రోడ్డు ప్రమాదాల్ని అరికట్టేందుకు కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై కార్ల తయారీ సంస్థలు కార్లలో ఆరు ఎయిర్ బ్యాగ్లను తప్పనిసరిగా ఏర్పాటుచేయాలని కేంద్ర రవాణాశాఖ, రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ సూచించారు. కేంద్ర రవాణా శాఖ లెక్కల ప్రకారం దేశంలో రోడ్డు ప్రమాదాలతో ప్రతి రోజు 400 మంది మరణిస్తున్నారు. ఏడాదికి 5 లక్షల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని తెలుస్తోందని, ఈ ప్రమాద బాధితుల్లో 1.5 లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారని తెలుస్తోంది. రోడ్డు ప్రమాదాల్ని అరికట్టేందుకు కేంద్రం కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇందులో భాగంగా కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ కొన్ని సూచనలు చేశారు. 


ఇటీవల కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఢిల్లీలో సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ తయారీదారుల సీఈఓల బృందంతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో రోడ్డు ప్రమాదాల్ని అరికట్టేందుకు కనీసం 6 ఎయిర్ బ్యాగ్లను కార్లలో ఏర్పాటు చేయాలని నితిన్ గడ్కరీ ఆటోమొబైల్ తయారీదారులకు తెలిపారు. ఒక ఎయిర్ బ్యాగ్ ఉన్న పాత కార్లలో రెండు ఎయిర్ బ్యాగ్‌లను అమర్చేందుకు ఈ ఏడాది డిసెంబర్ 31 వరకు గడుపు ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఏడాదిలోపు అన్నీ మోడళ్ల కార్లలో ఆరు ఎయిర్ బ్యాగ్స్‌తో పాటు యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్ ఏర్పాటు చేయాలని సూచించారు. ఏర్పాటు. ఇకపై అన్ని రకాల కారులలో క‌నీసం ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు తప్పనిసరి అని కార్ల త‌యారీ సంస్థలకు మంత్రి స్పష్టం చేశారు.   
Also Read: Kadapa Road Accident: కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇన్నోవా కారు-లారీ ఢీ.. నలుగురు మృతి


ఏడాది లోపు 100 శాతం ఇథ‌నాల్, పెట్రోల్‌తో న‌డిచే వాహ‌నాల‌ను మార్కెట్ లోకి తీసుకురావాలని నితిన్ గడ్కరీ కోరారు. ప్రయాణికుల భద్రతా ప్రయోజనాల మేరకు అన్ని రకాల కార్లలో ఆరు బ్యాగులు ఏర్పాటుచేయాలని నిర్ణయించినట్లు ఆయన తెలిపారు.  కార్లు, టూ వీల‌ర్స్ తయారీ సంస్థలు ప‌ర్యావ‌ర‌ణ నిబంధ‌న‌ల అమ‌లు గ‌డువును పొడిగించాల‌ని మంత్రి నితిన్ గడ్కరీని అభ్యర్థించారు. బీఎస్‌-6 ఫేస్ 2, కేఫ్ ఫేస్‌-2తోపాటు ద్విచక్ర వాహనాల కోసం తీసుకువచ్చిన ఓబీడీ రెగ్యులేష‌న్స్ అమ‌లు గ‌డువును పొడిగించాల‌న్నారు. వెహిక‌ల్ ఇంజినీరింగ్‌లో ఆటోమొబైల్ సంస్థ ప‌నితీరును ప్రశంసించారు. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు తప్పకుండా పాటిస్తే ప్రమాదాలు తగ్గుతాయని సూచించారు. ప్రమాదాల నివారణకు కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడూ చర్యలు తీసుకుంటోందని, ఇందులో భాగంగా ఎయిర్ బ్యాగ్స్ పెంపుపై నిర్ణయం తీసుకున్నామని వివరించారు.


Also Read:  BJP YCP Fight: రాబోయే రాజకీయ మార్పులకు ఇదే సంకేతమా? ఏపీ రాజకీయాల్లో పేర్ని నాని కామెంట్స్ కలకలం...