Central Government Good News To Women Staff: కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మహిళా ఉద్యోగులకు గుడ్ న్యూస్ అందించింది. ఇకపై సరోగసీ ద్వారా పిల్లలను పొందే కేంద్ర ప్రభుత్వ మహిళా ఉద్యోగులు ప్రసూతి సెలవులు పొందేలా చట్టంలో మార్పులు చేసింది. ఈ మేరకు 50 ఏళ్ల నాటి నిబంధనలను సవరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఛైల్డ్ కేర్ లీవ్‌తో అద్దె గర్భం ద్వారా బిడ్డలను పొందే తల్లిదండ్రులకు ఆ హక్కు కల్పిస్తూ సెంట్రల్ సివిల్ సర్వీసెస్ రూల్స్, 1972ను కేంద్రం సవరించింది.


180 రోజుల సెలవులు


సవరించిన నిబంధనల ప్రకారం కేంద్ర ప్రభుత్వ మహిళా ఉద్యోగులు సరోగసీ (అద్దె గర్భం) ద్వారా పిల్లలను కంటే 180 రోజుల వరకూ ప్రసూతి సెలవులు తీసుకోవచ్చు. అలాగే, సరోగసీ ద్వారా జన్మించిన పిల్లల విషయంలో ఇద్దరి కంటే తక్కువ ఉన్న పిల్లలు కలిగిన పురుష ఉద్యోగులు సైతం ఆ బిడ్డ పుట్టిన తేదీ నుంచి 15 రోజుల పితృత్వ లీవ్ తీసుకోవచ్చు. అది 6 నెలల లోపే తీసుకోవాల్సి ఉంటుంది. కాగా, ఇప్పటివరకూ సరోగసీ ద్వారా బిడ్డను కంటే మహిళా ప్రభుత్వ ఉద్యోగులకు ప్రసూతి సెలవులు మంజూరు చేయడం లేదు. మారిన నిబంధనలతో వారు కూడా సెలవులు తీసుకునేందుకు అవకాశం కలుగుతుంది.


Also Read: Loksabha Session: లోక్ సభ సమావేశాలు ప్రారంభం - ఎంపీగా ప్రధాని మోదీ ప్రమాణస్వీకారం