఘర్షణల విషయంలో మరింత రెచ్చగొట్టేలా మీడియా చానళ్లు వ్యవహరించాయి. వెరీఫై చేయని సీసీ టీవీ ఫుటేజీలను ప్రసారం చేయడం.. ఫ్యాబ్రికేటెడ్ న్యూస్‌ను టెలికాస్ట్ చేసి.. అవి మత పరమైన గొడవలని చెప్పడం చేశాయని కేంద్రం అసహనం వ్యక్తం చేసింది. ఇవన్నీ శాంతికి విఘాతం కలిగిస్తున్నాయని కేంద్రం స్పష్టం చేసింది. 


మాఫీయా రాజ్ కారణంగానే కాంగ్రెస్ ఓడింది- సిద్ధు సంచలన కామెంట్స్‌- సీఎం మన్‌కు మద్దతుగా వ్యాఖ్యలు


కేంద్ర ఇన్‌ఫర్‌మేషన్ అండ్ బ్రాడ్ కాస్టింగ్ మినిస్ట్రీ ఈ విషయంలో స్పష్టమైన మార్గదర్శకాలు విడుదల చేసింది. ఢిల్లీ ఘర్షణలపై ప్రత్యేకంగా ఎలాంటి చర్చా కార్యక్రమాలు నిర్వహించవద్దని స్పష్టం చేసింది. మార్గదర్శకాల ప్రకారం మీడియా సంస్థలు తమ ప్రసారాలను నియంత్రించుకోవాలని ఆదేశించింది.  నిబంధనలు అతిక్రమిస్తే చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది.  యుద్దం, అల్లర్ల వార్తల ప్రసారాలపై ఎలాంటి మార్దర్శాకాలు పాటించాలో నిబంధనలను అన్ని మీడియా సంస్థలకు అందుబాటులో ఉంచింది.