JP Nadda Resign: బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. జేపీ నడ్డా రాజీనామాను రాజ్యసభ చైర్మన్ ఆమోదించారు. నడ్డా హిమాచల్ ప్రదేశ్ నుంచి రాజ్యసభకు ప్రాతినిథ్యం వహించగా తాజాగా దానికి రాజీనామా చేశారు. ఆయన పదవీకాలం ఈ ఏడాది ఏప్రిల్‌లో ముగియనుంది. ఈయనతోపాటు మరో 57 మంది రాజ్యసభ సభ్యులకు కూడా పదవీ కాలం ముగుస్తుంది. బీజేపీ ప్రభుత్వం ఇటీవల నడ్డాను గుజరాత్‌ నుంచి రాజ్యసభకు నామినేట్‌ చేసింది. ఈ క్రమంలో హిమాచల్‌ ప్రదేశ్‌ నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న కౌన్సిల్‌ ఆఫ్‌ స్టేట్స్‌ (రాజ్యసభ)కు ఎన్నికైన నడ్డా రాజీనామా చేశారు. ఈ క్రమంలో రాజీనామాను చైర్మన్‌ ఆమోదించినట్లు రాజ్యసభ కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది.

Continues below advertisement


ఇటీవల ఫిబ్రవరి 27న 15 రాష్ట్రాల నుంచి 56 రాజ్యసభ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో బీజేపీ అధ్యక్షుడు నడ్డాను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గుజరాత్ నుంచి రాజ్యసభ ఎంపీగా ఎన్నికకాగా.. ఇకపై గుజరాత్‌ నుంచి రాజ్యసభ సభ్యుడిగా కొనసాగనున్నారు.


ఫిబ్రవరి 27న 15 రాష్ట్రాల్లోని 56 స్థానాలకు రాజ్యసభ ఎన్నికలు జరిగాయి. ఇందులో 41 స్థానాల్లో అభ్యర్థులు ఏకగ్రీవంగా విజయం సాధించారు. ఆయా స్థానాల్లో ఒకే ఒక్క అభ్యర్థి పోటీలో ఉన్నారు. మిగతా 15 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఈ స్థానాలు యూపీ, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక నుంచి వచ్చాయి. యూపీలో 10, హిమాచల్‌ ప్రదేశ్ లో 1, కర్ణాటకలో 4 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. యూపీలోని 10 సీట్లలో 8 బీజేపీకి, 2 ఎస్పీకి వచ్చాయి. అదే సమయంలో హిమాచల్‌ ప్రదేశ్ లో కూడా బీజేపీ విజయం సాధించింది. కర్ణాటకలో కాంగ్రెస్ 3 సీట్లు గెలుచుకోగా, బీజేపీ ఒక సీటు గెలుచుకుంది.